ETV Bharat / offbeat

ఎన్ని డ్రెస్సులు ఉన్నా నా దగ్గర మంచివి లేవని బాధపడుతున్నారా? - కారణం ఇదేనట! - ORGANIZE WARDROBE

- వార్డ్‌ రోబ్‌లో బట్టలు సర్దడంలోనే సమస్య అంటున్న నిపుణులు - పలు టిప్స్​ పాటించాలని సూచన

How to Organise Wardrobe
How to Organise Wardrobe (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : 14 hours ago

How to Organise Wardrobe : కొంతమంది అమ్మాయిలకు షాపింగ్​ అంటే ఎంతో ఇష్టం. కనిపించిన డ్రెస్‌నల్లా కొంటుంటారు. అలా తెచ్చిన ఫార్మల్, ట్రెడిషనల్ డ్రెస్​లు, చీరలు, బ్లవుజు​లతో బీరువా మొత్తం నిండిపోతుంది. అయితే.. ఇన్ని డ్రెస్​లున్నా కూడా చాలా మంది ఏదైనా వేడుకకు హాజరవ్వాల్సి వచ్చినప్పుడు.. 'నా దగ్గర మంచివేం లేవు' అని అంటుంటారు. ఇలా ఫీల్​ అవ్వడానికి కారణం దుస్తులు లేకపోవడం కాదు.. వార్డ్‌రోబ్‌ని సరిగా సర్దుకోకపోవడమేనని చెబుతున్నారు ప్రొఫెషనల్‌ హోమ్‌ ఆర్గనైజర్లు. మరి ఈజీగా అన్ని డ్రెస్​లు అందంగా కనిపించేలా వార్డ్‌రోబ్‌ని ఎలా సర్దుకోవాలో ఇప్పుడు చూద్దాం.

నోట్‌బుక్‌లో రాసుకోండి :

ఎప్పుడైనా మీరు వేసుకునే దుస్తుల జతలు బీరువాలో ఎన్ని ఉన్నాయో లెక్కేశారా? అబ్బే అంత టైమ్​ మాకెక్కడిది.. అనేయకండి. ముందు ఓసారి లెక్క పెట్టండి. అప్పుడు వాటిల్లో చున్నీ రంగు వెలిసిపోయిందనో, ప్యాంట్లు బాలేదనో, బ్లౌజ్ బిగుతుగా మారిందనో.. ఏమైనా సమస్యలు కనిపిస్తే ఓ నోట్‌బుక్‌లో రాసుకుని పక్కన పెట్టండి. చివరికి ఎన్ని పెయిర్స్‌ మిగిలాయో చూసుకుని వార్డ్​రోబ్​లో పెట్టండి. మిగిలిన వాటిని ఓ బ్యాగులో సర్దితే.. బయటకి వెళ్లినప్పుడు కుట్టించడమో, దానికి కొత్తదాన్ని మ్యాచ్‌ చేయడమో చేయొచ్చు.

విడిగా పెట్టండి :

కొన్ని డ్రెస్​లు వేసుకోమని తెలిసినా, తరచూ వేసుకోలేకపోతున్నామని అర్థమైనా సరే.. తీసేయడానికి మనసొప్పదు. అలాంటివాటిని రోజువారీ దుస్తుల్లో కలపకండి. వాటిని విడిగా మరో అరలో సర్దండి. లేదంటే వీటితో బీరువా నిండుగా కనిపిస్తుంది. దీంతో మంచి డ్రెస్​లు ముందుగా కనిపించవు.

