తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

"దొండకాయ ఉల్లికారం" - ఆహా.. ఈ టేస్ట్ ఎప్పటికీ మరిచిపోలేరు! - ఇలా ప్రిపేర్ చేయండి! - Dondakaya UlliKaram - DONDAKAYA ULLIKARAM

How to Make Dondakaya UlliKaram : కొంతమంది పెద్దగా ఇష్టపడని కూరల్లో దొండకాయ ఉంటుంది. కానీ.. ఇదే కూరగాయతో ఉల్లికారం రెసిపీ తయారు చేస్తే.. మెతుకు మిగల్చకుండా తినేస్తారు! అంత అద్భుతంగా ఉంటుంది. మరి.. దీన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం.

Dondakaya UlliKaram
How to Make Dondakaya UlliKaram (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Oct 2, 2024, 4:30 PM IST

Dondakaya UlliKaram Recipe :దొండకాయ కర్రీని కొందరు ఎంతో ఇష్టంగా తింటారు. వేడివేడి అన్నం, చపాతీల్లోకి దొండకాయ కర్రీ, ఫ్రై ఏదైనా సూపర్ అంటూ లాగిస్తారు. కానీ.. కొంతమంది ఇందుకు పూర్తి భిన్నం. దొండకాయను అసలు దగ్గరికే రానివ్వరు. కర్రీ ఎంత బాగున్నా కూడా అస్సలే తినరు. ఇలాంటి పరిస్థితి మీ ఇంట్లో కూడా ఉంటే.. అప్పుడు మీరు రెసిపీ మార్చండి. అదే.. "దొండకాయ ఉల్లికారం".

కాస్త కారంగా, కాస్త ఘాటుగా ఉండే ఈ దొండకాయ ఉల్లికారం టేస్ట్ సూపర్​గా ఉంటుంది. ఇది చేయడానికి కూడా ఎక్కువ సమయం పట్టదు. ఎంతో సులభంగా దీనిని ప్రిపేర్​ చేసుకోవచ్చు. ఈ రెసిపీ టేస్ట్ చేసినవారు.. తప్పకుండా వన్స్ మోర్ అంటారు. మరి.. ఈ దొండకాయ ఉల్లికారం ఎలా తయారు చేయాలో.. ఇందుకోసం ఏమేం పదార్థాలు కావాలో ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు :

  • దొండకాయలు - పావు కిలో
  • ఎండుమిర్చి-10
  • జీలకర్ర-టీస్పూన్​
  • ఉల్లిపాయలు-2
  • ఉప్పు - రుచికి సరిపడా
  • ధనియాలు- టేబుల్​స్పూన్​
  • చింతపండు రసం-కొద్దిగా
  • ఆయిల్
  • కరివేపాకు - 2 రెమ్మలు
  • వెల్లుల్లి రెబ్బలు-10
  • కొత్తిమీర

తయారీ విధానం..

  • ముందుగా దొండకాయలను శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్​ చేసుకుని పక్కన పెట్టుకోవాలి.
  • ఉల్లిపాయలను సన్నగా కట్​ చేసుకోవాలి.
  • తర్వాత స్టౌపై పాన్​ పెట్టి రెండు టేబుల్​స్పూన్ల ఆయిల్​ వేయాలి.
  • నూనెలో జీలకర్ర, ధనియాలు, ఎండుమిర్చి వేసి వేపాలి. తర్వాత ఉల్లిపాయలు వేసి కలపండి. ఆ తర్వాత ఉప్పు వేసి మిక్స్​ చేయండి.
  • ఉల్లిపాయలు మగ్గిన తర్వాత ఈ మిశ్రమాన్ని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి.
  • మగ్గించుకున్న ఉల్లిపాయల మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత దీనిని మిక్సీ జార్లోకి తీసుకోండి. ఇందులో వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్​ చేసుకోండి.
  • ఇప్పుడు అదే పాన్​లో 2 టేబుల్​స్పూన్ల ఆయిల్​ వేయండి. ఆ తర్వాత దొండకాయలు వేసి వేపండి. కొద్దిసేపు మూతపెట్టి మధ్యమధ్యలో కలుపుతూ దొండకాయలను మగ్గించుకోండి.
  • 10 నిమిషాల తర్వాత ఇందులో కరివేపాకు, గ్రైండ్​ చేసుకున్న ఉల్లిపాయ మిశ్రమం వేయండి. అలాగే కొద్దిగా చింతపండు రసం పోసి బాగా కలుపుకోండి.
  • దొండకాయ ఉల్లికారంలో ఆయిల్​ కొద్దిగా పైకి తేలిన తర్వాత స్టౌ ఆఫ్​ చేసుకోండి.
  • ఇప్పుడు పైన కొద్దిగా కొత్తమీర చల్లుకుని కలుపుకోవాలి.
  • అంతే ఇలా ప్రిపేర్​ చేసుకుంటే ఎంతో రుచికరమైన టేస్టీ దొండకాయ ఉల్లికారం మీ ముందుంటుంది.
  • నచ్చితే మీరు కూడా ఈ దొండకాయ ఉల్లికారం ట్రై చేయండి.

నోరూరించే 'దొండకాయ 65' - నిమిషాల్లోనే రెడీ అవుతుంది - టేస్ట్ వేరే లెవల్!

నిగనిగలాడే దొండకాయలతో అద్దిరిపోయే రోటి పచ్చడి - ఇవి కలపండి - అమోఘమైన టేస్ట్ చూస్తారు!

ABOUT THE AUTHOR

...view details