IRCTC Tamil Nadu Hills and Temples Package: తమిళనాడులోని పుణ్యక్షేత్రాలను దర్శించుకోవాలనుకుంటున్నారా? అయితే మీకో గుడ్‌న్యూస్. మధుర మీనాక్షి ఆలయం, బృహదీశ్వర ఆలయం సహా మరెన్నో దేవాలయాలతోపాటు దర్శనీయ ప్రదేశాలు చూసేందుకు ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ అద్భుతమైన ప్యాకేజీ తీసుకొచ్చింది. ప్యాకేజీ ధర ఎంత? ఏఏ ప్రదేశాలు చూడొచ్చు? ప్రయాణం ఎలా ఉంటుంది అనే వివరాలు ఈ స్టోరీలో చూద్దాం..
"తమిళనాడు హిల్స్ అండ్ టెంపుల్స్" పేరుతో ప్యాకేజీ తీసుకొచ్చింది. ఈ టూర్ మొత్తం 5 రాత్రులు, 6 పగళ్లు ఉంటుంది. హైదరాబాద్ నుంచి ఫ్లైట్ జర్నీ ద్వారా ఈ టూర్ ఆపరేట్ చేస్తున్నారు. ఈ ప్యాకేజీలో తిరుచ్చి, తంజావూర్, మధురై, కొడైకెనాల్, పళని, కోయంబత్తూరు వంటి ప్రాంతాలను చూడవచ్చు.
ప్రయాణం ఇలా ఉంటుంది:
మొదటి రోజుహైదరాబాద్ విమానాశ్రయం నుంచి ఫ్లైట్ జర్నీ స్టార్ట్ అవుతుంది. సాయంత్రానికి తిరుచ్చి చేరుకుంటారు. అక్కడ ఫార్మాలిటీస్ పూర్తైన తర్వాత ముందుగానే బుక్ చేసిన హోటల్‌కు తీసుకెళ్తారు. అక్కడ చెకిన్ అయ్యి ఆ రాత్రికి అక్కడ బస చేస్తారు.
రెండో రోజుఉదయం బ్రేక్‌ఫాస్ట్ తర్వాత చెక్ అవుట్ చేసి శ్రీరంగం, జంబుకేశ్వర్ ఆలయాలను దర్శించుకుంటారు. ఆ తర్వాత తంజావూర్‌కు స్టార్ట్ అవుతారు. అక్కడ బృహదీశ్వర ఆలయాన్ని దర్శించుకుంటారు. అక్కడి నుంచి మధురైకి వెళ్లి హోటల్లో చెకిన్ అయ్యి ఆ రాత్రికి అక్కడ స్టే చేస్తారు.
మూడో రోజుబ్రేక్ఫాస్ట్ తర్వాత మీనాక్షి అమ్మన్ ఆలయాన్ని దర్శించుకుంటారు. అక్కడి నుంచి కొడైకెనాల్‌కు స్టార్ట్ అవుతారు. అక్కడికి చేరుకుని సిల్వర్ కాస్కేడ్ ఫాల్స్ విజిట్ చేస్తారు. ఆ తర్వాత హోటల్లో చెకిన్ అయ్యి ఆ రాత్రికి అక్కడే ఉంటారు.
నాలుగో రోజుటిఫెన్ తర్వాత కొడైకెనాల్లోని చెట్టియార్ పార్క్, పైన్ ఫారెస్ట్, గుణ కేవ్స్, కొడైకెనాల్ సరస్సు వంటివి సందర్శించుకుంటారు. ఆ రాత్రికి కూడా కొడైకెనాల్‌లోనే బస చేస్తారు.