తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

గణేష్​ ఉత్సవాల వేళ కొబ్బరి చిప్పలు మిగిలిపోయాయా? - ఇలా పచ్చడి చేశారంటే అద్బుతమే! - Tasty and Spicy Coconut Chutney - TASTY AND SPICY COCONUT CHUTNEY

Coconut Chutney: గణపతి నవరాత్రుల వేళ దాదాపు ప్రతి ఇంట్లోనూ కొబ్బరి కాయలు కొడతారు. దేవుడికి నైవేద్యం సమర్పిస్తారు. అలా కొట్టిన కొబ్బరి చిప్పలు చాలా ఇళ్లలో మిగిలిపోతాయి. అలాంటి వాటితో అద్దిరిపోయే రీతిలో పచ్చడి చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.

Coconut Chutney
Tasty and Spicy Coconut Chutney at Home (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Sep 16, 2024, 1:58 PM IST

Tasty and Spicy Coconut Chutney at Home:నవరాత్రులు ముగిశాయి. చాలా మంది ఇళ్లలో కొబ్బరి చిప్పలు మిగిలిపోయి ఉంటాయి. వాటితో చాలా మంది రొటీన్ పచ్చడి పెట్టుకుంటారు. మరికొద్దిమంది లడ్డూలు చేసుకుంటారు. ఈ సారి మూడు పప్పులు కలిపి అద్దిరిపోయే కొబ్బరి పచ్చడి తయారు చేసుకోండి. మేము చెప్పే పద్ధతిలో చేసుకుంటే వారం రోజులు నిల్వ ఉంటుంది. అన్నం, ఇడ్లీ, దోశ.. ఎందులోకైనా టేస్ట్​ అద్దిరిపోవాల్సిందే. ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

కొబ్బరిపచ్చడికి కావాల్సిన పదార్థాలు:

  • నూనె - 2 టేబుల్​ స్పూన్లు
  • ఎండు మిరపకాయలు - 25
  • పచ్చిమిర్చి - 6
  • పచ్చి శనగపప్పు - పావు కప్పు
  • మినపప్పు - పావు కప్పు
  • పెసరపప్పు - పావు కప్పు
  • ధనియాలు - అర టేబుల్​ స్పూన్​
  • వెల్లుల్లి రెబ్బలు - 10
  • పచ్చి కొబ్బరి ముక్కలు - ముప్పావు కప్పు
  • జీలకర్ర - అర టీ స్పూన్​
  • బెల్లం - 1 టేబుల్​ స్పూన్​
  • చింతపండు - నిమ్మకాయంత
  • ఉప్పు - రుచికి సరిపడా
  • నీరు - కప్పున్నర

ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు - 10 నిమిషాల్లోనే అద్దిరిపోయే "ఉల్లిపాయ పచ్చడి" ఇలా చేసేయండి!

తాళింపు కోసం:

  • నూనె - 2 టేబుల్​ స్పూన్​
  • ఆవాలు - 1 టీ స్పూన్​
  • జీలకర్ర - అర టీ స్పూన్​
  • ఎండు మిర్చి - 2
  • పసుపు - పావు టీ స్పూన్​
  • కరివేపాకు రెబ్బలు - 2
  • ఇంగువ - పావు టీ స్పూన్​

తయారీ విధానం :

  • ముందుగా స్టవ్​ ఆన్​ చేసి పాన్​ పెట్టి నూనె పోసి వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత ఎండు మిర్చి, పచ్చిమిర్చి వేసి మీడియం ఫ్లేమ్​ మీద ఎర్రగా వేయించుకుని తీసి పక్కకు పెట్టుకోవాలి.
  • ఆ తర్వాత అదే పాన్​లో పచ్చి శనగపప్పు, మినపప్పు, పెసరపప్పు వేసి మంటను సిమ్​లో పెట్టి మంచి సువాసన వచ్చే వరకు దోరగా వేయించుకోవాలి.
  • పప్పులు కొద్దిగా వేగిన తర్వాత ధనియాలు, వెల్లుల్లి రెబ్బలు వేసి వాటిని కూడా వేయించుకోవాలి.
  • మొత్తంగా ఈ మిశ్రమం ఎర్రగా వేగడానికి 8 నుంచి 10 నిమిషాల టైమ్​ పడుతుంది.
  • ఆ తర్వాత అందులోకి పచ్చికొబ్బరి ముక్కలు వేసుకుని రెండు నిమిషాలు వేయించుకోవాలి. ఆ తర్వాత జీలకర్ర వేసి మరో రెండు నిమిషాలు వేయించుకుని పక్కకు పెట్టి చల్లారనివ్వాలి.
  • ఆ తర్వాత మిక్సీ జార్​ తీసుకుని అందులోకి వేయించి పక్కకు పెట్టుకున్న ఎండు మిర్చి, పచ్చిమిర్చి మిశ్రమం, బెల్లం, చింతపండు, ఉప్పు, వేయించిన పప్పులు, కొబ్బరి మిశ్రమం వేసి కొద్దికొద్దిగా నీరు పోసుకుంటూ బరకగా గ్రైండ్​ చేసుకోవాలి.
  • ఇప్పుడు స్టవ్​ ఆన్​ చేసి పాన్​ పెట్టి నూనె వేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి.
  • ఆ తర్వాత పసుపు, కరివేపాకు, ఇంగువ వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత గ్రైండ్​ చేసుకున్న మిశ్రమాన్ని వేసి కలిపి స్టవ్​ ఆఫ్​ చేసుకుంటే సరి.
  • ఎంతో రుచికరమైన మూడు పప్పుల కొబ్బరి పచ్చడి రెడీ.
  • ఒకవేళ మీకు కారం సరిపోలేదనుకుంటే.. కాసిన్ని ఎండు మిర్చి, పచ్చిమిర్చిని నూనెలో వేసి వేయించి మిక్సీ పట్టుకుని ఈ పచ్చడిలో కలుపుకుంటే సరిపోతుంది.

ఆంధ్రా "గోంగూర నువ్వుల పచ్చడి​" - ఈ ప్రిపరేషన్ స్టైలే కేక!

నోరూరించే "బీరకాయ టమాట పచ్చడి" - ఇలా ప్రిపేర్ చేస్తే రుచికి రుచీ ఆరోగ్యానికి ఆరోగ్యం!

ABOUT THE AUTHOR

...view details