ETV Bharat / technology

నేడు ఆకాశంలో మహాద్భుతం- ఆరు గ్రహాల పరేడ్- జీవితంలో ఒక్కసారి మాత్రమే చూసే అవకాశం! - PLANET PARADE 2025

ఆకాశంలో ప్లానెట్ పరేడ్- డోంట్ మిస్​ దిస్ ఛాన్స్- ఎలా చూడాలంటే?

Planet Parade 2025
Planet Parade 2025 (Photo Credit- Getty Images)
author img

By ETV Bharat Tech Team

Published : Jan 21, 2025, 7:44 PM IST

Planet Parade 2025: ఆకాశంలో ఇవాళ రాత్రి ఓ అరుదైన దృశ్యం కనువిందు చేయనుంది. రిపబ్లిక్ డే సందర్భంగా పాత్ ఆఫ్ డ్యూటీలో నిర్వహించే కవాతును మీరు చూసే ఉంటారుగా? అయితే ఇప్పుడు అలాంటి దృశ్యమే ఆకాశంలో సాక్షాత్కారం కానుంది.

మన సౌర వ్యవస్థలోని ఆరు గ్రహాలు అంటే శని, బృహస్పతి, అంగారకుడు, శుక్రుడు, నెప్ట్యూన్, యూరేనస్ గ్రహాలు ఒకే వరుసలోకి వచ్చి చేరనున్నాయి. అంటే ఆ సమయంలో ఈ గ్రహాల అమరిక సూర్యుడికి ఒకవైపున జరిగి ఒకే సరళరేఖపై అందమైన ప్లానెట్ పరేడ్​గా కన్పించనుంది.

ఈ ప్లానెట్ పరేడ్​లో ఒకే వరుసలోకి వచ్చిన శని, బృహస్పతి, అంగారకుడు, శుక్రుడు గ్రహాలను ఎలాంటి ప్రత్యేక పరికరాలను ఉపయోగించకుండానే మన కళ్లతో స్పష్టంగా చూడొచ్చు. అయితే వీటిలో నెప్ట్యూన్‌, యురేనస్ గ్రహాలను చూడాలంటే మాత్రం టెలిస్కోప్ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది.

ఈ ఖగోళ అద్భుతం ఈ ఏడాది రెండుసార్లు కనువిందు చేయనున్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇవాళ అంటే జనవరి 21వ తేదీ, తిరిగి ఫిబ్రవరి 28వ తేదీన ఈ దృశ్యం సాక్షాత్కారం అవుతుందని పేర్కొన్నారు. ప్లానెట్ పరేడ్​గా పిలిచే ఈ అద్భుతం జీవితకాలంలో ఒక్కసారి మాత్రమే దర్శనమిస్తుందని తెలిపారు.

ఈ ప్లానెట్ పరేడ్ మన దేశంలో కూడా కనిపించనుంది. ఇది దాదాపు నాలుగు వారాల పాటు ఆకాశంలో జరగనుంది. ఈ సమయలో సూర్యాస్తమయం అయిన 45 నిమిషాల తర్వాత ఈ అద్భుత దృశ్యాన్ని టెలిస్కోప్ లేకుండానే వీక్షించొచ్చు. ఈ గ్రహాలు రాత్రి 8:30 గంటల తర్వాత ఆకాశంలో చాలా స్పష్టంగా కనిపిస్తాయి.

అయితే ఈ దృశ్యాల స్పష్టత వాతావరణ పరిస్థితులు, కాలుష్య స్థాయిలపై ఆధారపడి ఉంటుందని పరిశోధకులు అంటున్నారు. ఆరు నుంచి ఏడు గ్రహాలు ఒకే వరుసలోకి రావడం చాలా అరుదుగా జరిగే సంఘటన. మరి అలాంటి అరుదైన దృశ్యాన్ని చూసే అవకాశాన్ని మీరు వదులుకోకండి. ఈ సందర్భంగా నేటి నుంచి రాత్రి సమయంలో ఆకాశంలో ఈ గ్రహాలను ఎలా చూడొచ్చో తెలుకుందాం రండి.

ప్లానెస్ట్రీ సొసైటీకి చెందిన శాస్త్రవేత్త N. రఘనుందన్‌ కుమార్‌ తెలిపిన సమాచారం ప్రకారం:

1. శుక్రుడు: పశ్చిమ దిశలో ప్రకాశవంతంగా, మిణుకుమిణుకుమంటూ నక్షత్రం మాదిరిగా శుక్రుడు కన్పిస్తాడు. రాత్రి 8.30 గంటలకు అస్తమయం జరుగుతుంది. ఆ సమయంలో మనం ఈ గ్రహాన్ని మన కళ్లతోనే స్పష్టంగా చూడొచ్చు.

2. శని: శుక్ర గ్రహాన్ని గుర్తించిన మాదిరిగానే నిశితంగా పరిశీలిస్తే మనం శన్ని గ్రహాన్ని కూడా చూడొచ్చు. లేత పసుపు రంగుతో పాటు తెల్లటి నక్షత్రంలా శని మనకు దర్శనమిస్తుంది.

3. బృహస్పతి: ఆకాశంలో తూర్పు దిశ వైపునకు తిరిగి చూస్తే మెరుస్తున్న నక్షత్రం మాదిరిగా బృహస్పతి కన్పిస్తుంది. రాత్రి 10 గంటల సమయంలో ఆకాశంలో నడినెత్తిపై చూడొచ్చు.

4. అంగారక గ్రహం: ఇక అంగారక గ్రహం ఆకాశంలో తూర్పు వైపునకు తిరిగి చూస్తే నారింజ ఎరుపు నక్షత్రంలా దర్శనమిస్తుంది. అర్ధరాత్రి 12 గంటలు దాటిన తర్వాత అంగారక గ్రహాన్ని వీక్షించొచ్చు. ఇది సూర్యోదయానికి ముందు పశ్చిమ దిశ వైపు కన్పిస్తుంది.

టెలికాం యూజర్లకు అదిరే న్యూస్- ₹ 20 రీఛార్జ్​తో ప్రీపెయిడ్ సిమ్ కార్డ్ యాక్టివ్!

త్వరలో మార్కెట్​లోకి ఐకూ నియో 10R స్మార్ట్​ఫోన్- లీకైన టైమ్​లైన్, స్పెసిఫికేషన్స్!

భారత్​లో ఎండతో నడిచే కారు వచ్చేసిందోచ్- సోలార్​ రూఫ్​తో బడ్జెట్ ధరలోనే లాంఛ్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.