తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

రెస్టారెంట్​ స్టైల్ "పనీర్​ ఫ్రైడ్​ రైస్" - ఇలా చేస్తే పిల్లలు వదలరు! - PANEER FRIED RICE RECIPE

-ఎప్పుడూ ఎగ్ ఫ్రైడ్ రైస్ మాత్రమే​​ కాదు.. -ఇలా పనీర్​ ఫ్రైడ్​ రైస్ ఓ సారి​ ట్రై చేయండి!

How to Make Paneer Fried Rice
How to Make Paneer Fried Rice (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Dec 12, 2024, 2:59 PM IST

How to Make Paneer Fried Rice :పనీర్​తో బిర్యానీ, ఫ్రై, మసాలా కర్రీ ఇలా ఏ రెసిపీలు చేసినా ఎంతో రుచిగా ఉంటాయి. అయితే పనీర్​తో ఎప్పుడూ చేసే వంటలే కాకుండా.. ఈ సారి కొత్తగా "పనీర్​ ఫ్రైడ్​ రైస్"​ ట్రై చేద్దాం. ఒక్కసారి ఈ పద్ధతిలో ఫ్రైడ్​ రైస్ చేస్తే రెస్టారెంట్ టేస్ట్​​లోఅద్దిరిపోతుంది. మరి ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు :

  • బాస్మతి రైస్​-గ్లాసు (150 గ్రాములు)
  • క్యారెట్​-1
  • ఉల్లిపాయ-1
  • పచ్చిమిర్చి-2
  • క్యాబేజీ తరుగు- పావుకప్పు
  • నూనె- సరిపడా
  • ఉప్పు-రుచికి సరిపడా
  • బీన్స్​-5
  • కారం-టీస్పూన్​
  • ధనియాల పొడి-టీస్పూన్
  • గరం మసాలా -అరటీస్పూన్
  • జీలకర్రపొడి-అరటీస్పూన్
  • మిరియాలపొడి-అరటీస్పూన్
  • సోయా సాస్-టేబుల్​స్పూన్
  • వెనిగర్-టేబుల్​స్పూన్
  • కొత్తిమీర తరుగు

పనీర్​ ఫ్రై చేయడం కోసం..

  • పనీర్​-100 గ్రాములు
  • ఫుడ్​ కలర్​ చిటికెడు
  • కారం-టీస్పూన్​
  • గరం మసాలా -పావు టీస్పూన్
  • ధనియాల పొడి-పావు టీస్పూన్
  • అల్లం వెల్లుల్లి పేస్ట్​-టీస్పూన్
  • కార్న్​ఫ్లోర్​-2 టేబుల్​స్పూన్లు
  • మైదా పిండి-2 టేబుల్​స్పూన్లు
  • నూనె సరిపడా
  • వెల్లుల్లి రెబ్బలు-4

తయారీ విధానం :

  • ముందుగా ఒక రెండుసార్లు బాస్మతి బియ్యాన్ని కడిగి ఒక అరగంటపాటు నానబెట్టుకోవాలి.
  • ఈ లోపు రెసిపీలోకి పనీర్​ చిన్న క్యూబ్స్​ మాదిరి కట్​ చేసుకోవాలి. అలాగే క్యారెట్​, బీన్స్​, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, క్యాబేజీ సన్నగా కట్​ చేసుకోవాలి.
  • ఇప్పుడు రైస్​ ఉడికించుకోవడం కోసం స్టౌ పై గిన్నె పెట్టండి. ఇందులో 4 గ్లాసుల నీరు, కొద్దిగా నూనె, ఉప్పు వేయండి. నీరు బాగా మరుగుతున్నప్పుడు రైస్​ వేయండి.
  • రైస్​ ఉడికిన తర్వాత గంజి వంపి పక్కన పెట్టుకోండి.
  • ఇప్పుడు ఒక మిక్సింగ్​ బౌల్లోకి పనీర్​ ముక్కలు, కారం, ఉప్పు, గరం మసాలా, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్​ వేసి బాగా కలపాలి. ఆపై కార్న్​ఫ్లోర్​, మైదా పిండి, ఫుడ్ కలర్​ వేసి కలపండి. ఇప్పుడు కొన్ని నీళ్లు యాడ్​ చేసి పనీర్​ ముక్కలకు పిండి బాగా పట్టేలా కలపండి.
  • ఇప్పుడు పనీర్​ ఫ్రై చేయడం కోసం.. స్టౌపై కడాయి పెట్టి ఆయిల్​ పోయండి.
  • నూనె వేడయ్యాక స్టౌ మీడియం ఫ్లేమ్​లో పెట్టి పనీర్ ముక్కలను ఒక్కోటిగా వేసుకోండి.
  • పనీర్​ ముక్కలు క్రిస్పీగా ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లోకి తీసుకోండి.
  • ఇప్పుడు పనీర్​ ఫ్రై రైస్ చేయడానికి స్టౌపై పాన్​ పెట్టండి. ఇందులో 2 టేబుల్​స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేయండి. ఆపై వెల్లుల్లి తరుగు వేసి ఫ్రై చేయండి.
  • అనంతరం ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించండి.
  • ఇప్పుడు స్టౌ హై ఫ్లేమ్​లో పెట్టి క్యారెట్​, బీన్స్ ముక్కలు, క్యాబేజి తురుము వేసి రెండు నిమిషాలు ఫ్రై చేసుకోండి.
  • అనంతరం ఫ్రై చేసుకున్న పనీర్​ ముక్కలు వేసి కలపండి.
  • తర్వాత ఉడికించుకున్న అన్నం వేసి మిక్స్ చేయండి. ఆపై కారం, ధనియాల పొడి, గరం మసాలా, జీలకర్రపొడి, మిరియాలపొడి, ఉప్పు వేసుకుని బాగా కలపండి.
  • మసాలాలు రైస్​కి పట్టిన తర్వాత సోయా సాస్, వెనిగర్ వేసి మిక్స్​ చేయండి. స్టౌ ఆఫ్​ చేసే ముందు కాస్త కొత్తిమీర తరుగు చల్లుకుని మిక్స్ చేయండి.
  • అంతే ఇలా చేస్తే టేస్టీ పనీర్​ ఫ్రైడ్​ రైస్​ మీ ముందుంటుంది. నచ్చితే ఈ విధంగా ఫ్రైడ్​ రైస్​ ఇంట్లో ట్రై చేయండి.

ఇవి కూడా చదవండి:

"పాలక్ పనీర్ పులావ్" - లంచ్ బాక్సులు ఖాళీ అయిపోతాయ్!

ఇంట్లోనే రెస్టారెంట్​ స్టైల్​ "పనీర్​ 65" - ఈవెనింగ్​ టైమ్​కి బెస్ట్​ స్నాక్​ - టేస్ట్​ అద్దిరిపోతుంది!

ABOUT THE AUTHOR

...view details