IRCTC Araku Tour Package:అందమైన పర్వతాలు, పాలధారను తలపించే జలపాతాలు, మత్తెక్కించే కాఫీ తోటల పరిమళాలు ఇలా ఒక్కటేమిటి అరకు అందం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ మంచు పొరల చాటున కనిపించే అందాల గురించి ఎంత చెప్పినా తక్కువే. అందుకే సెలవులు వస్తే చాలు చాలా మంది ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కలిసి టైం స్పెండ్ చేస్తుంటారు. ప్రకృతి అందాల మధ్య సేదతీరుతుంటారు. ఇక చలికాలంలో ఈ ప్రదేశం మరింత రమణీయంగా ఉంటుంది. మరి మీరు కూడా ఈ వింటర్లో అరకును వీక్షించాలనుకుంటున్నారా? అయితే ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం మీకో గుడ్‌న్యూస్ చెబుతోంది. అరకు అందాలను ఎంజాయ్ చేసేందుకు వన్డే ప్యాకేజీ తీసుకొచ్చింది. ఏఏ ప్రదేశాలు చూడొచ్చు? ప్రయాణం ఎప్పుడు అనే పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఐఆర్సీటీసీ టూరిజం అరకురైల్ కమ్ రోడ్ ప్యాకేజీని తీసుకొచ్చింది. ఈ టూర్ ప్రతిరోజు అందుబాటులో ఉంటుంది. విశాఖపట్నం నుంచి ట్రైన్, రోడ్డు మార్గం ద్వారా ఈ టూర్ ఉంటుంది. ఈ టూర్లో అరకులోని పలు ప్రదేశాలను విజిట్ చేయవచ్చు.
ప్రయాణ వివరాలు ఇవే:
- ప్రతిరోజు ఉదయం 06.45 గంటలకు విశాఖపట్నం రైల్వే స్టేషన్ నుంచి రైలు(నెం. 58501) బయలుదేరుతుంది. కాబట్టి ఆ సమయానికి ముందుగానే రైల్వేస్టేషన్‌కు చేరుకోవాలి. సొరంగాలు, వంతెనలు, ప్రకృతి అందాల మధ్య ఉదయం 10.55 గంటలకు అరకు రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు.
- అరకు రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరి ముందుగా ట్రైబల్ మ్యూజియం, చాపరాయి, గార్డెన్స్ విజిట్ చేస్తారు. మధ్యాహ్న భోజనం చేసి రోడ్డు మార్గం ద్వారా వైజాగ్ రిటర్న్ అవుతారు.
- వైజాగ్ చేరుకునే క్రమంలో అనంతగిరి కాఫీ తోటలు, గాలికొండ వ్యూ పాయింట్, బొర్రా గుహలను విజిట్ చేస్తారు. వైజాగ్ చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.