IRCTC Royal Rajasthan Tour Vishakhapatnam:రాచరికానికి దర్పం పట్టే కోటలు, ప్యాలెస్‌లు, సరస్సులు.. రాజస్థాన్ పేరు వినగానే మనకు గుర్తుకువచ్చేవి. అంతేనా ప్రముఖుల వివాహాలూ ఎక్కువగా ఇక్కడే జరుగుతుంటాయి. అలాంటి ప్రదేశాలను వీక్షించాలనుకునే వారు చాలా మందే ఉంటారు. అయితే అలాంటి వారికి ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) అవకాశం కల్పిస్తోంది. అన్ని వసతులు ఉండే విధంగా ఓ ప్యాకేజీని తీసుకొచ్చింది. మరి ఈ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..
ఐఆర్సీటీసీ రాయల్ రాజస్థాన్ టూర్ ఎక్స్ విశాఖపట్నం పేరుతో ప్యాకేజీ తీసుకొచ్చింది. వైజాగ్ నుంచి విమాన ప్రయాణం ద్వారా ఈ టూర్ ఉంటుంది. మొత్తం 9రాత్రుళ్లు, 10 పగళ్లు ఈ టూర్ కొనసాగుతుంది. ఈ టూర్లో అజ్మీర్, బికనీర్, జైపూర్, జైసల్మేర్, జోధ్‌పూర్, మౌంట్ అబూ, పుష్కర్, ఉదయ్‌పూర్ వంటి ప్రదేశాలు చూడొచ్చు. ప్రయాణ వివరాలు చూస్తే..
- మొదటి రోజు ఉదయం 7:40 గంటలకు వైజాగ్ ఎయిర్పోర్ట్ నుంచి ఫ్లైట్ జర్నీ స్టార్ట్ అవుతుంది. మధ్యాహ్నం 2 గంటలకు జైపూర్ చేరుకుంటారు. అక్కడ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకున్న తర్వాత ముందుగానే బుక్ చేసిన హోటల్‌కు తీసుకెళ్తారు. అక్కడ చెకిన్ అయిన తర్వాత ఆ రాత్రికి అక్కడే డిన్నర్ చేసి స్టే చేయాలి.
- రెండో రోజు ఉదయం బ్రేక్‌ఫాస్ట్ తర్వాత హవా మహల్, జంతర్ మంతర్, సిటీ ప్యాలెస్, అమేర్ ఫోర్ట్ విజిట్ చేస్తారు. ఆ రాత్రికి అక్కడే డిన్నర్ చేసి బస చేస్తారు.
- మూడో రోజు బ్రేక్‌ఫాస్ట్ తర్వాత బికనీర్‌కు వెళ్తారు. అక్కడ హోటల్లో చెకిన్ అయిన తర్వాత Camel Breeding Farm, దేశ్నోకే ఆలయం దర్శించుకుంటారు. ఆ రాత్రికి అక్కడే బస చేస్తారు.
- నాలుగో రోజు బ్రేక్‌ఫాస్ట్ తర్వాత జునాగఢ్ కోట విజిట్ చేస్తారు. అక్కడి నుంచి జైసల్మేర్ వెళ్తారు. అక్కడ సాయంత్రం ఇసుక దిబ్బలు చూసి ఆ రాత్రికి అక్కడే ఉంటారు.
- ఐదో రోజు బ్రేక్‌ఫాస్ట్ తర్వాత జోధ్‌పూర్ వెళ్తారు. మార్గమధ్యలో జైసల్మేర్ కోట, పట్వోన్ కి హవేలీ అండ్ వార్ మ్యూజియం విజిట్ చేస్తారు. ఆ రాత్రికి జోధ్‌పూర్‌లో స్టే చేస్తారు.
- ఆరో రోజుబ్రేక్ఫాస్ట్ తర్వాత ఉమైద్ భవన్ మ్యూజియం, మెహరన్‌గఢ్ కోట విజిట్ చేసి ఉదయ్‌పూర్‌కు వెళ్తారు. అక్కడ హోటల్లో చెకిన్ అయిన తర్వాత ఆ రాత్రికి అక్కడే ఉంటారు.
- ఏడో రోజు టిఫెన్ తర్వాత మౌంట్ అబూ, నక్కిలేక్, దిల్వారా టెంపుల్ కాంప్లెక్స్ విజిట్ చేస్తారు. తిరిగి ఉదయ్‌పూర్‌కు చేరుకుని ఆ రాత్రికి అక్కడే డిన్నర్ చేసి స్టే చేస్తారు.
- ఎనిమిదో రోజు బ్రేక్‌ఫాస్ట్ తర్వాత సిటీ ప్యాలెస్, ఎక్లింగ్జీ విజిట్ చేస్తారు. అక్కడి నుంచి పుష్కర్‌కు వెళ్తారు. అక్కడ హోటల్లో చెకిన్ అయ్యి ఆ రాత్రికి అక్కడే ఉంటారు.
- తొమ్మిదో రోజు బ్రేక్‌ఫాస్ట్ తర్వాత పుష్కర్ టెంపుల్ దర్శించుకుంటారు. అక్కడి నుంచి తిరిగి జైపూర్ వెళ్తారు. ఆ రాత్రికి అక్కడే బస చేస్తారు.
- పదోరోజు ఉదయం బ్రేక్‌ఫాస్ట్ తర్వాత హోటల్ నుంచి చెక్ అవుట్ అయ్యి ఎయిర్‌పోర్ట్‌కు బయలుదేరుతారు. మధ్యాహ్నం వైజాగ్‌కు ఫ్లైట్ జర్నీ ఉంటుంది. రాత్రి విశాఖపట్నం చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.
IRCTC దిల్లీ టూర్ - కృష్ణ జన్మభూమి మథురతోపాటు, మరెన్నో ప్రదేశాలు చూడొచ్చు!