తెలంగాణ

telangana

పెళ్లిలో వడ్డించే కమ్మటి స్పెషల్​ సాంబార్ ​- ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా! - Wedding Style Sambar

Wedding Style Sambar : పెళ్లిళ్లలో వడ్డించే సాంబార్​ అంటే చాలా మందికి ఎంతో ఇష్టం. కానీ.. ఇంట్లో ట్రైచేస్తే ఆ రుచి రావట్లేదా? ఇలా ఈజీగా ప్రిపేర్ చేయండి.

By ETV Bharat Features Team

Published : 4 hours ago

Published : 4 hours ago

Sambar Recipe
Wedding Style Sambar Recipe (ETV Bharat)

How to Make Sambar at Home :చాలా మందికి పెళ్లిళ్లలో వడ్డించే సాంబార్​ ఎంతో నచ్చుతుంది. ఎన్ని కర్రీలు, ఫ్రైలతో అన్నం తిన్నా కూడా.. రెండు ముద్దలు సాంబార్​తో తింటే ఆ తృప్తి మరో విధంగా ఉంటుంది. అందుకే.. ఇంట్లో ఆ టేస్ట్ చూడాలని చాలా మంది ట్రై చేస్తుంటారు. కానీ.. టేస్ట్​ అంతగా రాదు. కొన్ని టిప్స్ పాటిస్తే.. ఈజీగా వెడ్డింగ్ స్టైల్ సాంబార్ తయారు చేయొచ్చు. మరి.. ప్రిపేర్​ చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానంపై ఓ లుక్కేయండి.

కావాల్సిన పదార్థాలు :

  • కంది పప్పు - కప్పు
  • క్యారెట్​ ముక్కలు - కప్పు
  • మునగకాయ ముక్కలు - కప్పు
  • సొరకాయ ముక్కలు-కప్పు
  • వంకాయలు - 3
  • పచ్చిమిర్చి - 5
  • నూనె
  • ఉప్పు - రుచికి సరిపడా
  • చింతపండు- 50 గ్రాములు
  • ఎండు మిరపకాయలు -2
  • జీలకర్ర - టేబుల్​స్పూన్
  • బెండకాయలు-3
  • టమాటాలు-2
  • ఉల్లిపాయలు-2
  • పసుపు- టీ స్పూన్​
  • కారం-2టేబుల్​స్పూన్లు
  • సాంబార్​ పౌడర్​-టేబుల్​స్పూన్
  • గరం మసాలా-టేబుల్​స్పూన్
  • కొత్తిమీర - కొద్దిగా
  • నీరు సరిపడా
  • ఆవాలు - టీ స్పూన్​
  • జీలకర్ర - టీ స్పూన్​
  • వెల్లుల్లి రెబ్బలు-5
  • కరివేపాకు -2 రెమ్మలు

తయారీ విధానం..

  • ముందుగా కూరగాయలను శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్​ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అలాగే చింతపండుని నీటిలో నానబెట్టుకోవాలి.
  • తర్వాత కందిపప్పుని రెండు సార్లు కడగాలి. ఇప్పుడు ప్రెషర్లో పప్పు వేసుకోవాలి. ఇందులో కొద్దిగా ఉప్పు, టేబుల్​స్పూన్​ నూనె, 2 గ్లాసుల నీళ్లు పోసుకుని మెత్తగా ఉడికించుకోవాలి.
  • ఇప్పుడు స్టౌపై పెద్ద గిన్నె పెట్టుకుని 2 టేబుల్​స్పూన్ల ఆయిల్​ వేసుకోవాలి.
  • ఇందులో జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి రెబ్బలు వేయాలి. తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, ఎండుమిర్చి వేసి కలపాలి.
  • ఉల్లిపాయలు మగ్గిన తర్వాత కూరగాయలన్నీ వేసి కలపాలి. తర్వాత పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి కలపాలి. ఇప్పుడు గిన్నెపై మూతపెట్టి కూరగాయలను సగానికి పైగా ఉడికించుకోవాలి.
  • తర్వాత చిక్కటి చింత పండు రసం పోసుకోవాలి. అలాగే ఉడికించుకున్న పప్పు వేసి కలపాలి. తర్వాత సాంబార్​కి సరిపడా నీళ్లు పోసుకోవాలి. సన్నని మంట మీద సాంబార్​ 15 నిమిషాలు మరిగించుకోవాలి.
  • ఇప్పుడు సాంబార్​లో కారం, సాంబార్​ పౌడర్, గరం మసాలా​ వేసి కలపాలి. అలాగే ఈ టైమ్​లోనే సాంబార్​లో రుచికి సరిపడా ఉప్పు చూసుకోవాలి. సాంబార్​ 5 నిమిషాలు మరిగించుకోవాలి.
  • స్టౌ ఆఫ్​ చేసుకునే ముందు కొత్తిమీర చల్లుకోండి. అంతే ఇలా సింపుల్​గా చేసుకుంటే టేస్టీ సాంబార్​ రెడీ.
  • నచ్చితే మీరు కూడా ఇలా వెడ్డింగ్​ స్టైల్​ సాంబార్​ ట్రై చేయండి.

ABOUT THE AUTHOR

...view details