How to Make Chaat Masala at Home:చాట్ మసాలా ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు. పకోడీ, పానీపూరీ, బఠానీ చాట్, సలాడ్, రైతా, బటర్ మిల్క్, మసాలా చాయ్, ఇలా ఒక్కటేమిటి ఎన్నో రకాల వంటకాల్లో దీనిని ఉపయోగిస్తాం. ఎందుకంటే ఈ మసాలా వేసి ప్రిపేర్ చేసిన వంటలు చాలా టేస్టీగా ఉంటాయి. అందుకే చాలా మంది ఒకేసారి ఎక్కువ మొత్తంలో మార్కెట్ నుంచి కొని తెచ్చి ఫ్రిడ్జ్‌లో పెట్టి ఉపయోగిస్తుంటారు. అయితే మార్కెట్లో కొనుగోలు చేసే చాట్ మసాలా పొడిలో రసాయనాలు కలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎన్నో రకాలుగా ఉపయోగించే ఈ పొడిని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే పోలా. మాకు రాదు అంటారా? డోంట్ వర్రీ, ఈ సింపిల్ టిప్స్‌తో చాట్ మసాలా ప్రిపేర్ చేసుకోండి. మార్కెట్లో తెచ్చిన మసాలా కంటే కూడా ఎంతో రుచిగా ఉంటుంది. మరి లేట్ చేయకుండా ఈ స్టోరీపై ఓ లుక్కేయండి.
కావాల్సిన పదార్థాలు:
- ధనియాలు - 2 టేబుల్ స్పూన్లు
- దాల్చిన చెక్క - 1 ఇంచ్
- లవంగాలు - 4
- మిరియాలు - 1 టీ స్పూన్
- జీలకర్ర - 1 టేబుల్ స్పూన్
- పుదీనా ఆకులు - పావు కప్పు
- శొంఠి - చిన్న ముక్క
- రాళ్ల ఉప్పు - 1 టీ స్పూన్
- ఇంగువు - పావు టీ స్పూన్
- బ్లాక్ సాల్ట్ - 3 టీ స్పూన్లు
- ఆమ్చూర్ పౌడర్ - 3 టేబుల్ స్పూన్లు
- పంచదార - 1 టీ స్పూన్
- వంటసోడా - పావు టీ స్పూన్
- కారం - 1 టీ స్పూన్