Moong Dal Pulao Recipe :పెసలతో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలుంటాయి. వీటిని మొలకెత్తిన తర్వాత తినడం వల్ల బరువు తగ్గడంతో పాటు, రోగనిరోధక శక్తి పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. అయితే, హెల్దీ పెసలతో మనం కుక్కర్లో పులావ్ ఎలా చేయాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం. ఈ సూపర్ టేస్టీ పెసల పులావ్ రెసిపీని పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. దీనిని లంచ్ బాక్స్‌లో కూడా పెట్టవచ్చు. వారానికి ఒకసారి ఈ పులావ్ పిల్లలకు పెట్టడం వల్ల వారు చాలా ఆరోగ్యంగా ఉంటారు. మరి ఇక లేట్ చేయకుండా స్టోరీ మొత్తం చదివి ఈ పులావ్ మీ ఇంట్లో ట్రై చేయండి.
కావాల్సిన పదార్థాలు..
- బియ్యం -2 గ్లాసులు
- పెసలు-కప్పు
- వాటర్-మూడున్నర గ్లాసులు
- దాల్చిన చెక్క
- లవంగాలు-4
- కరివేపాకు-1
- కొత్తిమీర
- పుదీనా
- బిర్యానీ ఆకు
- ఉల్లిపాయ-1
- క్యారెట్-2
- పచ్చిమిర్చి-3
- టమాటా-1
- ఉప్పు రుచికి సరిపడా
- కారం-టేబుల్‌స్పూన్
- ధనియాలపొడి-టీస్పూన్
- గరం మసాలా -అరటీస్పూన్
- పసుపు-చిటికెడు
తయారీ విధానం..
- ముందుగా బియ్యం రెండుసార్లు కడిగి.. నీటిలో అరగంట నానబెట్టుకోండి. ఈ హెల్దీ పులావ్ రెసిపీ చేయడానికి మీరు ముందు రోజు రాత్రి పెసలను నానబెట్టుకోవాలి. ఇలా పెసలను నానబెట్టుకోవడం వల్ల రెసిపీలో మరిన్ని పోషకాలుంటాయి.
- ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లో ఆయిల్ వేసి వేడి చేయండి. ఇందులో దాల్చిన చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు వేసి వేపండి. తర్వాత కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, టమాటా, క్యారెట్ ముక్కలు వేసి కలపండి.
- అవి కొంచెం మగ్గిన తర్వాత కారం, ధనియాలపొడి, గరం మసాలా, పసుపు వేసి మిక్స్ చేయండి. ఇందులో రాత్రంతా నానబెట్టుకున్న పెసలను శుభ్రంగా కడిగి వేసుకోండి.
- రెండు నిమిషాలు మగ్గించిన తర్వాత.. నానబెట్టుకున్న రైస్ వేయండి. కలిపి మూత పెట్టి కొద్దిసేపు మగ్గనివ్వండి.
- ఇప్పుడు ఇందులో మూడున్నర గ్లాసుల నీటిని పోసుకోండి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకుని.. ప్రెషర్ కుక్కర్ మూత పెట్టండి.
- ఒక మూడు విజిల్స్ వచ్చిన తర్వాత స్టౌ ఆఫ్ చేయండి. అంతే ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత సర్వ్ చేసుకుంటే టేస్టీ అండ్ హెల్దీ పెసల పులావ్ రెడీ.
- ఇలా పులావ్ చేసి పిల్లలకు పెడితే ఎంతో ఇష్టంగా తింటారు. ఈ పులావ్ ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది.