తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

క్రిస్పీగా ఎంతో రుచికరంగా ఉండే "జొన్న దిబ్బరొట్టెలు"- ఇలా చేస్తే టేస్ట్​ అదుర్స్​ - షుగర్​ పేషెంట్స్​ హాయిగా తినొచ్చు! - HOW TO MAKE JONNA DIBBA ROTTI

-ఎప్పుడూ రొటీన్​ బ్రేక్​ఫాస్ట్​ ఎందుకు ? -సరికొత్తగా ఇలా జొన్న దిబ్బరొట్టెలు చేసేయండి

How to Make Jonna Dibba Rotti
How to Make Jonna Dibba Rotti (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Nov 4, 2024, 4:57 PM IST

How to Make Jonna Dibba Rotti :టిఫెన్​లంటే మనందరికీ ఇడ్లీ, దోశ, వడ గుర్తుకు వస్తుంటాయి. కానీ, ఒకప్పుడు ఇన్ని రకాల బ్రేక్​ఫాస్ట్​ ఐటమ్స్​ ఉండేవి కావు. చాలా మంది ఇంట్లోనే ఎంతో రుచికరంగా మినప్పిండితో దిబ్బరొట్టె చేసుకుని తినేవారు. ఈ దిబ్బరొట్టె చూడటానికి ఎర్రగా, బయట క్రిస్పీగా ఎంతో కమ్మగా నోరూరించేలా ఉంటుంది. అయితే, ఈ స్టోరీలో సింపుల్​గా ఎంతోటేస్టీగాజొన్న దిబ్బరొట్టెను ఎలా చేయాలో తెలుసుకుందాం. ఈ విధంగా దిబ్బరొట్టె పిండిని తయారు చేసుకుని ఫ్రిడ్జ్​లో పెట్టుకుంటే.. మూడు రోజుల వరకు కమ్మటి హెల్దీ బ్రేక్​ఫాస్ట్​ తయారు చేసుకోవచ్చు. పిల్లలకు ఈ బ్రేక్​ఫాస్ట్​ రెసిపీ చేసి తినిపిస్తే ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ దిబ్బరొట్టెలను షుగర్​తో బాధపడే వారు కూడా తినొచ్చు. మరి ఇక ఆలస్యం చేయకుండా జొన్న దిబ్బరొట్టెలు ఎలా చేయాలో ఓ సారి చదివేయండి.

కావాల్సిన పదార్థాలు :

  • మినప్పప్పు-కప్పు
  • జొన్న రవ్వ- 3 కప్పులు
  • ఉప్పు-రుచికి సరిపడా
  • నూనె సరిపడా

తయారీ విధానం :

  • ముందుగా మినప్పప్పు శుభ్రంగా కడిగి ఒక ఐదు గంటలు నానబెట్టుకోవాలి.
  • అలాగే మరొక గిన్నెలో జొన్న రవ్వ కూడా ఒక 5 గంటలు నానబెట్టుకోవాలి.
  • తర్వాత మినప్పప్పుని మిక్సీ గిన్నెలో వేసుకుని.. కూల్​ వాటర్​ యాడ్​ చేస్తూ మెత్తగా గ్రైండ్​ చేసుకోవాలి. ఈ పిండిని ఒక గిన్నెలోకి తీసుకోండి.
  • తర్వాత నానబెట్టుకున్న జొన్న రవ్వని నీళ్లు లేకుండా చేతితో పిండి.. గ్రైండ్​ చేసుకున్న మినప పిండిలో కలుపుకోవాలి.
  • తర్వాత పిండిని బాగా మిక్స్​ చేయాలి. ఈ పిండిపై మూత పెట్టి రాత్రంతా పులియనివ్వాలి.
  • ఉదయాన్నే దిబ్బరొట్టె పిండిలో రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపాలి.
  • ఇప్పుడు స్టౌపై మందంగా ఉండే పాన్​ లేదా అట్ల పెనం లేదా ఐరన్​ ముకుడు పెట్టాలి. ఇందులో టేబుల్​స్పూన్​ ఆయిల్​ వేయాలి.
  • నూనె బాగా వేడయ్యాక గరిటెతో పిండి పాన్​లో వేసుకోవాలి.
  • స్టౌ మీడియం ఫ్లేమ్​లో పెట్టి.. దిబ్బరొట్టె క్రిస్పీగాఎర్రగా బాగా కాల్చుకోవాలి.
  • దిబ్బ రొట్టె రెండువైపులా కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుంటే సరిపోతుంది.
  • ఎంతో రుచికరమైన టేస్టీ అండ్​ హెల్దీ దిబ్బరొట్టె రెడీ. ఈ దిబ్బ రొట్టెలను పల్లీ చట్నీ, టమాటా చట్నీతో తింటే టేస్ట్​ అద్దిరిపోతుంది.
  • ఈ రెసిపీ నచ్చితే మీరు కూడా ఓ సారి ఇలా ట్రై చేయండి.

కార్తికమాసం స్పెషల్​ - ఉల్లిపాయలు లేని "పూరీ కర్రీ" - టేస్ట్​ సూపర్​ - చపాతీల్లోకి కూడా పర్ఫెక్ట్​!

క్రిస్పీ అండ్​ స్పైసీ "గోధుమపిండి కారప్పూస మిక్చర్​" - ఇలా చేస్తే ఎక్కువ రోజులు తాజాగా - టేస్ట్​ సూపర్​!

ABOUT THE AUTHOR

...view details