IRCTC Madhya Pradesh Maha Darshan Tour: మరికొన్ని రోజుల్లో కార్తికమాసం రానుంది. ఈ క్రమంలో చాలా మంది శివాలయాలను దర్శించుకోవాలనుకుంటారు. ముఖ్యంగా ద్వాదశ జ్యోతిర్లింగాల దర్శనం చేసుకోవాలని భావిస్తారు. మరి మీరు కూడా ఆ లిస్ట్‌లో ఉన్నారా? అయితే మీకో సూపర్ న్యూస్ చెబుతోంది ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్(IRCTC). కార్తికమాసంలో మధ్యప్రదేశ్‌లోని రెండు జ్యోతిర్లింగాలను దర్శించుకునేందుకు వీలుగా ఓ ప్యాకేజీని తీసుకొచ్చింది. మరి ఆ ప్యాకేజీ అంటే ఏమిటి? ఎన్ని రోజులు ఉంటుంది? ధర ఎంత? అనే పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం..
IRCTC'మధ్యప్రదేశ్ మహా దర్శన్' (Madhya Pradesh Maha Darshan) పేరుతో ఈ టూర్ నిర్వహిస్తోంది. ఈ టూర్ మొత్తం 4 రాత్రులు, 5 పగళ్లు ఉంటుంది. హైదరాబాద్ నుంచి ఫ్లైట్ ద్వారా ఈ టూర్ స్టార్ట్ అవుతుంది. ఈ టూర్లో భాగంగా మహేశ్వర్, ఓంకారేశ్వర్, ఉజ్జయిని, ఇందౌర్ వంటి ప్రదేశాలను విజిట్ చేయవచ్చు. మరి ప్రయాణ వివరాలు చూస్తే..
- మొదటి రోజు మధ్యాహ్నం 2:35 గంటలకు హైదరాబాద్ నుంచి ఫ్లైట్ జర్నీ స్టార్ట్ అవుతుంది. నాలుగు గంటలకు ఇందౌర్ చేరుకుంటారు. అక్కడి నుంచి ఉజ్జయిని బయలుదేరుతారు. అక్కడ హోటల్లో చెకిన్ అయ్యి మహకాళేశ్వర్ ఆలయాన్ని సందర్శిస్తారు. ఆ రాత్రికి ఉజ్జయినిలోనే బస చేయాలి.
- రెండో రోజు ఉదయం బ్రేక్‌ఫాస్ట్ తర్వాత ఉజ్జయినిలోని లోకల్ టెంపుల్స్(కాళభైరవ ఆలయం, సాందీపని ఆశ్రమం, మంగళనాథ్ టెంపుల్, చింతామన్ గణేష్ టెంపుల్, హర్సిద్ధి మాతా టెంపుల్) దర్శించుకోవాలి. సాయంత్రం అక్కడ పలు ప్రదేశాలను చూసుకోవచ్చు. ఆ రాత్రికీ ఉజ్జయినిలోనే స్టే చేయాలి.
- మూడో రోజు బ్రేక్‌ఫాస్ట్ తర్వాత చెక్ అవుట్ అయ్యి మహేశ్వర్ బయలుదేరుతారు. అక్కడ అహిల్యా దేవి ఫోర్ట్, నర్మదా ఘాట్ సందర్శించుకోవాలి. ఆ తర్వాత ఓంకారేశ్వర్ బయలుదేరుతారు. అక్కడ హోటల్లో చెకిన్ అయ్యి ఆ రాత్రికి అక్కడే స్టే చేయాలి.
- నాలుగో రోజు తెల్లవారుజామున ఓంకారేశ్వర ఆలయం దర్శించుకుంటారు. ఆ తర్వాత బ్రేక్‌ఫాస్ట్ ఉంటుంది. అనంతరం చెక్ అవుట్ అయ్యి ఇందౌర్కి స్టార్ట్ అవుతారు. అక్కడ పీఠేశ్వర్ హనుమాన్ ఆలయాన్ని దర్శించుకోవాలి. అనంతరం హోటల్లో చెకిన్ అయ్యి ఆ రాత్రికి అక్కడే డిన్నర్ చేసి బస చేయాలి.
- ఐదో రోజు బ్రేక్‌ఫాస్ట్ తర్వాత హోటల్ నుంచి చెక్ అవుట్ అయ్యి అన్నపూర్ణ మందిర్, లాల్బాగ్ ప్యాలెస్. మధ్యలో లంచ్ ఉంటుంది. సాయంత్రానికి ఇందౌర్ ఎయిర్‌పోర్ట్‌లో డ్రాప్ చేస్తారు. సాయంత్రం 6:35 గంటలకు హైదరాబాద్‌కు రిటర్న్ జర్నీ స్టార్ట్ అవుతుంది. రాత్రికి సిటీ చేరుకోవడంతో టూర్ పూర్తవుతుంది.
ధర వివరాలు:
- కంఫర్ట్‌లో సింగిల్ ఆక్యూపెన్సీకి రూ.35,450, డబుల్ ఆక్యూపెన్సీకి రూ.28,950, ట్రిపుల్ ఆక్యూపెన్సీకి రూ.27,900గా చెల్లించాలి.
- 5 నుంచి 11 సంవత్సరాల చిన్నారులకు విత్ బెడ్ అయితే రూ.25,750, విత్ అవుట్ బెడ్ అయితే రూ.21,450 పే చేయాలి.
- 2 నుంచి 4 సంవత్సరాల విత్ అవుట్ బెడ్ అయితే రూ.18,950 చెల్లించాలి.