ETV Bharat / offbeat

పిండి లేకుండా చిలగడదుంపతో "గులాబ్​జామున్​" - నోట్లో వేసుకోగానే కరిగిపోతాయ్​! - SWEET POTATO GULAB JAMUN PROCESS

-చిలగడదుంపలతో నోరూరించే గులాబ్​ జామున్​ -ఇలా చేసుకుంటే సూపర్​ టేస్ట్​

How to Make Sweet Potato Gulab Jamun
How to Make Sweet Potato Gulab Jamun (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : 17 hours ago

How to Make Sweet Potato Gulab Jamun : చూడటానికి రెడ్​, పింక్ కలర్​లో.. కొద్దిగా మట్టితో ఉండే చిలగడదుంప.. టేస్ట్​లో మాత్రం అద్భుతంగా ఉంటుంది. పచ్చిగా తిన్నా, ఉడకబెట్టి తిన్నా ఆరోగ్యపరంగా ఎన్నో లాభాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. ఇదిలా ఉంటే చిలగడదుంపతో ఎన్నో రకాల వంటలు చేసుకోవచ్చు. అందులో గులాబ్​జామున్​ ఒకటి. బయట మార్కెట్లో లభించే గులాబ్​ జామున్​ పిండితో పలు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాకాకుండా ఉండాలంటే ఇంట్లోనే హెల్దీగా, ఎంతో రుచికరంగా ఉండే స్వీట్​ పొటాటో గులాబ్​జామున్​ ట్రై చేయండి. ఇంటిల్లిపాది ఇష్టంగా తింటారు. మరి ఈ స్వీట్​ ప్రిపరేషన్​కు కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఈ స్టోరీలో తెలుసుకుందాం..

కావాల్సిన పదార్థాలు:

  • చిలగడ దుంపలు - అర కేజీ
  • బెల్లం తురుము - 1 కప్పు
  • నీళ్లు - కప్పున్నర
  • యాలకుల పొడి - 1 టీ స్పూన్​
  • గోధుమ పిండి - 2 చెంచాలు
  • పాల పొడి - 1 చెంచా(ఆప్షనల్​)
  • ఉప్పు - చిటికెడు
  • బేకింగ్​ సోడా - చిటికెడు

తయారీ విధానం:

  • ముందుగా చిలగడదుంపలను శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్​ చేసి కుక్కర్​లో వేయాలి.
  • చిలగడదుంపలు మునిగేంతవరకు నీళ్లు పోసి మూత పెట్టుకోవాలి.
  • స్టవ్​ ఆన్​ చేసి మీడియం ఫ్లేమ్​లో పెట్టి కుక్కర్​ ఉంచి రెండు విజిల్స్​ వచ్చే వరకు ఉడికించుకుని స్టవ్​ ఆఫ్​ చేయాలి.
  • ఆవిరి పోయిన తర్వాత కుక్కర్​లో నుంచి తీసి చల్లారే వరకు పక్కన పెట్టాలి.
  • ఈ లోపు పాకం ప్రిపేర్​ చేసుకోవాలి. అందుకోసం స్టవ్​ ఆన్​ చేసి పాన్​ పెట్టి బెల్లం తురుము, నీళ్లు పోసి బెల్లాన్ని కరిగించుకోవాలి. బెల్లం కరిగిన తర్వాత స్టవ్​ను మీడియంలో పెట్టి ఓ 5 నిమిషాలు మరిగించుకోవాలి. ఇక్కడ బెల్లం పాకం అవసరం లేదు. కాస్త జిగురుగా మారితే చాలు. దింపే ముందు యాలకుల పొడి వేసి కలిపి పక్కన పెట్టాలి.
  • ఇప్పుడు చల్లారిన చిలగడదుంపల పొట్టు తీసి గ్రేటర్​ సాయంతో తురుముకోవాలి.
  • ఆ తురుములో గోధుమ పిండి, పాల పొడి, ఉప్పు, బేకింగ్​ సోడా వేసి బాగా కలుపుకోవాలి.
  • ఆ తర్వాత చిన్న చిన్న ఉండలుగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. కావాలంటే మీకు నచ్చిన షేప్​లో చేసుకోవచ్చు.
  • ఇప్పుడు స్టవ్​ ఆన్​ చేసి పాన్​ పెట్టి డీప్​ ఫ్రైకి సరిపడా నూనె పోసి వేడి చేసుకోవాలి.
  • నూనె వేడెక్కిన తర్వాత మంటను సిమ్​లో పెట్టి తయారు చేసుకున్న గులాబ్​ జామున్​లు వేసి రెండు వైపులా గోల్డెన్​ బ్రౌన్​ రంగులోకి వచ్చే వరకు వేయించుకోవాలి.
  • ఇలా అన్నింటిని వేయించుకున్న తర్వాత గోరువెచ్చగా ఉన్న బెల్లం పాకంలో వేసి ఓ గంట నుంచి 2 గంటల పాటు వదిలేసి ఆ తర్వాత తింటే అమృతమే.
  • నచ్చితే మీరు ఈ స్వీట్​ను ఇంట్లో ట్రై చేయండి. ఎలాగూ ఇప్పుడు మార్కెట్లో చిలగడదుంపలు అందుబాటులో ఉంటాయి.

సూపర్ టేస్టీ "సొరకాయ హల్వా" - ఒక్కసారి రుచి చూస్తే వదిలిపెట్టరంతే!

నోట్లో వేసుకుంటే కరిగిపోయే "బనానా బర్ఫీ" - ఈజీగా చేసుకోండిలా! - తింటే ఆహా అనాల్సిందే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.