Hydra Police Station Setup in Hydra Headquarters : చెరువులు, ప్రభుత్వ స్థలాల ఆక్రమణలపై కఠిన చర్యలు తీసుకునేందుకు హైడ్రా సిద్ధమైంది. ఈ మేరకు హైడ్రా ప్రధాన కార్యాలయం సమీపంలోని భవనంలో హైడ్రా పోలీస్ స్టేషన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు కమిషనర్ రంగనాథ్ తెలిపారు. ఈ మేరకు ఆ భవనాన్ని పరిశీలించిన ఆయన స్టేషన్లో కల్పించాల్సిన సౌకర్యాలపై అధికారులతో చర్చించారు.
సౌకర్యాలపై అధికారులకు సూచనలు : శాంతి భద్రతల పోలీస్ స్టేషన్ తరహాలోనే లోపలి గదులు, కేబిన్ల నిర్మాణాలు ఉంటాలని అధికారులకు రంగనాథ్ సూచించారు. స్టేషన్ అధికారుల క్యాబిన్లతో పాటు ఫిర్యాదుదారులకు కల్పించాల్సిన వసతులపై కూడా చర్చించారు. హైడ్రా పోలీసు స్టేషన్ సైన్ బోర్డులు స్పష్టంగా కనిపించేలా చూడాలని ఆదేశించారు. అలాగే పోలీసు స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారుల వాహనాల పార్కింగ్ సౌకర్యం ఉండేలా చూసుకోవాలని అధికారులకు హైడ్రా కమిషనర్ సూచించారు.
పరికి చెరువు పరిధిలో ఆక్రమణలపై హైడ్రా కన్ను - త్వరలోనే కూల్చివేతలు షురూ : హైడ్రా కమిషనర్ రంగనాథ్
కోర్టు తీర్పులు కూడా స్పష్టం : పోలీస్ స్టేషన్‌కు వచ్చే వచ్చే ఫిర్యాదులను వెనువెంటనే పరిశీలించి చర్యలు తీసుకోనున్నట్లు రంగనాథ్ వివరించారు. హైడ్రా చర్యలకు ప్రభుత్వం పూర్తి సహకారాన్ని అందిస్తుందని, అక్రమ నిర్మాణాల కూల్చివేతల విషయంలో కోర్టు తీర్పులు కూడా స్పష్టంగా ఉన్నాయని రంగనాథ్ తెలిపారు.
ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకు హైడ్రా ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది. ఆక్రమణలపై ప్రజల నుంచి ఫిర్యాదులు తీసుకుంటోంది. ప్రతి సోమవారం బుద్ధభవన్‌లో ప్రజల నుంచి ఫిర్యాదులు తీసుకుంటున్నారు. నాలాలు, చెరువులు, పార్కులు ఆక్రమణలపై ఫిర్యాదులు ఇవ్వొచ్చని హైడ్రా అధికారులు పేర్కొన్నారు.
'అంత తొందరెందుకు? - హైడ్రా కూల్చివేతలపై మరోసారి హైకోర్టు అసహనం
అక్రమ కట్టడాల కూల్చివేతలో వెనకడుగు లేదు : హైడ్రా కమిషనర్ రంగనాథ్