IPL 2025 : 2025 ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కు సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. ఈ సీజన్ మార్చి 23 నుంచి ప్రారంభం కానుందని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా వెల్లడించారు. సుమారు 65 రోజుల పాటు సాగనున్న ఈ టోర్నీలో మే 25న ఫైనల్ మ్యాచ్ ఉంటుందని తెలిపారు. బీసీసీఐ ప్రత్యేక సాధారణ సమావేశం ఆదివారం ముంబయిలో జరిగింది.
ఈ క్రమంలోనే రాజీవ్ శుక్లా 2025 ఐపీఎల్ విండో ఫైనలైజ్ చేసినట్లు తెలిపారు. కాగా, పూర్తి స్థాయి షెడ్యూల్ రిలీజ్ అయ్యేందుకు మరికొంత సమయం పడుతుంది. ఫిబ్రవరి నెలలో ఫుల్ షేడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉంది.