IRCTC Heritage of Madhya Pradesh Tour: దేశంలోని బెస్ట్ టూరిస్ట్ ప్లేస్‌లలో మధ్యప్రదేశ్ ఒకటి. ఆధ్యాత్మికత, చారిత్రక, ప్రపంచ వారసత్వ సంపద, ప్రకృతి రమణీయ, వన్యప్రాణి సంరక్ష కేంద్రాలు ఇక్కడ కోకొల్లలు. అయితే ఇవన్నీ ఒకేసారి చూడాలంటే కొద్దిగా కష్టమైన పని. అందుకే.. ఓ మూడు ముఖ్యమైన నగరాలు చూసే విధంగా ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ఓ సూప్ర్ ప్యాకేజీని తీసుకొచ్చింది. మరి ఈ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
ఐఆర్సీటీసీ "హెరిటేజ్ ఆఫ్ మధ్యప్రదేశ్(Heritage of Madhya Pradesh )" పేరుతో ఈ టూర్ ఆపరేట్ చేస్తున్నారు. ఇది మొత్తం 5 రాత్రులు, 6 పగళ్లు ఉంటుంది. ఈ టూర్లో గ్వాలియర్, ఖజురహో, ఓర్ఛా ప్రాంతాలను సందర్శించవచ్చు. హైదరాబాద్ నుంచి ట్రైన్ జర్నీ ద్వారా ఈ టూర్ మొదలవుతుంది. సూచించిన తేదీల్లో ప్రతి శుక్రవారం ఈ టూర్ అందుబాటులో ఉంటుంది.
ప్రయాణ వివరాలు చూస్తే..
- మొదటి రోజు సాయంత్రం 4.40 గంటలకు కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్(ట్రైన్ నెం 12707) బయలుదేరుతుంది. ఆ రాత్రి మొత్తం జర్నీ ఉంటుంది.
- రెండో రోజు మధ్యాహ్నం 2 గంటలకు గ్వాలియర్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి హోటల్‌కు వెళ్తారు. ఫ్రెషప్ అనంతరం మోరెనా బయలుదేరుతారు. అక్కడ చౌసత్ యోగిని ఆలయాన్ని సందర్శిస్తారు. ఆ తర్వాత తిరిగి గ్వాలియర్‌కు చేరుకుని.. ఆ రాత్రికి గ్వాలియర్లోనే స్టే చేస్తారు.
- మూడో రోజు ఉదయం గ్వాలియర్ ఫోర్ట్‌ను విజిట్ చేస్తారు. బ్రేక్‌ఫాస్ట్ అనంతరం హోటల్ నుంచి చెక్ అవుట్ అయ్యి.. జై విలాస్ ప్యాలెస్‌ను సందర్శిస్తారు. ఆ తర్వాత ఓర్చాకు బయలుదేరుతారు. అక్కడకు రీచ్ అయి హోటల్లో చెకిన్ అయిన తర్వాత.. ఓర్చా ఫోర్ట్‌ను విజిట్ చేస్తారు. ఆ రాత్రికి ఓర్చాలోనే స్టే ఉంటుంది.
- నాలుగో రోజు బ్రేక్‌ఫాస్ట్ చేసిన తర్వాత హోటల్ నుంచి చెక్ అవుట్ అయ్యి.. ఖజురహోకి స్టార్ట్ అవుతారు. అక్కడ చెకిన్ అయిన .. స్థానికంగా ఉన్న ఆలయాలను దర్శించుకుంటారు. ఈవెనింగ్ లైటింగ్ అండ్ సౌండ్ షోను చూస్తారు. రాత్రికి ఖజురహోలోనే బస చేస్తారు.
- ఐదో రోజు హోటల్లో బ్రేక్‌ఫాస్ట్ అనంతరం.. వెస్ట్రన్ గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ దర్శించుకుంటారు. ఆ తర్వాత చెక్ అవుట్ అయ్యి.. సాట్నాకు స్టార్ట్ అవుతారు. అక్కడి రైల్వే స్టేషన్ నుంచి 11.25 హైదరాబాద్‌కు జర్నీ స్టార్ట్ అవుతుంది. రాత్రి మొత్తం ప్రయాణం ఉంటుంది.
- ఆరో రోజు రాత్రి 10 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకోవటంతో టూర్ ముగుస్తుంది.