Dosakaya Endu Mirchi Pachadi in Telugu:పచ్చడి అనగానే ఆవకాయ, ఉసిరికాయ, టమాటా వంటి నిల్వ పచ్చళ్లే మనకు ఎక్కువగా గుర్తుకు వస్తుంటాయి. ఇక రోటి పచ్చళ్లు అంటే టమాటా, గోంగూర వంటివి చేసుకుంటారు. అయితే.. చాలా మంది కాయగూరలతోనూ పచ్చళ్లు చేస్తుంటారు. అలాంటిదే దోసకాయ పచ్చడి. దీనిని చాలా రకాలుగా చేసుకుంటుంటారు. ఇప్పుడు మనం ఎండు మిరపకాయలతో కలిపి ట్రై చేద్దాం. దీన్ని మనం ఒక్కసారి ఇంట్లో ట్రై చేశారంటే.. మళ్లీ మళ్లీ చేసుకుని తింటుంటాం. మరి, ఇంకెందుకు ఆలస్యం? ఈ దోసకాయ పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఏంటి? ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
- 275 గ్రాముల దోసకాయలు (నాటువి అయితే బెటర్)
- 15 ఎండు మిరపకాయలు
- 2 టేబుల్ స్పూన్ల వేరుశనగ(పల్లీలు)
- ఒక టేబుల్ స్పూన్ ధనియాలు
- ఒక టీ స్పూన్ జీలకర్ర
- గోలీ సైజు నానబెట్టిన చింతపండు
- పావు టేబుల్ స్పూన్ పసుపు
- రుచికి సరిపడా ఉప్పు
- ఒక ఉల్లిపాయ
- 10 వెల్లుల్లి పాయలు
- నూనె
తయారీ విధానం
- ముందుగా దోసకాయలను చెక్కు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. (మీకు నచ్చితే గింజలు ఉంచుకోవచ్చు లేదంటే తీసేసుకోవచ్చు)
- ఇప్పుడు స్టౌ ఆన్ చేసి ఓ గిన్నెలో నూనె పోసి వేడి చేసుకోవాలి.
- ఆ తర్వాత ఇందులో వేరుశెనగ వేసి కాసేపు వేయించి పక్కకు పెట్టుకోవాలి.
- అనంతరం అందులోనే ఎండు మిరపకాయలు వేసి వేయించుకోవాలి.
- ఆ తర్వాత ధనియాలు, జీలకర్ర వేసి రంగు మారేంత వరకు ఉంచి స్టౌ ఆఫ్ చేసుకోని చల్లారబెట్టుకోవాలి.
- ఇప్పుడు మిక్సీలో వేయించుకున్న వేరుశనగ, మిర్చీ మిశ్రమం, చింతపండు, ఉప్పు, పసుపు వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి.(గ్రైండ్కు అవసరమైతే చింతపండు రసాన్ని వాడాలి)
- ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి, దోసకాయ ముక్కలు వేసి గ్రైండ్ చేయాలి. (మరీ మెత్తగా కాకుండా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి)