How to Make Masala Vada :సాయంత్రం టీ-టైమ్‌లో సమోసా, పకోడి, మిర్చీ బజ్జీతినడానికి చాలా మంది ఇష్టపడతారు. కాస్త కారంగా ఏదైనా స్నాక్ రెసిపీ తిని.. వేడివేడి టీ/కాఫీ తాగితే ఆ ఫీల్ చాలా బాగుంటుంది. అయితే.. ఇంట్లో ఎప్పుడూ రొటీన్‌గా పకోడి, బజ్జీ కాకుండా ఇలా మసాలా వడలు ట్రై చేయండి. మేం చెప్పినట్టు మసాలా వడలు చేస్తే.. అచ్చం రోడ్ సైడ్ బండి మీద లభించేంత టేస్టీగా ఉంటాయి. పిల్లలు కూడా వీటిని ఎంతో ఇష్టంగా తింటారు. మరి, అందరికీ ఇష్టమైన క్రిస్పీ అండ్ టేస్టీ మసాలా వడలుఎలా చేయాలో ఈ స్టోరీలో చూద్దాం.
కావాల్సిన పదార్థాలు :
- పచ్చి శనగపప్పు-కప్పు
- పల్లీలు-పావుకప్పు
- ఉల్లిపాయ తరుగు -అర కప్పు
- ఉప్పు - రుచికి సరిపడా
- చిన్న దాల్చినచెక్క
- లవంగాలు-4
- పసుపు - చిటికెడు
- ధనియాలు- టేబుల్‌స్పూన్
- జీలకర్ర - 1 టీస్పూన్
- పచ్చిమిర్చి - 3
- ఎండుమిర్చి-2
- కొత్తిమీర తరుగు - కొద్దిగా
- కరివేపాకు
- అల్లం ముక్క
- వెల్లుల్లి రెబ్బలు-8
- పుదీనా
- ఆయిల్ - తగినంత
తయారీ విధానం..
- ముందుగా ఒక గిన్నెలోకి పచ్చి శనగపప్పు, పల్లీలు తీసుకోవాలి. వీటిని
- శుభ్రంగా కడిగి, ఒక నాలుగు గంటలు నానబెట్టుకోవాలి. మసాలా వడల్లోకి పల్లీలు వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటాయి.
- తర్వాత మిక్సీ జార్లోకి ధనియాలు, దాల్చినచెక్క, లవంగాలు, జీలకర్ర, అల్లం ముక్క, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసి బరకగా గ్రైండ్ చేసుకోండి.
- ఇందులోకి నానబెట్టుకున్న పచ్చి శనగపప్పు వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి.
- గ్రైండ్ చేసుకునేటప్పుడు నీళ్లు పోసుకోకూడదు. (వడల పిండి కాస్త గట్టిగా ఉంటేనే మసాలా వడలు క్రిస్పీగా టేస్టీగా వస్తాయి.)
- ఇప్పుడు వడల పిండిలోకి ఉల్లిపాయ ముక్కలు, పసుపు, సన్నగా తరిగిన కరివేపాకు, కొత్తిమీర, పుదీనా వేసుకుని బాగా కలుపుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకుని మరోసారి పిండిని బాగా మిక్స్ చేయాలి.
- ఇప్పుడు వడలు డీప్ ఫ్రై చేయడానికి స్టౌ మీద కడాయి పెట్టండి. ఇందులో ఆయిల్ పోసి వేడి చేయండి.
- నూనె వేడైన తర్వాత చేతికి ఆయిల్ రాసుకుని వడలు చేసుకుని ఆయిల్లో వేయండి.
- ఒక నిమిషం తర్వాత గరిటెతో తిప్పుతూ రెండు వైపులా బాగా కాల్చుకోండి.
- మిగిలిన పిండితో ఇలానే వడలు చేసుకుంటే సరి.
- ఎంతో రుచికరమైన కరకరలాడే మసాలా వడలు రెడీ.
- నచ్చితే మీరు కూడా ఈ స్నాక్ రెసిపీ ట్రై చేయండి.