Legal Advice on Dowry :ఎన్నో ఏళ్లుగా సమాజాన్ని పట్టి పీడిస్తున్న దురాచారాలలో వరకట్నం ఒకటి. ప్రస్తుత ఆధునిక యుగంలో కూడా.. చాలా పేద, మధ్యతరగతి కుటుంబాలను ఈ సమస్య వెంటాడుతూనే ఉంది. కట్నం వేధింపులతో నేటికీ ఏదో ఒక చోట మహిళలుబలవుతూనే ఉన్నారు. అయితే, కట్నం వేధింపులతోఇబ్బంది పడుతున్న ఓ మహిళ న్యాయ నిపుణుల సలహా కోరుతున్నారు. ఇంతకీ ఆమె సమస్య ఏంటో ఇప్పుడు చూద్దాం.
ఇదీ సమస్య..
నా పెళ్లి సమయంలో మా వాళ్లు రూ.25 లక్షల నగదు, 50 తులాల బంగారం కట్నంగా ఇచ్చారు. పెళ్లై ఏడాదైనా కాకుండానే నా ప్రమేయం లేకుండా.. నగలను బ్యాంకులో తాకట్టు పెట్టారు. ఆ ఆభరణాలు మా అమ్మమ్మ నుంచి వారసత్వంగా వచ్చినవి. వచ్చే నెలలో మా చెల్లి పెళ్లి ఉంది. ఆ పెళ్లి సమయానికైనా విడిపించమని ఎంతో బతిమిలాడాను. 'నగలు వేసుకోకపోతే ఏమవుతుంది? మీ పుట్టింటి నుంచి డబ్బు తెచ్చి తీసుకో' అని అంటున్నారు. అసలు నా నగల్ని తీసుకునే హక్కు వారికి ఉంటుందా? ఈ వివాహ బంధంలో ఎక్కువ రోజులు ఉండలేననిపిస్తోంది. నేనేం చేయాలి? అని ఓ మహిళ అడుగుతున్నారు. మరి.. ఈ సమస్యకు ప్రముఖ న్యాయవాది 'జి. వరలక్ష్మి' ఎలాంటి ఆన్సర్ ఇచ్చారో ఇప్పుడు తెలుసుకుందాం.
1961లో వరకట్న నిషేధచట్టం అమలులోకి వచ్చింది. ఈ చట్టం ప్రకారం.. కట్నం ఇవ్వడం, తీసుకోవడం రెండూ నేరమే. పెళ్లప్పుడు ఇచ్చిన నగలు, డబ్బు, ఆస్తులుఅన్నీ కట్నం కిందకే వస్తాయి. వరకట్న నిషేధ చట్టానికి 1986లో కొన్ని మార్పులు చేశారు. మార్పుల ప్రకారం.. కనీస శిక్షగా ఐదేళ్ల జైలు, 25 వేల రూపాయల జరిమానా నిర్ణయించారు. అంతేకాదు.. ఇది నాన్ బెయిలబుల్ నేరంగా మార్చారు.
"వరకట్న నిషేధం కోసం ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు చేసినప్పటికీ ఇంకా.. కట్నం బాధలు ఎక్కువవుతూనే ఉన్నాయి. ఈ చట్టంలోని సెక్షన్ 6 ప్రకారం.. కట్నంగా ఇచ్చిన నగదు, ఆస్తిని మూడు నెలల్లోగా ఆ వధువు పేరు మీదకు బదిలీ చేయాలి. అలా చేయకపోతే.. 6 నెలల నుంచి రెండేళ్ల వరకూ జైలు శిక్ష పడే అవకాశం ఉంది."- జి. వరలక్ష్మి (న్యాయవాది)
ఎన్నేళ్లయినా కట్నం తెమ్మని అడగడం నేరమే..