Bail Issued For Padi kaushik Reddy : హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డికి ఊరట లభించింది. ఆయనకు బెయిల్ మంజూరైంది. ఆదివారం కరీంనగర్ కలెక్టరేట్లో మంత్రులు నిర్వహించిన సమీక్ష సందర్భంగా కౌశిక్‌రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ల మధ్య తీవ్రవాగ్వాదం చేసుకొని సమావేశం రసాభాసగా మారింది. దీంతో పాడి కౌశిక్ రెడ్డిపై ఎమ్మెల్యే సంజయ్ ఫిర్యాదు చేశారు.
షరతులతో కూడిన బెయిల్ : దీంతో పాడి కౌశిక్‌రెడ్డిపై కేసు నమోదు చేసిన పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. అనంతరం మంగళవారం కరీంనగర్ రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జి ప్రేమలత ముందు హాజరుపరచారు. అదనపు జూనియర్ సివిల్ జడ్జి కౌశిక్ రెడ్డిపై ఉన్న మూడు కేసుల్లో షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు. గురువారం లోగా రూ.2 లక్షలు పూచీకత్తు సమర్పించాలని ఆదేశాలిచ్చారు. పోలీసులు పిలిచిన సమయంలో విచారణకు హాజరు కావాలని చెప్పారు. మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయనని కోర్టుకు కౌశిక్‌రెడ్డి చెప్పారు.
ఆ పార్టీని వదిలిపెట్టే ప్రసక్తే లేదు : అంతకుముందు కరీంనగర్ మూడో పట్టణ పోలీసు స్టేషన్ నుంచి జడ్జి వద్దకు తరలించే క్రమంలో మీడియాతో కౌశిక్ రెడ్డి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలుపరిచే వరకూ ప్రశ్నిస్తూనే ఉంటామని తెలిపారు. ఆ పార్టీని వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
మంత్రులు నిర్వహించిన సమీక్షలో తీవ్రవాగ్వాదం : ఆదివారం కరీంనగర్ కలెక్టరేట్లో మంత్రులు నిర్వహించిన సమీక్ష సందర్భంగా కౌశిక్‌రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ల మధ్య తీవ్రవాగ్వాదం చేసుకొని సమావేశం రషాభాసగా మారింది. దీనిపై ఎమ్మెల్యే సంజయ్‌పై కౌశిక్‌రెడ్డి చేయిచేసుకున్నారని సంజయ్ పీఏ వినోద్ ఫిర్యాదు చేశారు. మరోవైపు కౌశిక్ రెడ్డి తనను తిట్టాడంటూ జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేష్, కౌశిక్‌రెడ్డి ప్రవర్తనతో అంతరాయం కలిగిందంటూ కరీంనగర్ ఆర్డీవో ఫిర్యాదు చేశారు. దీంతో కౌశిక్ రెడ్డిపై కరీంనగర్ ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో మూడు కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో కరీంనగర్ పోలీసులు సోమవారం హైదరాబాద్‌కు వచ్చి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు.
హైదరాబాద్‌లో కౌశిక్ రెడ్డి అరెస్ట్ : దీనిపై పోలీసు ఉన్నతాధికారులకు శాసన సభ స్పీకర్‌కు ముందే సమాచారమిచ్చినట్లు తెలిసింది. కౌశిక్ రెడ్డి హైదరాబాద్‌లో ఉండటంతో కరీంనగర్ పట్టణ ఏసీపీ వెంకటస్వామి నేతృత్వంలో టూటౌన్ సీఐ సృజన్‌రెడ్డి, 30 మంది టాస్క్‌ఫోర్స్ పోలీసులు సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్‌కు చేరుకున్నారు. జూబ్లీహిల్స్‌లోని ఓ టీవీ ఛానల్ చర్చలో పాల్గొని బయటకు వచ్చిన కౌశిక్ రెడ్డిని రాత్రి 7 గంటల సమయంలో అరెస్ట్ చేశారు. దీంతో కౌశిక్ రెడ్డి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అనంతరం పోలీసులు ఆయనను వాహనంలో రాత్రి 10.35 సమయంలో కరీంనగర్‌కు తీసుకెళ్లారు.
అర్ధరాత్రి మూడో పట్టణ పోలీస్ స్టేషన్‌కు తరలింపు : స్థానిక పోలీస్ స్టేషన్‌కు కాకుండా పోలీస్ శిక్షణ కేంద్రానికి తరలించారు. అర్ధరాత్రి మూడో పట్టణ పోలీస్ స్టేషన్‌కు తరిలించారు. ఎమ్మెల్యే అరెస్ట్‌తో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. కరీంనగర్ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదుదారైన ఎమ్మెల్యే సంజయ్ వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్నారు. ఆయనను కరీంనగర్ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి పంపించారు.
కలెక్టరేట్లో గొడవకు దిగిన ఎమ్మెల్యేలు - ఒకరినొకరు తోసుకున్న కౌశిక్ రెడ్డి, సంజయ్
ఉద్రిక్తంగా మారిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ ధర్నా - అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరిక!