How to Make Garlic Fried Rice :రాత్రివేళ అన్నం మిగిలిపోవడం ప్రతి ఇంట్లోనూ జరుగుతుంది. ఇదే అన్నం పొద్దున తినమంటే ఇంట్లో వాళ్లందరూ ముఖం చిట్లిస్తారు. అందుకే చాలా మంది మహిళలు తాలింపు అన్నంప్రిపేర్ చేసి పెడుతుంటారు. ఇలా చేస్తేనే అన్నం బయట పడేసే బాధ తప్పుతుంది. అయితే.. ఈ తాలింపు అన్నం ఒక్కోచోట ఒక్కో విధంగా చేస్తుంటారు. ఒకే పద్ధతి తెలిసిన వాళ్లు నిత్యం అదే చేస్తుంటే.. పిల్లలకు బోర్ కొడుతుంది. అందుకే.. మనం ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలతో సూపర్ టేస్టీగా ఉండే తాలింపు అన్నం ప్రిపేర్ చేద్దాం.
ఈ కొత్త పద్ధతిలో ప్రిపేర్ చేసే ఫ్రైడ్ రైస్తింటే ఎంతో రుచిగా ఉంటుంది. ఈ రెసిపీ ప్రిపేర్ చేయడానికి ఎక్కువ పదార్థాలు కూడా ఏమీ అవసరం లేదు. మరి ఇక లేట్ చేయకుండా ఎంతో రుచికరమైన వెల్లుల్లి కారం ఫ్రైడ్ రైస్తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా తయారు చేయాలి? అన్నది ఇప్పుడు చూద్దాం.
కావాల్సిన పదార్థాలు..
- అన్నం
- వెల్లుల్లి రెబ్బలు-12
- కారం -చెంచా
- నూనె-టేబుల్‌స్పూన్
- జీలకర్ర-అరటీస్పూన్
- ఆవాలు-అరటీస్పూన్
- పసుపు-చిటికెడు
- ఉల్లిపాయ-1
- పచ్చిమిర్చి-2
- కరివేపాకు
- ఉప్పు రుచికి సరిపడా
- కొత్తిమీర
తయారీ విధానం..
- ముందుగా వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసుకోండి. అలాగే పచ్చిమిర్చి, ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకోవాలి.
- తర్వాత రోటిలో వెల్లుల్లి రెబ్బలు, కారం, ఉప్పు వేసి మెత్తగా దంచుకోండి. అయితే.. ఈ వెల్లుల్లి కారం మిశ్రమం సిద్ధం చేస్తున్నప్పుడు నీళ్లు పోసుకోకూడదు.
- ఇప్పుడు వెల్లుల్లి కారం ముద్దని అన్నంలో వేసుకోండి. కారం పూర్తిగా రైస్‌కి పట్టేలా చేతితో బాగా కలుపుకోండి.
- ఆ తర్వాత స్టౌ ఆన్ చేసి పాన్ పెట్టండి. ఇందులో ఆయిల్ పోసి వేడి చేయండి.
- ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి వేయించండి.
- ఇవి బాగా వేగిన తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, పసుపు వేసి ఫ్రై చేయండి.
- ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత వెల్లుల్లి కారం అన్నం వేసి బాగా కలపండి.
- అంతే.. ఎంతో రుచికరమైన తాలింపు అన్నం ఇంత ఈజీగా సిద్ధమైపోతుంది. ఈ రెసిపీకి చివర్లో కాస్త కొత్తిమీర చల్లుకుంటే రుచి మరింత బాగుంటుంది.
- దీన్ని పిల్లల నుంచి పెద్దల వరకు ఎంతో ఇష్టంగా తింటారు. ఈ రెసిపీ మీకు నచ్చితే మీరు కూడా మిగిలిపోయిన అన్నంతో ట్రై చేయండి.
ఇవి కూడా చదవండి :
కేవలం 10 నిమిషాల్లోనే రుచికరమైన "పల్లీల రైస్" - పిల్లల లంచ్ బాక్స్‌లోకి పర్ఫెక్ట్ రెసిపీ!
క్షణాల్లో అద్దిరిపోయే "మినప్పప్పు ఫ్రైడ్ రైస్"- ఒక్కసారి ఇలా చేయండి- రుచి అస్సలు మర్చిపోరు!