IRCTC Kerala Hills and Water Tour Package: ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ .. యాత్రికుల కోసం రకరకాల ప్యాకేజీలను తీసుకొస్తుంది. ఆధ్యాత్మిక ప్రదేశాలు మొదలు చారిత్రక ప్రదేశాలు, ప్రకృతి అందాల సందర్శన వరకు అందుబాటు ధరలలోనే ప్యాకేజీలను ఆపరేట్ చేస్తోంది. తాజాగా కేరళ అందాలను చూసి ప్రకృతి ఒడిలో గడిపేందుకు వీలుగా ఓ ప్యాకేజీని ప్రకటించింది. మరి ఈ టూర్ ఎన్ని రోజులు సాగుతుంది? ధర ఎంత? ఏఏ ప్రదేశాలు చూడొచ్చు వంటి వివరాలు ఇప్పుడు చూద్దాం..
IRCTC టూరిజం కేరళ హిల్స్ అండ్ వాటర్ పేరుతో ఈ ప్యాకేజీ ఆపరేట్ చేస్తోంది. ఈ ప్యాకేజీ 5 రాత్రులు, 6 పగళ్లు కొనసాగనుంది. ఈ ట్రిప్‌లో మున్నార్, అలెప్పీతో పాటు పలు టూరిజం స్పాట్లు కవర్ అవుతాయి. ఈ ప్యాకేజీ హైదరాబాద్ నుంచి ట్రైన్ జర్నీ ద్వారా ఉంటుంది.
- మొదటి రోజు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ (Train No.17230) నుంచి మధ్యాహ్నం 12:20 గంటలకు శబరి ఎక్స్‌ప్రెస్ బయలుదేరుతుంది. రాత్రి మొత్తం జర్నీ ఉంటుంది.
- రెండో రోజు మధ్యాహ్నం 12.55 నిమిషాలకు ఎర్నాకులం రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు. అక్కడ్నుంచి మున్నార్ వెళ్తారు. అక్కడ ముందుగానే బుక్ చేసిన హోటల్లోకి చెకిన్ అవుతారు. ఆ తర్వాత.. సాయంత్రం మున్నార్ టౌన్లో పలు ప్రదేశాలు సందర్శిస్తారు. ఆ రాత్రికి మున్నార్ లోనే స్టే చేస్తారు.
- మూడో రోజు ఉదయం ఎరవికులం నేషనల్ పార్క్(Eravikulam National Park)ను విజిట్ చేస్తారు. ఆ తర్వాత టీ మ్యూజియం, మెట్టుపెట్టి డ్యామ్‌తో పాటు ఏకో పాయింట్‌ను సందర్శిస్తారు. ఆ రాత్రి కూడా మున్నార్‌లోనే బస చేస్తారు.
- నాలుగో రోజు హోటల్ నుంచి చెక్ అవుట్ చేసి అలెప్పీకి వెళ్తారు. హోటల్లో చెకిన్ అయిన తర్వాత.. backwater ప్రాంతానికి వెళ్తారు. అక్కడ ఆరోజు మొత్తం ఎంజాయ్ చేస్తారు. ఆ రాత్రి అలెప్పీలో బస చేస్తారు.
- ఐదో రోజు హోటల్ నుంచి చెక్ అవుట్ తర్వాత తిరిగి ఎర్నాకులం వస్తారు. ఉదయం 11.20 నిమిషాలకు హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం మొదలవుతుంది.
- ఆరో రోజు మధ్యాహ్నం 12:20 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చేరుకోవటంతో టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.
ఐఆర్సీటీసీ "మ్యాజికల్ మధ్యప్రదేశ్" - సాంచి స్థూపంతో పాటు ఈ ప్రదేశాలు చూడొచ్చు! ధర చాలా తక్కువ!