తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

మీరు కొరియన్​ బ్యూటీలా మారాలా? - ఈ టిప్స్​ ఫాలో అయితే బెస్ట్​ రిజల్ట్​! - KOREAN SKIN CARE TIPS IN TELUGU

- మేకప్​ వేసుకునే అవసరం లేకుండానే కొరియన్​ బ్యూటీలా మారిపోవచ్చు - ఈ టిప్స్​ పాటిస్తే ఆకర్షణీయమైన, మెరిసే చర్మం మీ సొంతం

Korean Beauty Tips in Telugu
Korean Skin Care Tips in Telugu (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Nov 29, 2024, 12:12 PM IST

Korean Skin Care Tips in Telugu: కొరియన్​ మహిళలు ముచ్చటగా, పాలరాతి శిల్పంలా మెరిసిపోతుంటారు. నాలుగు పదుల వయసులోనూ చూపు తిప్పుకోలేని అందం వారి సొంతం. అందుకే కొరియన్ల అందానికి ఫిదా అయిపోతూ అలాంటి గ్లాసీ లుక్‌ కావాలని కోరుకునే అమ్మాయిలు ఎక్కువమందే. అందుకే ఇండియాలో కొరియన్‌ డ్రామాల్ని చూసేవారే కాదు.. బ్యూటీ ఉత్పత్తులను వినియోగించేవారూ అధికమే. మరి మీరు కూడా కొరియన్​ బ్యూటీలా మెరిసిపోవాలా? అయితే ఈ టిప్స్​ ఫాలో అయితే సరి అంటున్నారు నిపుణులు. ఇంతకీ అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

  • చర్మం పాలరాయిలా మెరిసిపోయేందుకు కొరియన్​ యువతులు ఎక్కువగా ఆవిరి పట్టడం వంటివి చేస్తుంటారు. ముఖానికి ఆవిరి పట్టడం వల్ల చర్మ గ్రంథుల్లో చిక్కుకున్న మలినాలు సులువుగా బయటకి వస్తాయి. ఆపై మసాజ్‌ చేయడం వల్ల రక్తప్రసరణ మెరుగుపడి.. చర్మం నునుపు దేలుతుందని చెబుతున్నారు.
  • స్కిన్​ యవ్వనంగా, నిగారింపుతో కనిపించడానికి కొరియన్‌ మహిళలు ఎక్కువగా ఫేషియల్‌ ఎక్సర్‌సైజులు చేస్తారని నిపుణులు అంటున్నారు. అంటే.. పెదాలను సున్నా చుట్టి తీయడం, నవ్వుతూ తలపైకి ఎత్తి చూడటం వంటివి చాలానే ఉన్నాయంటున్నారు. వీటి వల్ల ఫేస్​కు రక్తప్రసరణ మంచిగా జరిగి.. నిగారింపు వస్తుందని చెబుతున్నారు.
  • గ్లాస్‌స్కిన్‌ కోసం కొరియన్​ మహిళలు డబుల్‌ క్లెన్సింగ్‌ చేస్తుంటారు. తర్వాత మైసెలర్‌ వాటర్‌ లేదా ఆయిల్‌ క్లెన్సర్‌తో ముఖాన్ని శుభ్రపరుస్తారు. ఇది చర్మంపై పేరుకున్న మురికిని తొలగించి.. కాంతిమంతంగానూ కనిపించేలా చేస్తుందని వివరిస్తున్నారు.
  • చర్మానికి సహజ టోనర్‌లా ఫెర్మంటెడ్‌ రైస్‌ వాటర్‌నీ, తాజాదనం కోసం ఫేస్‌మాస్క్‌లు వినియోగిస్తారని అంటున్నారు.

ఇవీ కూడా:

  • కొరియన్లు సూర్యరశ్మి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. చర్మం ముడతలు పడకుండా, ఎండ దెబ్బ బారిన పడకుండా ప్రతిరోజూ సన్‌స్క్రీన్‌ లోషన్​ ఉపయోగిస్తారు. మామూలు రోజుల్లోనూ సన్‌స్క్రీన్‌ వాడుతుంటారు.
  • పీచు, పోషక విలువలు ఎక్కువగా ఉండే పదార్థాలకు కొరియన్‌ మహిళలు ప్రాధాన్యం ఇస్తారని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే.. ఇవి జీర్ణమవడానికి ఎక్కువ సమయం తీసుకుంటూ, త్వరగా ఆకలి వేయనివ్వవని.. అధిక కెలొరీలను అందించి శరీరాన్ని శక్తివంతంగా ఉంచుతాయంటున్నారు. పరిపూర్ణ ఆరోగ్యాన్నిచ్చే ఈ తరహా ఆహార విధానంతో జీర్ణశక్తి కూడా మెరుగ్గా ఉంటుందని.. బీపీ, షుగర్‌, చెడు కొలెస్ట్రాల్‌ వంటి అనారోగ్యాలు దరిచేరవని.. ఇవన్నీ వారి చర్మం నిగారింపుగా కనిపించేలా చేస్తాయంటున్నారు.
  • కొరియన్లు సాంప్రదాయ ఆహార పద్ధతులకు పెద్దపీట వేస్తారని, తాజా కూరగాయలకు మొదటి ప్రాధాన్యం ఇస్తారని అంటున్నారు. అన్నంతోపాటు కిమ్చీగా పిలిచే పులియబెట్టిన క్యాబేజీని తీసుకుంటారని.. కోడిగుడ్లు, మాంసాహారం, చేపలు, గోధుమలు లేకుండా చేసే పాన్‌కేక్స్‌, నూడిల్స్‌ వీరి ఆహారంలో ఉంటాయట. కొన్ని సందర్భాల్లో ఆవిరిపై ఉడికించిన కూరగాయలతో భోజనాన్ని ముగిస్తారని చెబుతున్నారు. పాల ఉత్పత్తులు, ఐస్‌క్రీమ్​, పాస్తా, వేపుళ్లు, నూనెతో చేసే పదార్థాలకు దూరంగా ఉంటారని అంటున్నారు.

ABOUT THE AUTHOR

...view details