తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

పిల్లలకు లంచ్​ బాక్స్​ పెట్టే టైమ్​ లేనప్పుడు - పదే పది నిమిషాల్లో "టమాటా రైస్" చేయండిలా! - Tomato Rice in Telugu - TOMATO RICE IN TELUGU

How to Make Tomato Rice : ప్రతి ఇంట్లో టమాటాలు కచ్చితంగా ఉంటాయి. అయితే.. వీటితో కేవలం పది నిమిషాల్లోనే టేస్టీగా టమాటా రైస్​ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఈ రైస్​తో పిల్లల లంచ్​ బాక్స్​ రెడీ​ చేశారంటే.. మెతుకు మిగలకుండా తినేస్తారు.

Tomato Rice
How to Make Tomato Rice (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Sep 25, 2024, 10:52 AM IST

Tomato Rice Recipe :పొద్దున్నే లేచిటైమ్​కి పిల్లలకు లంచ్ బాక్స్​ రెడీ చేయడం చాలా కష్టమైన పని. చాలాసార్లు టిఫెన్లు రెడీ చేసిన తర్వాత వంట చేయడానికి ఆలస్యం అవుతూ ఉంటుంది. ఇలాంటి పరిస్థితిని చాలా మంది తల్లులు నిత్యం ఫేస్​ చేస్తూనే ఉంటారు. ​దీంతో.. ఏదోక కర్రీ వండి వైట్​రైస్​ బాక్స్​లో పెట్టి పంపిస్తుంటారు. లేదంటే.. వైట్​ రైస్​లో పచ్చడి వేసి పంపిస్తుంటారు. దీంతో.. పిల్లలు బాక్స్ పూర్తిగా తినకుండానే ఇంటికి పట్టుకొస్తుంటారు. అది చూసి పిల్లలు సరిగా తినట్లేదని అమ్మలు దిగులు చెందుతుంటారు.

అందుకే మీకోసం ఈ రెసిపీ తీసుకొచ్చాం. మీ దగ్గర ఎక్కువ టైమ్​ లేనప్పుడు ఈ విధంగా టమాటా రైస్​ ట్రై చేయండి. త్వరగా కంప్లీట్ కావడమే కాదు.. టేస్ట్ కూడా​ సూపర్​గా ఉంటుంది. పిల్లలకు కూడా కొత్తగా, కలర్ ఫుల్​గా ఉంటుంది. ఈ రెసిపీని లంచ్​ తోపాటు డిన్నర్​లోకి కూడా చేయొచ్చు. మిగిలిపోయిన అన్నంతో కూడా వండొచ్చు. మరి.. ఈ టమాటా రైస్​ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు.. తయారీ విధానం ఏంటో ఒక్కసారి లుక్కేయండి.

కావాల్సిన పదార్థాలు..

  • అన్నం -3 కప్పులు
  • టమాటాలు -3
  • పచ్చిమిర్చి-2
  • ఉల్లి పాయ-1
  • నూనె-2 టేబుల్​స్పూన్లు
  • ఉప్పు- రుచికి సరిపడా
  • కారం-టీస్పూన్​
  • గరం మసాలా - అరటీస్పూన్​
  • ధనియాలపొడి-అరటీస్పూన్​
  • పసుపు-చిటికెడు
  • కరివేపాకు-1
  • కొత్తిమీర
  • పుదీనా

తయారీ విధానం..

  • ముందుగా టమాటాలను శుభ్రంగా కడిగి.. ముక్కలుగా కట్​ చేసుకోవాలి. వీటిని మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్​ చేసి.. ప్యూరీ సిద్ధం చేసుకోవాలి. టమాటా రైస్​కి ఇలా టమాటా ప్యూరీ చేసుకోవడం వల్ల టేస్ట్​ సూపర్​గా ఉంటుంది.
  • ఇప్పుడు స్టౌపై పాన్​ పెట్టండి. ఇందులో ఆయిల్​ వేసి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి వేపండి.
  • తర్వాత పాన్​లో టమాటా ప్యూరీ వేయండి. అలాగే ఇందులో ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, పసుపు, కరివేపాకు రెమ్మ వేసి కలుపుకోండి.
  • టమాటాలలోని నీరు మొత్తం ఆవిరైపోయిన తర్వాత కొత్తిమీర, పుదీనా వేసుకుని కలుపుకోవాలి.
  • తర్వాత అన్నం వేసుకుని బాగా మిక్స్​ చేయాలి. రైస్​కి మసాలా బాగా పట్టిందంటే చాలు.. సూపర్​ టేస్టీ టమాటా రైస్​ మీ ముందుంటుంది.
  • ఇంతే.. కేవలం 10 నిమిషాల్లోనే ఈ టమాటా రైస్​ తయారవుతుంది.
  • పిల్లల లంచ్ బాక్స్​ తయారు చేయడం కోసం మీ దగ్గర ఎక్కువ సమయం లేనప్పుడు​ ఈ రెసిపీ తప్పకుండా వర్కౌట్ అవుతుంది. కావాలంటే ట్రై చేసి చేయండి.

ఇవి కూడా చదవండి:

స్కూల్లో లంచ్ బాక్స్ తినకుండా పిల్లలు ఇంటికి తెస్తున్నారా? - ఈ 'గార్లిక్ రైస్' పెట్టండి - మొత్తం ఖాళీ చేసేస్తారు!

సేమియా ఉప్మా ముద్ద ముద్దగా అవుతోందా? - ఇలా చేస్తే పొడిపొడిగా చాలా రుచికరంగా ఉంటుంది!

ABOUT THE AUTHOR

...view details