How to Make Kara Boondi : దసరా పండగ రోజున ప్రతి ఇంట్లోనూ పిండి వంటలు చేస్తుంటారు. ఇందులో కరకరలాడే బూందీ అంటే పిల్లలకు చాలా ఇష్టం. అయితే.. చాలా మందికి ఈ బూందీ పర్ఫెక్ట్గా చేయడం రాదు. కొన్ని టిప్స్ పాటిస్తే అచ్చం స్వీట్ షాప్ స్టైల్ బూందీమీ ఇంట్లో రెడీ అయిపోతుంది. మరి, దీన్ని ఎలా తయారు చేయాలి? ఇందుకోసం ఏమేం పదార్థాలు కావాలి? అన్నది ఇప్పుడు చూద్దాం. మీరు ఈ దసరా పండగ రోజు ట్రై చేయండి.
కావాల్సిన పదార్థాలు:
- 200 గ్రాముల శనగపిండి
- 2 టేబుల్ స్పూన్ల -బొంబాయి రవ్వ
- ఉప్పు-ఒక టీ స్పూన్
- వాటర్-300 మిల్లీ లీటర్ల
- పావు కప్పు పల్లీలు (వేరుశెనగ)
- పావు కప్పు జీడిపప్పు
- 5 రెబ్బల కరివేపాకు
- నూనె - డీప్ ఫ్రై కి సరిపడా
- కారం-ఒక టీ స్పూన్
- కొద్దిగా నల్ల ఉప్పు
- ఉప్పు-రుచికి సరిపడా
- పావు టీ స్పూన్ చాట్ మసాలా
తయారీ విధానం..
- ముందుగా శనగపిండిని తీసుకుని జల్లెడ పట్టుకోండి. అలాగే బొంబాయి రవ్వను మిక్సీ పట్టుకోవాలి.
- ఇప్పుడు శనగపిండిలో బొంబాయి రవ్వ, 1 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. తర్వాత కొద్ది కొద్దిగా నీరు పోసుకుంటూ ఎలాంటి గడ్డలూ లేకుండా పిండిని బాగా కలుపుకోవాలి. పిండి సరిగ్గా కలుపుకోకపోతే బూందీ గుండ్రంగా రాదు.
- ఇప్పుడు స్టౌ ఆన్ చేసి ఓ కడాయిలో ఆయిల్ పోసి వేడి చేసుకోవాలి.
- ఇప్పుడు వేడిగా ఉన్న ఆయిల్‌కు రెండు అంగుళాల దూరంలో ఓ జల్లి గంట పెట్టి దానిపై పిండిని నెమ్మదిగా కొద్దికొద్దిగా పోయాలి. ఆ తర్వాత గరిటెతో చిన్నగా తిప్పుతుంటే బూందీ ఆయిల్లోకి పడుతుంది.
- బూందీ గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై అయిన తర్వాత కడాయి నుంచి తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇలా పిండి మొత్తం బూందీ ప్రిపేర్ చేసుకోవాలి.
- ఇప్పుడు అదే ఆయిల్లో పల్లీలు వేసి దోరగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి.
- ఆ తర్వాత ఇదే విధంగా జీడిపప్పు, కరివేపాకు వేసి వేయించుకుని పక్కన ప్లేట్లోకి తీసుకోవాలి.
- ఇప్పుడు చిన్న ప్లేట్లో కారం, నల్ల ఉప్పు, ఉప్పు, చాట్ మసాలా వేసి బాగా కలపాలి.
- ఆ తర్వాత ఈ మసాలా మిశ్రమాన్ని కొద్దికొద్దిగా బూందీలో వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే ఇలా ఈజీగా చేసుకుంటే కరకరలాడే కారా బూందీ రెడీ.
- నచ్చితే మీరు కూడా మిగిలిన శనగపిండితో ఈ విధంగా బూందీ ట్రై చేయండి.
ఈ పండక్కి మీ ఇంట్లో నేతి బొబ్బట్లు చేస్తారా? - మేం చెప్పినట్టు చేస్తే రుచి అమృతమే!
దసరా స్పెషల్ : పండగ రోజున అందరికీ నచ్చే "కమ్మటి పరమాన్నం" ఇలా చేసేయండి!