ETV Bharat / offbeat

చలికాలంలో కుదుళ్లలో దురద ఇబ్బంది పెడుతోందా ? - రోజూ ఇలా చేస్తే అంతా సెట్​!

-శీతాకాలంలో తలలో దురద పెట్టడానికి కారణాలు -ఇలా చేస్తే సమస్య ఇట్టే తగ్గుతుందట

How to Stop An Itchy Scalp in Winter
How to Stop An Itchy Scalp in Winter (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : 2 hours ago

How to Stop An Itchy Scalp in Winter : చలికాలంలో చర్మం పొడిబారడం, పాదాల పగుళ్లు వంటి సమస్యలు చాలా మందిని వెంటాడుతుంటాయి. అలాగే మరికొంత మందిలో జుట్టు కుదుళ్లలోని చర్మం పొడిబారిపోవడం వల్ల చుండ్రు, పేలు.. వంటి సమస్యలొస్తాయి. ఫలితంగా తలలో ఎక్కువ దురద పుడుతుంది. ఈ సమస్య తీవ్రమైతే జుట్టు దృఢత్వాన్ని కోల్పోయి అధికంగా రాలిపోయే ప్రమాదం ఉంటుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. అలా కాకుండా ఉండాలంటే కొన్ని చిట్కాలు పాటించాలని సూచిస్తున్నారు. అవేంటో మీరు చూసేయండి..

వారానికి ఒకసారి తప్పకుండా : కొంతమంది తలకు నూనె రాసుకోవడం వల్ల జిడ్డుగా ఉంటుందని ఆయిల్​కి దూరంగా ఉంటుంటారు. ఇలా ఎక్కువ రోజులు నూనె రాసుకోకపోవడం వల్ల.. శీతాకాలంలో కుదుళ్లలోని చర్మం పొడిబారిపోతుందని.. దీనివల్ల చుండ్రు రాలడంతోపాటు, పేలు సమస్య కూడా వేధిస్తుందంటున్నారు. అలాగే జుట్టు కూడా నిర్జీవంగా కనిపిస్తుందని చెబుతున్నారు. అందుకే కొబ్బరి, బాదం, ఆలివ్.. వంటి ఆయిల్ని కనీసం వారానికోసారైనా తలకు పట్టించాలని.. దీనివల్ల దురద తగ్గడంతో పాటు.. జుట్టు కూడా పట్టులా మెరుస్తుందని సలహా ఇస్తున్నారు.

మసాజ్ చేయాలి : సరైన రక్తప్రసరణ లేకపోవడం వల్ల కూడా కుదుళ్ల ఆరోగ్యం పాడవుతుందట. కాబట్టి ఆయిల్​ రాసుకునే ముందు దాన్ని కాస్త గోరువెచ్చగా చేసుకుని.. దాంతో కుదుళ్లపై కాసేపు మర్దన చేయాలి. ఫలితంగా కుదుళ్లకు రక్తప్రసరణ బాగా జరిగి దురద క్రమంగా తగ్గిపోతుందని అంటున్నారు. అయితే ఆయిల్​ రాసిన తర్వాత జిడ్డుగా ఉందనిపిస్తే.. కొద్దిసేపటికి గాఢత తక్కువగా ఉన్న షాంపూతో తలస్నానం చేస్తే జుట్టు సిల్కీగా మారుతుందని సూచిస్తున్నారు.

తడిగా ఉన్నప్పుడు వద్దు : ఎక్కువమంది తలస్నానం చేసిన తర్వాత జుట్టు పూర్తిగా ఆరకముందే గట్టిగా జడ వేసుకోవడం లేకపోతే రబ్బర్ బ్యాండ్ పెట్టుకోవడం లాంటివి చేస్తుంటారు. దీంతో జుట్టు కుదుళ్లు పూర్తిగా ఆరవు. అలాగే ఆ ప్రదేశంలో ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో కూడా తలలో దురద వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి జుట్టు పూర్తిగా ఆరేదాకా అలా వదిలేయాలి.. లేకపోతే వదులుగా ఫ్లక్కర్‌ పెట్టుకొని వదిలేయడం మంచిది.

ఆహారం విషయంలో ఈ జాగ్రత్తలు పాటించాలి : తలలో దురద తగ్గించడంలో ఆహారం కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఈ క్రమంలో సూక్ష్మ పోషకాలు ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలు, నట్స్.. వంటివి రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలి. దీనివల్ల కుదుళ్లు దృఢంగా మారి జుట్టు ఒత్తుగా పెరగడంతో పాటు.. దురద కూడా తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

ఇవి కూడా చదవండి:

మీ జుట్టు తెల్లపడుతోందా? ఇలా చేస్తే వెంటనే నల్లగా మారుతాయట!

చలికాలం జుట్టు విపరీతంగా ఊడుతోందా? - ఈ హెయిర్ ప్యాక్స్ ట్రై చేస్తే ఆ సమస్యే ఉండదట!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.