ETV Bharat / offbeat

పిండి చేత్తో కలపకుండా, కర్రతో రుద్దకుండా - సూపర్​ సాఫ్ట్​గా "చపాతీలు" రెడీ! - TIPS TO MAKING SOFT CHAPATI AT HOME

- సరికొత్త పద్ధతిలో ఈజీగా చపాతీల తయారీ - ఇలా చేస్తే గంటలపాటు సాఫ్ట్​గా ఉంటాయి

Tips to Making Soft Chapati at Home
Tips to Making Soft Chapati at Home (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 28, 2024, 11:52 AM IST

Tips to Making Soft Chapati at Home: చపాతీ.. ప్రస్తుత జనరేషన్​లో చాలా మంది వీటిని తినడానికే ఇంట్రస్ట్​ చూపిస్తున్నారు. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారు.. బీపీ, షుగర్​ కంట్రోల్లో పెట్టుకోవాలనుకునేవారు కూడా కనీసం రోజులో ఒకపూటైనా వీటిని డైట్​లో చేర్చుకుంటున్నారు. ఈ క్రమంలోనే కొద్దిమంది వీటిని బయట షాపుల్లో కొనుగోలు చేస్తుంటే.. మరికొంతమంది ఇంట్లోనే తయారు చేస్తుంటారు.

అయితే.. ఇంట్లో చపాతీలు చేయడానికి పిండి కలపాలి, రుద్దాలి. ఇంతా చేస్తే.. చాలా సార్లు గట్టిగా వస్తుంటాయి. ఎన్ని విధాలుగా ప్రయత్నించినా, ఎన్ని పదార్థాలు కలిపినా గట్టిగానే అవుతాయి. ఈ టిప్స్​ పాటించి చేస్తే ఎంతో మృదువుగా వస్తాయని.. యాడ్స్​లో చూపించినట్లుగా మెత్తగా, ప్లఫీగా వస్తాయని నిపుణులు అంటున్నారు. అంతేకాదు.. చేతితో కలపాల్సిన అవసరం లేదు, కర్రతో రుద్దాల్సిన అవసరం లేదు. మరి సూపర్​ సాఫ్ట్​ చపాతీలు తయారు చేసే ఆ సీక్రెట్​ ఏంటో ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు:

  • గోధుమ పిండి - 1 కప్పు
  • ఉప్పు - రుచికి సరిపడా
  • నీళ్లు - 1 కప్పు
  • నూనె - 2 టేబుల్​ స్పూన్లు

తయారీ విధానం:

  • ముందుగా ఓ గిన్నెలోకి గోధుమ పిండి, ఉప్పు వేయండి.
  • ఆ తర్వాత కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ కాస్త జోరుగా కలుపుకోవాలి.
  • ఇప్పుడు ఓ మందపాటి గిన్నె లేదా కుక్కర్​ తీసుకుని అందులోకి నూనె వేసుకోవాలి.
  • అనంతరం కలిపిన గోధుమపిండిని గిన్నెలోకి వేసుకుని సమానంగా స్ప్రెడ్​ చేసుకోవాలి.
  • ఇప్పుడు స్టవ్​ ఆన్​ చేసి ఆ గిన్నె పెట్టి మీడియం ఫ్లేమ్​లో కలుపుతూ గోధుమ పిండి ముద్దగా మారేవరకు ఉడికించుకోవాలి.
  • గోధుమ పిండి గిన్నెకు అంటుకోకుండా ముద్దగా మారినప్పుడు స్టవ్​ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి.
  • గోరువెచ్చగా ఉన్నప్పుడు ఉండలుగా చేసుకోవాలి.
  • ఇప్పుడు ఓ కవర్​ తీసుకుని దానిపై ఉండ పెట్టి, మరో కవర్​ పైన పెట్టి ప్లేట్​ లేదా చపాతీ పీటను పెట్టి గట్టిగా ప్రెస్​ చేస్తే​ చపాతీలు రెడీ అవుతాయి. ఒకవేళ కావాలనుకుంటే చపాతీ కర్రతో చిన్నగా రోల్​ చేసినా సరిపోతుంది.
  • ఇప్పుడు స్టవ్​ ఆన్​ చేసి పెనం పెట్టి చేసుకున్న చపాతీలను దాని మీద వేసి సిమ్​లో రెండు వైపులా కాల్చుకోవాలి. అవసరమనుకుంటే నూనె కూడా అప్లై చేసుకోవచ్చు. ఇలా అన్ని చపాతీలను కాల్చుకుంటే ఎంతో టేస్టీగా, సాఫ్ట్​గా ఉండే చపాతీలు రెడీ.
  • ఇలా చేసుకుని మీకు నచ్చిన కర్రీతో తింటే టేస్ట్​ అదుర్స్​. పైగా గంటలపాటు ఇవి మెత్తగా ఉంటాయి. నచ్చితే మీరూ ట్రై చేయండి.

చేసిన కాసేపటికే చపాతీలు గట్టిపడుతున్నాయా? - ఇలా చేశారంటే ఎన్ని గంటలైనా సూపర్ సాఫ్ట్!

చపాతీలు పొంగట్లేదా? - ఇలా చేస్తే టీవీ యాడ్స్​లో మాదిరి ఉబ్బుతాయి! - గంటలపాటు సాఫ్ట్​గా ఉంటాయి

చపాతీలు కాసేపటికే గట్టిపడుతున్నాయా? - ఇలా చేస్తే ఎన్ని గంటలైనా మృదువుగా, ఫ్రెష్‌గా ఉంటాయి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.