డ్రెస్​లు జారకుండా:

నార్మల్​గా హ్యాంగర్‌కు దుస్తులు తగిలిస్తుంటాం. రెండుమూడు రోజులకు వాటి నుంచి దుస్తులు జారి వార్డ్‌రోబ్‌లో కింద పడిపోయి చిందరవందరగా కనిపిస్తుంటాయి. ఇలా జారకుండా ఉండడానికి హ్యాంగర్స్‌కు చివర్లలో రెండువైపులా వెల్వెట్‌ క్లాత్‌ ముక్కలు అంటించి యాంటీస్కిడ్‌ హ్యాంగర్స్‌గా మార్చాలి. అలాగే ఒకే హ్యాంగర్‌కు అయిదారు దుపట్టాలు తగిలించకుండా వీటికోసం ప్రత్యేకంగా వస్తున్న ఆర్గనైజర్స్‌ ఉపయోగించండి. ఇంకా.. బీరువాలో మల్టీలెవెల్‌ హ్యాంగర్స్, ఫోల్డింగ్‌ బాక్సులు, డ్రాయర్‌ డివైడర్లను వాడండి. హ్యాంగింగ్‌ స్పేస్‌లో ఎక్కువ డ్రెస్​లను ఉంచడానికి స్లిమ్‌ హ్యాంగర్లను ఉపయోగించండి. అప్పుడు ఈజీగా తీసుకోవచ్చు.

కనీసం వారానికోసారైనా!

వార్డ్‌రోబ్‌లో నుంచి కావాల్సిన బట్టలు ఉపయోగించుకొని తిరిగి వాటిని మడతపెట్టి అందులో పెట్టినా ఒక్కోసారి అంతా చిందరవందరగా కనిపిస్తుంటుంది. అంతేకాదు.. డైలీ అందులో బట్టల్ని సర్దే ఓపిక, తీరిక మనకు ఉండకపోవచ్చు. అందుకే కనీసం వారానికోసారైనా లేదంటే 15 రోజులకోసారైనా ఒక గంట టైమ్​ కేటాయించి అందులో అవసరం లేని దుస్తుల్ని బయటికి తీసి, అవసరం ఉన్న వాటిని మంచిగా సర్దితే అటు నీట్‌గా కనిపిస్తుంది.. ఇటు సర్దడమూ సులువవుతుంది.

  • డ్రెస్​లను క్యాజువల్‌ వేర్, జిమ్‌వేర్, ఫార్మల్స్‌.. ట్రెడిషనల్స్‌ అంటూ విడిగా సర్దుకోండి. అలానే డైలీ వేసుకునే రకాలను రంగుల వారీగా సర్దుకోండి. దీంతో ఎప్పుడూ ఒకే తరహావి ఎంపిక చేసుకున్నామనే భావన రాదు.
  • యాక్సెసరీస్‌ అన్నింటినీ ఒక అరలో సర్దుకోండి. గాజులు, చెవిపోగులు, బెల్ట్‌లు, స్కార్ఫ్‌లు, ఇన్నర్‌వేర్‌.. వంటి వాటిని ఇలా ఒక్కోదానికి ఒక్కో ట్రాన్స్‌పరెంట్‌ బాక్స్‌ని వాడితే.. కలగాపులగం కాకుండా ఉంటాయి. అలాగే తీసుకోవడానికి సౌకర్యంగా ఉంటాయి.
  • ఎంతో ఇష్టపడి, డబ్బులు ఖర్చుపెట్టి కొన్నవి పక్కన పెట్టేయాలంటే మనసుకి కష్టంగా అనిపిస్తుంది. అలాంటివి ఎవరికైనా పేదవాళ్లకు ఇస్తే సంతోషంగా తీసుకుంటారు. అలా కాదనుకుంటే సెకండ్‌ హ్యాండ్‌ దుస్తుల్ని కొనే యాప్‌లూ ఉన్నాయి. అందులో కూడా అమ్మేయొచ్చు.

ఇవి కూడా చదవండి :

ఎన్నిసార్లు సర్దినా వార్డ్​రోబ్ చిందరవందరగా ఉందా? - ఈ తప్పులు సరిచేసుకుంటే నీట్​ అండ్​ క్లీన్​!​

'బీరువా లోపల ఈ వస్తువులు ఉండాలి - తప్పక లక్ష్మీ కటాక్షం కలుగుతుంది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.