తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

కోడిగుడ్డు పులుసు ఇలా కదా ప్రిపేర్ చేసేది! - టేస్ట్ వేరే లెవల్ - How to Prepare Tasty Egg Pulusu

Tasty and Spicy Egg Pulusu : ఎగ్స్​తో ఎన్నో వెరైటీస్​ చేస్తారు. అందులో ఎగ్​ పులుసు మాత్రం చాలా స్పెషల్. అంతేకాదు.. ఈ పులుసు రుచి ప్రాంతాలను బట్టి మారుతుంటుంది. అయితే.. ఎలా చేసుకున్నా పర్ఫెక్ట్​గా రావాలంటే మాత్రం ఈ టిప్స్​ పాటించాల్సిందే అంటున్నారు పాకశాస్త్ర నిపుణులు!

Tasty and Spicy Egg Pulusu
Tasty and Spicy Egg Pulusu (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Sep 12, 2024, 2:57 PM IST

Egg Pulusu Cooking Tips in Telugu :చాలా మంది ఎగ్​ పులుసును ఇష్టంగా తింటుంటారు. అయితే.. చాలా మంది పర్ఫెక్ట్​గా ప్రిపేర్ చేయడం రాదు. ప్రతిసారీ పులుపు ఎక్కువ, తక్కువ కావడమో.. కారం సరిపోకపోవడమో జరుగుతుంటాయి. ఈ సమస్యలేవీ లేకుండా పర్ఫెక్ట్​గా ఎగ్​ పులుసు చేయాలంటే ఈ టిప్స్​ పాటించాలని నిపుణులు అంటున్నారు. ఇంతకీ ఆ టిప్స్​ ఏంటి? కర్రీ ఎలా ప్రిపేర్​ చేసుకోవాలో ఈ స్టోరీలో చూద్దాం.

ఎగ్​ పులుసు చేసేటప్పుడు పాటించాల్సిన టిప్స్​ :

  • కోడిగుడ్లను ఎక్కువసేపు ఉడికించకూడదు. ఎందుకంటే ఇలా ఉడికించడం వల్ల ఎగ్ వైట్ రబ్బర్​లాగా మారుతుంది. కాబట్టి అవి హాఫ్​ బాయిల్​ వరకు ఉడికించుకుంటే సరిపోతుందని అంటున్నారు. ఎందుకంటే పులుసులో ఇవి మళ్లీ ఉడుకుతాయి కాబట్టి సెట్​ అయిపోతుంది.
  • ఇక కూరకు రుచిని అందించేవి మసాలాలు. చాలా మంది బయట మార్కెట్​లో లభించే మసాలాను ఇందులో ఉపయోగిస్తుంటారు. కానీ ఇంట్లో చేసుకునే మసాలాలు బెస్ట్​ అంటున్నారు నిపుణులు.
  • ఉల్లిపాయలు, ఇతర పదార్థాలను వేయించుకోవడం కూడా ఇంపార్టెంట్​ అంటున్నారు. తొందరగా ఫ్రై కావాలని హై ఫ్లేమ్​లో ఉడికిస్తే.. సరిగ్గా ఉడకక కూర రుచి పోతుందంటున్నారు. కాబట్టి సిమ్​లో పెట్టి నిధానంగా ఫ్రై చేసుకోవడం మంచిదంటున్నారు.
  • కొద్దిమందికి ఎంత మంచిగా చేసినా కొన్నిసార్లు పులుసు పల్చగా మారిపోతుంది. అలాంటి సమయంలో కొద్దిగా క్రీమ్​ యాడ్​ చేస్తే కూర దగ్గరకు రావడంతోపాటు రుచి కూడా అద్దిరిపోతుంది.
  • ఇక చివరగా చాలా మంది స్టవ్​ ఆఫ్​ చేయగానే రైస్​ పెట్టుకుని తింటుంటారు. కానీ.. అలా కాకుండా కూర ప్రిపేర్​ అయిన తర్వాత కొద్దిసేపు దాన్ని పక్కకు పెట్టి ఆ తర్వాత తింటే మంచి టేస్ట్​ వస్తుందని అంటున్నారు.

ఈ స్నాక్స్​ వెరీ 'గుడ్డు' - ఇలా చేస్తే "సూపర్​ మమ్మీ" అంటూ లొట్టలేసుకుంటూ తింటారు!

