ETV Bharat / offbeat

మిర్చి, ఎగ్​ బజ్జీలు తిని బోర్ కొడుతోందా? - ఓసారి "మసాలా టమాట స్లైస్​ బజ్జీ" ట్రై చేయండి - టేస్ట్​ అదుర్స్​! - HOW TO MAKE TOMATO SLICE BAJJI

-మిర్చి బజ్జీల కంటే అద్దిరిపోయే రెసిపీ -ఇలా చేసి ఇచ్చారంటే పిల్లలు మస్త్​ ఇష్టంగా తింటారు

How to Make Crispy Tomato Slice Bajji
How to Make Crispy Tomato Slice Bajji (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 29, 2024, 5:26 PM IST

How to Make Crispy Tomato Slice Bajji: బజ్జీలు.. ఈ పేరు వినగానే ఎవరికైనా నోట్లో నీళ్లు ఊరాల్సిందే. సాయంత్రం అయిందంటే చాలు చాలా మంది టీతోపాటు బజ్జీలు తినడానికి ఎంతో ఇష్టపడతారు. పిల్లల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే.. సాధారణంగా చాలా మంది బండ్లపై లభించే మిర్చి, ఆలూ, ఎగ్​, వంకాయ బజ్జీలనే తింటుంటారు. కాగా ఎప్పుడూ ఇవి తినాలంటే బోర్​ కొట్టిద్ది. కొత్తదనాన్ని కోరుకునే వారి కోసం సూరత్​ స్పెషల్​ మసాలా టమాట స్లైస్​ బజ్జీ తీసుకొచ్చాం. పైన క్రిస్పీగా లోపల జ్యూసీ, స్పైసీగా ఉండే ఈ బజ్జీలు రుచిలో అద్దిరిపోతాయి. చేయడం కూడా వెరీ ఈజీ. కేవలం ఇంట్లో ఉండే పదార్థాలే ఈ రెసిపీకి అవసరమవుతాయి. మరి ఈ బజ్జీలకు కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఈ స్టోరీలో చూద్దాం..

కావాల్సిన పదార్థాలు:

కొత్తిమీర పేస్ట్​ కోసం:

అల్లం - కొద్దిగా

వెల్లుల్లి రెబ్బలు - 8

ఉప్పు - 1 టీ స్పూన్​

పచ్చిమిర్చి - 3

కొత్తిమీర తరుగు - పిడికెడు

నిమ్మకాయ- అర చెక్క

బజ్జీ కోసం:

శనగపిండి - 1 కప్పు

ఉప్పు - కొద్దిగా

నూనె - 1 టీ స్పూన్​

పసుపు - చిటికెడు

బేకింగ్​ సోడా - చిటికెడు

టమాటలు - 4

నూనె - డీప్​ ఫ్రైకి సరిపడా

తయారీ విధానం:

  • ముందుగా మిక్సీజార్​ తీసుకుని అల్లం, వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు, పచ్చిమిర్చి, కొత్తిమీర తరుగు, నిమ్మరసం వేసి కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ గట్టిగా, మెత్తగా రుబ్బుకోవాలి.
  • ఇలా గ్రైండ్​ చేసుకున్న మిశ్రమాన్ని ఓ ప్లేట్​లోకి తీసుకుని పక్కన పెట్టండి.
  • ఇప్పుడు ఓ బౌల్​ తీసుకుని అందులో శనగపిండి, ఉప్పు, నూనె, పసుపు వేసి బాగా కలపాలి.
  • ఆ తర్వాత కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ ఓ 5 నిమిషాలు ఆగకుండా కలుపుతూనే ఉండాలి. ఇలా చేయడం వల్ల పిండి గుల్లగా మారి బజ్జీలు టేస్టీగా వస్తాయి.
  • ఆ తర్వాత బేకింగ్​ సోడా వేసి మరికొద్దిసేపు బీట్​ చేసుకోవాలి.
  • ఇప్పుడు కొంచెం పెద్ద సైజ్​లో తోలు మందంగా ఉన్న టమాటలు తీసుకుని శుభ్రంగా కడిగి ఆరబెట్టాలి.
  • నీటి తడి పోయిన తర్వాత వాటిని స్లైస్​లుగా కట్​ చేసుకోవాలి. ఇలా టమాటలు అన్ని కట్​ చేసుకోవాలి.
  • ఆ తర్వాత డీప్​ ఫ్రైకి సరిపడా నూనె పోసి వేడి చేసుకోవాలి.
  • నూనె కాగేలోపు కట్​ చేసిన టమాట ముక్కల మీద ముందుగానే సిద్ధం చేసుకున్న కొత్తిమీర పేస్ట్​ను కొద్దికొద్దిగా అప్లై చేయాలి. ఇలా అన్ని టమాట ముక్కల మీద పేస్ట్​ పెట్టుకోవాలి.
  • టమాట ముక్కలను శనగపిండి మిశ్రమంలో నిధానంగా ముంచి పిండి పట్టే విధంగా కోట్​ చేసి కాగుతున్న నూనెలో వేసుకోవాలి.
  • మంటను హై ఫ్లేమ్​లో ఉంచి రెండు వైపులా ఎర్రగా కాల్చుకోవాలి. ఇలా అన్ని టమాటలను ప్రిపేర్​ చేసుకోవాలి.
  • అంతే ఎంతో పైన క్రిస్పీగా లోపల జ్యూసీ, స్పైసీగా ఉండే మసాలా టమాట స్లైస్​ బజ్జీ రెడీ. నచ్చితే మీరూ ఓ సారి ట్రై చేయండి.

బ్రెడ్​తో ఇలా చిటికెలో బజ్జీలు చేయండి - పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు!

ఎప్పుడూ మిరపకాయ బజ్జీలేనా - ఓసారి "గుంటూరు స్టైల్ వంకాయ బజ్జీలు" ప్రిపేర్​ చేయండి - టేస్ట్​కు ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.