తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

సూపర్ టేస్టీ "సొరకాయ హల్వా" - ఒక్కసారి రుచి చూస్తే వదిలిపెట్టరంతే! - SORAKAYA HALWA RECIPE

-ఎప్పుడూ స్వీట్స్ మాత్రమే కాదు -ఓసారి వెరైటీగా సొరకాయ హల్వా ట్రై చేయండి!

Sorakaya Halwa Recipe
How to Make Sorakaya Halwa Recipe (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : 6 hours ago

How to Make Sorakaya Halwa Recipe :చాలా మందికి ఇష్టమైన స్వీట్లలో హల్వా కూడా ఒకటి. పండగలు, శుభకార్యాల సమయా​ల్లో ఎక్కువ మంది దీన్ని ప్రిపేర్ చేసుకుంటుంటారు. అయితే, మీరు ఇప్పటి వరకు క్యారెట్​, బ్రెడ్​తో హల్వా ట్రై చేసి ఉండొచ్చు. కానీ, ఓసారి "సొరకాయ హల్వాను" ప్రిపేర్ చేసుకొని చూడండి. ఎంతో తీయగా ఉండే ఈ హల్వాను ఇంటిల్లిపాదీ ఎంతో ఇష్టంగా తింటారు! దీనిని పూర్తిగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్​లో పెట్టుకుంటే వారం పాటు నిల్వ ఉంటుంది. ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు ఫ్రిడ్జ్​లో నుంచి బయటకు తీసి అర నిమిషం వేడి చేసుకుని సర్వ్​ చేసుకుంటే టేస్ట్​ అద్దిరిపోతుంది. మరి ఇక లేట్​ చేయకుండా సొరకాయ హల్వా ఎలా చేయాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు :

  • లేత సొరకాయలు-2 (చిన్నవి)
  • పాలు- ఒకటిన్నర లీటర్లు
  • పంచదార- రుచికి సరిపడా
  • యాలకులపొడి- అరటీస్పూన్
  • బాదం-15
  • జీడిపప్పు-10
  • కిస్‌మిస్‌​-10
  • నెయ్యి-1/3 కప్పు
  • పచ్చ రంగు ఫుడ్​కలర్​- కొద్దిగా

తయారీ విధానం :

  • ముందుగా సొరకాయని శుభ్రంగా కడిగి పైన చెక్కు తీసేసుకోవాలి. ఆపై సొరకాయలోని గింజలు, దూది భాగాన్ని తీసేసుకోండి.
  • గింజలు తీసేసిన సొరకాయ ముక్కలను పొడవుగా కట్​ చేసుకోవాలి.
  • ఇప్పుడు సొరకాయ ముక్కలను గ్రేటర్లో పెద్ద రంధ్రాలున్న వైపు తురుముకోవాలి.
  • ఇలా తురుముకున్న సొరకాయ మిశ్రమాన్ని నీళ్లు లేకుండా పిండి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి.
  • ఆపై బాదం, జీడిపప్పులను సన్నగా కట్​ చేసుకోండి.
  • ఇప్పుడు అడుగు మందంగా ఉండే గిన్నెను స్టౌపై పెట్టండి. ఇందులో పాలు పోయండి.
  • స్టౌ హైఫ్లేమ్​లో అడ్జస్ట్​ చేసి పాలను కలుపుతూ బాగా మరిగించండి.
  • దాదాపు పాలను 350 ml అయ్యే వరకు మరిగించాలి.
  • పాలు మరుగుతున్న సమయంలోనే మరో కడాయిలో నెయ్యి వేసి కరిగించండి.
  • నెయ్యి హీట్​ అయ్యాక బాదం, జీడిపప్పులు వేసి ఫ్రై చేయండి. ఇవి దోరగా ఫ్రై అయ్యాక.. కిస్​మిస్​ వేసి వేపండి.
  • తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి.
  • ఇప్పుడు అదే కడాయిలో నీరు పిండుకున్న సొరకాయ తురుము వేసి వేపండి. స్టౌ మీడియం ఫ్లేమ్​లో ఉంచి తురుము బాగా వేపుకోండి.
  • ఒక 15 నిమిషాల తర్వాత పంచదార వేసి కలపండి. పంచదార కరిగి హల్వా కాస్త జిగురు పాకంలా వస్తుంది. ఇందుకోసం మరో 15 నిమిషాలు ఉడికించుకోవాలి.
  • ఆపై చిక్కగా మరిగించుకున్న పాలను హల్వాలో పోసుకుని బాగా మిక్స్​ చేయాలి.
  • ఇప్పుడు యాలకుల పొడి వేసి కలపండి. ఒక 8 నిమిషాల తర్వాత హల్వా కోవాలా రెడీ అవుతుంది. ఈ సమయంలో మీకు నచ్చితే గ్రీన్ ఫుడ్​ కలర్​ వేసుకుని కలుపుకోండి.
  • ఆ తర్వాత వేపుకున్న డ్రై ఫ్రూట్స్, 2 టేబుల్​స్పూన్ నెయ్యి​ వేసి మిక్స్ చేయండి.
  • ఒక రెండు నిమిషాల తర్వాత స్టౌ ఆఫ్​ చేస్తే సరిపోతుంది. అంతే ఇలా చేస్తే ఎంతో కమ్మటి సొరకాయ హల్వా మీ ముందుంటుంది.
  • సొరకాయ హల్వా కాస్త గోరు వెచ్చగా ఉన్నప్పుడు తింటే టేస్ట్​ అద్భుతంగా ఉంటుంది.
  • ఈ హల్వా రెసిపీ నచ్చితే ఓసారి ట్రై చేయండి.

దసరా స్పెషల్ స్వీట్స్ : నోరూరించే "రవ్వ జిలేజీ, మూంగ్​దాల్ లడ్డు, పాల బూరెలు"- ఈజీ​గా చేసుకోండిలా!

సంక్రాంతి స్పెషల్​- నోరూరించే అరిసెలు, బూందీ లడ్డూ! చేయడం చాలా​ ఈజీ!

ABOUT THE AUTHOR

...view details