తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

చపాతీ, జొన్న రొట్టెల్లోకి అద్దిరిపోయే కాంబినేషన్ - మణిపురి స్పెషల్ "మంగళ్ ఊటీ" కర్రీ! - MANGAL OOTY RECIPE

బఠాణీలతో నిమిషాల్లో చేసుకునే సూపర్ రెసిపీ - ఒక్కసారి టేస్ట్ చేశారంటే అదరహో అనాల్సిందే!

Mangal Ooty Recipe
Manipuri Mangal Ooty Recipe (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Dec 3, 2024, 5:12 PM IST

Manipuri Mangal Ooty Recipe : రోటీ, నాన్‌, పులావ్‌లకు జతగా మంచి కర్రీ ఉంటే ఓ పట్టు పట్టేయొచ్చు కదూ. అందుకే.. మీకోసం పనీర్‌, గుడ్డు, చికెన్‌లతో చేసుకునేవే కాకుండా అద్దిరిపోయే ఒక వెజిటేరియన్ రెసిపీ పట్టుకొచ్చాం. అదే.. "మంగళ్ ఊటీ కర్రీ". ఇది మణిపురి వాసుల ప్రత్యేక వంటకం. టేస్ట్ సూపర్​గా ఉంటుంది! చపాతీ, జొన్న రొట్టెలు, నాన్​ వంటి వాటిల్లోకి ఈ కర్రీ కాంబినేషన్​ వేరే లెవల్​. పైగా దీన్ని ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా సులువు! మరి, ఇంకెందుకు ఆలస్యం ఈ సూపర్ టేస్టీ కర్రీకి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు :

  • బఠాణీలు - కప్పు
  • టమాటా - 1
  • ఉల్లిపాయలు - 2
  • పచ్చిమిర్చి - 3
  • తురిమిన అల్లం - 1 టేబుల్​స్పూన్
  • ఉప్పు - రుచికి సరిపడా
  • ఆవాలు - 1 టేబుల్​స్పూన్
  • పసుపు - అరటీస్పూన్
  • వంటసోడా - పావు చెంచా
  • జీలకర్ర - చెంచా
  • బిర్యానీ ఆకులు చిన్నవి - 2
  • నూనె - తగినంత
  • మసాలా మిక్స్చర్ - 2 టేబుల్​స్పూన్లు
  • కొత్తిమీర తరుగు - చారెడు
  • ఆనియన్ రింగ్స్, టమాటా స్లైసులు - కొన్ని(గార్నిష్ కోసం)

తయారీ విధానం :

  • ఇందుకోసం ముందు రోజు రాత్రి బఠాణీలను నానబెట్టుకోవాలి. మరుసటి రోజు ఉదయం శుభ్రంగా కడిగి కుక్కర్​లో వేసుకొని తగినన్ని వాటర్, ఉప్పు, సోడా వేసి రెండు విజిల్స్ వచ్చే వరకూ ఉడికించుకోవాలి.
  • బఠాణీలు ఉడికేలోపు రెసిపీలోకి కావాల్సిన ఉల్లిపాయ, టమాటాలు, పచ్చిమిర్చిని సన్నగా తరుక్కొని పక్కన పెట్టుకోవాలి. అలాగే అల్లం తరుగు సిద్ధం చేసి పెట్టుకోవాలి.
  • ఇప్పుడు స్టౌపై పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, బిర్యానీ ఆకులు, ముందుగా తరిగి పెట్టుకున్న సన్నని ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం తరుగు, పసుపు ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలి.
  • ఆపై స్టౌను మీడియం ఫ్లేమ్​లో ఉంచి ఉల్లిపాయలు గోధుమ రంగులోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి.
  • ఆవిధంగా వేయించుకున్నాక అందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను యాడ్ చేసుకొని సాఫ్ట్​గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి.
  • టమాటా ముక్కలు మెత్తగా అయ్యాక.. ఉడికించుకున్న బఠాణీలు, అరకప్పు వాటర్ యాడ్ చేసుకొని కలిపి ఏడెనిమిది నిమిషాల పాటు ఉడికించుకోవాలి.
  • ఆ తర్వాత మసాలా మిక్స్చర్ వేసుకొని మిశ్రమం మొత్తం కలిసేలా ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత లో ఫ్లేమ్ మీద కాసేపు మగ్గనివ్వాలి.
  • ఇక చివరగా కొత్తిమీర తరుగు వేసి కలిపి దింపేసుకోవాలి. ఆపై మిశ్రమాన్ని ఆనియన్ రింగ్స్, టమాటా స్లైసులతో గార్నిష్ చేసుకుంటే చాలు. అంతే.. నోరూరించే మణిపురి "మంగళ్ ఊటీ" రెడీ!

ABOUT THE AUTHOR

...view details