తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

టేస్టీ అండ్​ స్పైసీ "మిర్చి మసాలా ఫ్రై" - ఇలా చేస్తే ఎంతో ఇష్టంగా తినేస్తారు!

-అన్నంలోకే కాదు సైడ్​ డిష్​గా కూడా సూపర్​ -ఇలా చేస్తే విడిగా కూడా తినేస్తారు

Mirchi Masala Fry
How to Make Mirchi Masala Fry (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : 10 hours ago

How to Make Mirchi Masala Fry in Telugu:మిర్చి బజ్జీ.. చాలా మంది ఫేవరెట్​ స్నాక్​. ఎన్ని రకాల స్నాక్స్​ ఉన్నా మెజార్టీ పీపుల్​ వీటిని తినడానికే ఇష్టపడతారు. ఎందుకంటే టేస్టీగా, స్పైసీగా ఉండి తినగానే నోట్లో నీరూరుతుంది. అయితే మిరపకాయతో ఒక్క బజ్జీలు మాత్రమే కాదు.. ఎన్నో రకాల వంటలు కూడా చేసుకోవచ్చు. అందులో మిర్చి మసాలా ఫ్రై ఒకటి. దీని టేస్ట్​ చాలా బాగుంటుంది. అన్నంలోకి డైరెక్ట్​గా కలుపుకుని తిన్నా లేదా పప్పు, సాంబార్​ వంటి వాటిల్లోకి సైడ్​ డిష్​గా కూడా అద్దిరిపోతుంది. పైగా దీనిని ప్రిపేర్​ చేయాలంటే ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. కేవలం నిమిషాల్లోనే సూపర్​ టేస్ట్​తో తయారు చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఈ స్టోరీలో తెలుసుకుందాం..

మసాలా మిర్చి ఫ్రై కి కావాల్సిన పదార్థాలు:

  • బజ్జీ మిరపకాయలు - పావు కిలో
  • శనగపిండి - అర కప్పు
  • పసుపు - అర టీ స్పూన్​
  • కారం - 2 టీ స్పూన్లు
  • ధనియాల పొడి - 2 టీ స్పూన్లు
  • ఆమ్​చూర్​ పొడి - 2 టీ స్పూన్లు
  • గరం మసాలా - అర టీ స్పూన్​
  • వేయించిన జీలకర్ర పొడి - అర టీ స్పూన్​
  • కసూరీ మేథీ - 1 టీస్పూన్​
  • ఉప్పు - రుచికి సరిపడా
  • ఆయిల్​ - 4 టేబుల్​ స్పూన్లు
  • జీలకర్ర - అర టీ స్పూన్​
  • వెల్లుల్లు రెబ్బలు - 4
  • నిమ్మరసం - 2 టేబుల్​ స్పూన్లు

తయారీ విధానం:

  • ముందుగా బజ్జీ మిరపకాయలను శుభ్రంగా కడిగి నీళ్ల తడి లేకుండా తుడుచుకోవాలి. ఇలా అన్ని మిరపకాయలను శుభ్రం చేసుకోవాలి.
  • ఇప్పుడు బజ్జీ మిరపకాయ మధ్యలో గాటు పెట్టుకుని అందులోని గింజలను తీసేసుకోవాలి. ఒకవేళ స్పైసీగా తినాలనుకునేవారు గింజలను ఉంచేసిన పర్లేదు. ఇలా అన్ని మిరపకాయలను ప్రిపేర్​ చేసుకుని పెట్టుకోవాలి.
  • ఇప్పుడు స్టవ్​ ఆన్​ చేసి పాన్​ పెట్టి శనగపిండి వేసుకుని మంచి వాసన వచ్చేవరకు దోరగా వేయించుకోవాలి. అలా వేగిన తర్వాత గ్యాస్​ను సిమ్​లో పెట్టి పసుపు, కారం, ధనియాల పొడి, ఆమ్​చూర్​ పొడి, గరం మసాలా, వేయించిన జీలకర్ర పొడి, కసూరీ మేథీ, రుచికి సరిపడా ఉప్పు వేసి మసాలాలను ఓ రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి.
  • ఆ తర్వాత స్టవ్​ ఆఫ్​ చేసుకుని ఓ ప్లేట్​లోకి తీసుకోవాలి. అయితే ఇక్కడ ఆమ్​చూర్​ పొడి లేకపోతే దాని ప్లేస్​లో 1 టేబుల్​ స్పూన్​ నిమ్మరసం కలుపుకోవాలి. అయితే ఈ నిమ్మరసాన్ని పాన్​లో కలుపుకోకుండా శనగపిండి మిశ్రమాన్ని ప్లేట్​లోకి తీసుకున్న తర్వాత వేసుకుని కలుపుకోవాలి.
  • ఇప్పుడు ప్రిపేర్​ చేసుకున్న స్టఫ్​ను కట్​ చేసిన మిర్చి బజ్జీల్లో పెట్టుకోవాలి. ఇలా అన్నింటిలో శనగపిండి మిశ్రమాన్ని స్టఫ్​ చేసి పక్కకు పెట్టుకోవాలి.
  • ఇప్పుడు స్టవ్​ ఆన్​ చేసి పాన్​ పెట్టి నూనె వేసుకోవాలి. ఆయిల్​ హీటెక్కిన తర్వాత జీలకర్ర, సన్నగా తరిగిన వెల్లుల్లి వేసుకుని ఓ నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి.
  • ఆ తర్వాత స్టఫ్​ చేసుకున్న బజ్జీ మిరపకాయలను ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి. ఇలా అన్నింటిని వేసుకున్న తర్వాత ఫ్రై చేసుకోవాలి.
  • ఇలా ఒకవైపు మిర్చి మెత్తగా అయిన తర్వాత స్పూన్​ సాయంతో మిరపకాయలను మరోవైపు తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. ఈ ప్రాసెస్​లో మిరపకాయలను మెత్తగా ఉడికించకూడదు. కొద్దిగా ఫ్రై అయితే చాలు.
  • ఆ తర్వాత మిగిలిన శనగపిండి మిశ్రమాన్ని వేసుకుని చిన్నగా కలపుతూ బజ్జీ మిరపకాయలను కలుపుకోవాలి.
  • ఆ తర్వాత స్టవ్​ ఆఫ్​ చేసి మిగిలిన నిమ్మరసాన్ని వేసి కలుపుకుని సర్వ్​ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మసాలా మిర్చి ఫ్రై రెడీ!!

గుంత పొంగనాల కోసం పిండి ఎందుకు గురూ? - వీటితో క్షణాల్లో చేసేయండి - టేస్ట్​ ఎంజాయ్​ చేయండి

ఎప్పుడూ పానీపూరీ, పునుగులేనా? - ఈ సారి "మటర్ కుల్చా" ట్రై చేయండి - అద్దిరిపోయే స్ట్రీట్ ఫుడ్!

ABOUT THE AUTHOR

...view details