IRCTC Kerala Hills and Water Tour : పచ్చని కొండలు, ప్రకృతి అందాలకు కేరాఫ్ అడ్రస్.. కేరళ. అందుకే చాలా మంది ఈ గాడ్స్ ఓన్ కంట్రీని విజిట్ చేసేందుకు ఇష్టపడుతుంటారు. మరీ ముఖ్యంగా వింటర్ సీజన్లో.. మంచుతో కప్పబడిన పచ్చని కొండలు, జలజల పారే జలపాతాలను సందర్శించాలని ఆరాటపడుతుంటారు. మరి మీరు కూడా ఆ లిస్ట్‌లో ఉన్నారా? అయితే మీకో గుడ్‌న్యూస్ చెబుతోంది.. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్. కేరళ అందాలను ఆస్వాదించేందుకు ఓ అద్భుతమైన ప్యాకేజీ తీసుకొచ్చింది. మరి ఈ ప్యాకేజీ ఎన్ని రోజులు, ఏఏ ప్రాంతాలు సందర్శించవచ్చు అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..
IRCTC టూరిజం "కేరళ హిల్స్ అండ్ వాటర్స్" పేరుతో ఈ ప్యాకేజీ ఆపరేట్ చేస్తోంది. ఈ ప్యాకేజీ 5 రాత్రులు, 6 పగళ్లు ఉంటుంది. ఈ ట్రిప్‌లో మున్నార్, అలెప్పీతో పాటు పలు టూరిజం స్పాట్లు కవర్ చేయవచ్చు. హైదరాబాద్ నుంచి ట్రైన్ జర్నీ ద్వారా ఈ ప్యాకేజీ ఉంటుంది. సూచించిన తేదీల్లో ప్రతి మంగళవారం టూర్ అందుబాటులో ఉంటుంది. ప్రయాణ వివరాలు చూస్తే..
- మొదటి రోజు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి మధ్యాహ్నం 12:20 గంటలకు శబరి ఎక్స్‌ప్రెస్ (Train No.17230) బయలుదేరుతుంది. ఆ రాత్రి మొత్తం జర్నీ ఉంటుంది.
- రెండో రోజు మధ్యాహ్నం ఒంటి గంటకు ఎర్నాకులం రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు. అక్కడ్నుంచి మున్నార్ వెళ్తారు. అక్కడ ముందుగానే బుక్ చేసిన హోటల్లోకి చెకిన్ అవుతారు. ఆ తర్వాత.. సాయంత్రం మున్నార్ టౌన్లో పలు ప్రదేశాలు సందర్శిస్తారు. ఆ రాత్రికి అక్కడే స్టే చేస్తారు.
- మూడో రోజు ఉదయం ఎరవికులం నేషనల్ పార్క్(Eravikulam National Park)ను విజిట్ చేస్తారు. ఆ తర్వాత టీ మ్యూజియం, మెట్టుపెట్టి డ్యామ్‌తో పాటు ఏకో పాయింట్‌ను సందర్శిస్తారు. ఆ రాత్రి కూడా మున్నార్‌లోనే బస చేస్తారు.
- నాలుగో రోజు హోటల్ నుంచి చెక్ అవుట్ చేసి అలెప్పీకి వెళ్తారు. హోటల్లో చెకిన్ అయిన తర్వాత.. బ్యాక్ వాటర్ ప్రాంతానికి వెళ్తారు. అక్కడ ఆరోజు మొత్తం ఎంజాయ్ చేస్తారు. ఆ రాత్రి అలెప్పీలో బస చేస్తారు.
- ఐదో రోజు హోటల్ నుంచి చెక్ అవుట్ అయ్యి ఎర్నాకులం వస్తారు. ఉదయం 11.20 నిమిషాలకు శబరి ఎక్స్‌ప్రెస్(Train No.17229)లో హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం మొదలవుతుంది.
- ఆరో రోజు మధ్యాహ్నం ఒంటి గంటకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చేరుకోవటంతో టూర్ ముగుస్తుంది.
ధర వివరాలు చూస్తే: ఒకటి నుంచి ముగ్గురు ప్రయాణికులకు ధరలు చూస్తే..
- కంఫర్ట్‌లో సింగిల్ షేరింగ్ కు రూ. 34,480గా ఉంది. ట్విన్ షేరింగ్ రూ.19,910, ట్రిపుల్ షేరింగ్ రూ .16,260గా ఉంది. 5 నుంచి 11 సంవత్సరాల చిన్నారులకు విత్ బెడ్ అయితే రూ.10,730, విత్ అవుట్ బెడ్ అయితే రూ.8,420గా ఉంది.
- స్టాండర్డ్‌లో సింగిల్ షేరింగ్ కు రూ. 31,750గా ఉంది. ట్విన్ షేరింగ్ రూ.17,180, ట్రిపుల్ షేరింగ్ రూ .13,530గా ఉంది. 5 నుంచి 11 సంవత్సరాల చిన్నారులకు విత్ బెడ్ అయితే రూ.8,000, విత్ అవుట్ బెడ్ అయితే రూ.5,690గా ఉంది. గ్రూప్ బుకింగ్‌పై ధరలు తగ్గే అవకాశం ఉంటుంది.