ఎగ్​ కర్రీకి కావాల్సిన పదార్థాలు, ప్రిపరేషన్​ ఇప్పుడు చూద్దాం..

కావాల్సిన పదార్థాలు:

  • ఉడికించిన గుడ్లు - 4
  • పసుపు - సరిపడా
  • నూనె - సరిపడా
  • కరివేపాకు రెబ్బలు - 2
  • పచ్చిమిర్చి - 4
  • ఉల్లిపాయ - 1(పెద్దది)
  • అల్లం వెల్లుల్లి పేస్ట్​ - 1 టీ స్పూన్
  • ఉప్పు - రుచికి సరిపడా
  • టమాట - 2
  • మెంతులు - పావు టీ స్పూన్​
  • చింతపండు గుజ్జు - పావు కప్పు
  • కారం - టేబుల్​ స్పూన్​
  • ధనియాల పొడి - 1 టేబుల్​ స్పూన్​
  • గరం మసాలా - అర టీ స్పూన్​
  • నీరు - ​300ml
  • కొత్తిమీర తరుగు - అరకప్పు

తయారీ విధానం:

  • ముందుగా స్టవ్​ ఆన్​ చేసి పాన్​ పెట్టి టీ స్పూన్​ ఆయిల్​ వేసి హీట్​ చేసుకోవాలి.
  • ఆ తర్వాత అందులోకి కొద్దిగా పసుపు వేసి ఉడికించిన కోడిగుడ్లు వేసి కొద్దిగా ఫ్రై చేసుకుని పక్కకు పెట్టుకోవాలి.
  • ఇప్పడు మరో కడాయి తీసుకుని స్టవ్​ మీద పెట్టి అరకప్పు నూనె వేసి వేడి చేసుకోవాలి. ఆ తర్వాత అందులోకి కరివేపాకు, పచ్చిమిర్చి చీలికలు, ఉల్లిపాయ తరుగు వేసి.. ఉల్లిపాయలు పచ్చి వాసన పోయేంతవరకు వేయించుకోవాలి.
  • ఆ తర్వాత ఉప్పు, అర చెంచా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్​ వేసి.. పచ్చి వాసన పోయేంతవరకు వేయించుకోవాలి.
  • ఇప్పుడు టమాట ముక్కలు వేసి మెత్తగా అయ్యేవరకు ఉడికించుకోవాలి. నూనె పైకి తేలుతున్నప్పుడు మెంతులు, చింతపండు గుజ్జు వేసి మీడియం ఫ్లేమ్​ మీద నూనె పైకి తేలేంతవరకు వేయించుకోవాలి.
  • తర్వాత కారం, ధనియాల పొడి, గరం మాసాలా వేసి పచ్చివాసన పోయేంతవరకు ఫ్రై చేసుకోవాలి.
  • అనంతరం నీరు పోసి కలిపి లో ఫ్లేమ్​ మీద నూనె పైకి తేలేంతవరకు ఉడికించుకోవాలి.
  • ఇప్పుడు ఫ్రై చేసుకున్న ఎగ్స్​కు కొద్దిగా గాట్లు పెట్టి పులుసులో వేసుకోవాలి.
  • ఆ తర్వాత కొత్తిమీర తరుగు వేసి 5 నిమిషాల పాటు సిమ్​లో పెట్టి కుక్​ చేసుకుని దింపేసుకుంటే సరి.. ఎంతో టేస్టీగా ఉండే ఎగ్​ పులుసు రెడీ..

ఎగ్​ దోశ చేయడం ఇప్పుడు చాలా ఈజీ - ఈ టిప్స్ పాటించండి - టేస్ట్​ ఎంజాయ్​ చేయండి!

బేకరీలో దొరికే ఎగ్ పఫ్స్ ఇంట్లోనే - అది కూడా ఓవెన్​ లేకుండానే! - ఇలా ప్రిపేర్ చేసుకోండి

సండే స్పెషల్​ : కుక్కర్​లో 10 నిమిషాల్లోనే ఎగ్​ బిర్యానీ! - యమ్మీ యమ్మీగా ఉంటుంది!

ABOUT THE AUTHOR

...view details