IRCTC Divine Karnataka Tour Package :ఇండియన్ రైల్వే అండ్ టూరిజం (IRCTC) గతకొంతకాలంగా ప్రయాణికుల కోసం కొత్త కొత్త టూర్ ప్యాకేజీలను తీసుకొస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా పుణ్యక్షేత్రాలను దర్శించుకోవాలనుకొనే వారికోసం ఒక అద్భుతమైన ప్యాకేజీని ప్రకటించింది. పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
ఐఆర్‌సీటీసీ.. ‘DIVINE KARNATAKA’ పేరిట ఈ టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది. ప్రతి మంగళవారం ఈ టూర్ ప్యాకేజీని ఆపరేట్ చేస్తుండగా.. ప్రస్తుతం అక్టోబర్ 22, 29 తేదీల్లో ఈ టూర్ ప్యాకేజీకి సంబంధించిన టికెట్లు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి.. ఆసక్తి గల ప్రయాణికులు ఈ ప్యాకేజీని వినియోగించుకోవచ్చు.
టూర్ కొనసాగుతుందిలా..
- కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి ఈ టూర్ స్టార్ట్ అవుతుంది. అంటే.. మొదటి రోజు మార్నింగ్ 6:05 గంటలకు స్టేషన్లో కాచిగూడ- మంగళూర్ సెంట్రల్ ఎక్స్‌ప్రెస్ (ట్రైన్ నంబర్ 12789) ఎక్కడంతో మీ పర్యటన ప్రారంభమవుతుంది. రాత్రంతా జర్నీ కొనసాగుతుంది.
- రెండో రోజు మార్నింగ్ 9:30 గంటలకు మంగళూరు రీచ్ అవుతారు. అక్కడి నుంచి ఉడిపికి వెళ్తారు.
- ముందుగా ఏర్పాటుచేసిన హోటల్‌లో చెక్ ఇన్ అవుతారు. అనంతరం శ్రీకృష్ణ ఆలయాన్ని సందర్శించి, మాల్పే బీచ్‌కు వెళ్తారు. ఈ నైట్ ఉడిపిలోనే బస చేస్తారు.
- ఇక మూడోరోజు హోటల్ నుంచి చెక్ అవుట్ అయి శృంగేరీకి వెళ్తారు. అక్కడ శారదాంబ ఆలయాన్ని సందర్శిస్తారు. తర్వాత మంగళూరు రిటర్న్ అవుతారు. అక్కడ ముందుగా ఏర్పాటుచేసిన హోటల్‌లో బస ఉంటుంది. రాత్రికి అక్కడే నిద్ర చేస్తారు.
- నాలుగో రోజు ధర్మస్థలకు వెళ్తారు. అక్కడ ప్రసిద్ధి చెందిన మంజునాథ స్వామి ఆలయాన్ని దర్శించుకుంటారు. అనంతరం కుక్కే సుబ్రమణ్య ఆలయానికి వెళ్తారు. ఈవెనింగ్ తిరిగి మంగళూరుకు పయనమవుతారు. నైట్ మంగళూరులోనే స్టే చేస్తారు.
- ఐదో రోజు మంగళాదేవి, కదిరి మంజునాథ ఆలయాలను సందర్శిస్తారు. ఈవెనింగ్ తన్నెరభావి బీచ్, కుద్రోలి గోకర్నాథ దేవాలయానికి వెళ్తారు.
- అనంతరం మంగళూరు రైల్వేస్టేషన్‌కు వెళ్లి నైట్ 8 గంటలకు (ట్రైన్ నంబర్ 12790) రైలు ఎక్కుతారు.
- ఆరో రోజు రాత్రి 11:40 గంటలకు రైలు కాచిగూడ చేరడంతో మీ టూర్ కంప్లీట్ అవుతుంది.
రాజస్థాన్ కోటల రాజసం చూస్తారా? - తక్కువ ధరలోనే IRCTC అద్భుతమైన ప్యాకేజీ!