తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

"చెన్నంగి ఆకు - నువ్వుల పచ్చడి" - ప్రతి ఒక్కరూ తప్పక తినాల్సిన చట్నీ - ఇలా ప్రిపేర్ చేయండి! - CHENNANGAKU PACHADI RECIPE

- అన్నం, చపాతీల్లోకి సూపర్ కాంబినేషన్ - రుచికి రుచీ.. ఆరోగ్యానికి ఆరోగ్యం!

Chennangaku Nuvvula Pachadi
Chennangaku Nuvvula Pachadi Recipe (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Oct 16, 2024, 4:44 PM IST

Chennangi aaku Nuvvula Pachadi Recipe :మనలో చాలా మందికి పచ్చళ్లంటే ఎంతో ఇష్టం. పచ్చళ్లనగానే చాలా మందికి ఆవకాయ, టమాటా, ఉసిరి వంటి నిల్వ పచ్చళ్లు మాత్రమే ఎక్కువగా గుర్తుకు వస్తుంటాయి. అయితే.. వాటికి బదులు రోటి పచ్చళ్లు ఆరగిస్తే అద్భుత రుచితోపాటు ఆరోగ్యం కూడా సొంతమవుతుంది.

అలాంటి ఒక పచ్చడి గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అదే.. చెన్నంగి ఆకు - నువ్వుల పచ్చడి. ఈ చెన్నంగి చెట్టు ఆకులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇక నువ్వుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ రెండింటి కాంబోలో పచ్చడి తయారు చేసుకుని, వేడివేడి అన్నంలో.. కాస్త నెయ్యి వేసుకుని తింటే టేస్ట్​ అద్దిరిపోతుంది. చపాతీలు, పుల్కాల్లోకి కూడా రుచి అద్భుతంగా ఉంటుంది. మరి.. ఈ చెన్నంగి ఆకు పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలి ? దానికి కావాల్సిన పదార్థాలు ఏంటీ? అన్నది ఇప్పుడు చూద్దాం.

చెన్నంగి ఆకు - నువ్వుల పచ్చడికి కావాల్సిన పదార్థాలు..

  • చెన్నంగి చెట్టు ఆకులు- కప్పు
  • నువ్వులు -టేబుల్​స్పూన్​
  • ధనియాలు-టేబుల్​స్పూన్​
  • జీలకర్ర -టీస్పూన్
  • పంచదార-చిటికెడు
  • వెల్లుల్లి రెబ్బలు-5
  • ఎండుమిర్చి-8
  • చింతపండు-తగినంత
  • ఉప్పు-రుచికి సరిపడా
  • పసుపు -చిటికెడు
  • నూనె-3 టేబుల్​స్పూన్లు

తాలింపు కోసం..

  • నూనె
  • ఆవాలు
  • జీలకర్ర
  • మినప్పప్పు
  • పచ్చిశనగపప్పు
  • కరివేపాకు

తయారీ విధానం..

  • ముందుగా స్టౌపై పాన్ పెట్టి కొద్దిసేపు నువ్వులు వేయించి పక్కన పెట్టుకోవాలి.
  • అదే పాన్​లో నూనె వేయాలి. ఇందులో ఎండుమిర్చి వేసి కొద్దిసేపు వేపుకోవాలి. తర్వాత నువ్వులు, వెల్లుల్లి రెబ్బలు వేసి వేపాలి.
  • వెల్లుల్లి రెబ్బలు వేగిన తర్వాత.. ధనియాలు, జీలకర్ర వేసి ఫ్రై చేయాలి.
  • ధనియాలు వేగిన తర్వాత ఇందులో ఇంగువ, పసుపు వేసుకుని ఫ్రై చేయాలి.
  • తర్వాత చెన్నంగి ఆకు వేసుకుని మిక్స్​ చేయాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకుని కలుపుకోవాలి.
  • ఇప్పుడు గిన్నెపై మూతపెట్టి ఒక నిమిషం అలా ఉంచాలి. తర్వాత ఇందులో చింతపండు వేసుకుని రెండు నిమిషాల పాటు వేపుకోవాలి. తర్వాత స్టౌ ఆఫ్​ చేయాలి.
  • ఈ మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకోండి. ఇందులో కొద్దిగా పంచదార వేసుకోవాలి. మధ్యలో కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పచ్చడి మెత్తగా గ్రైండ్​ చేసుకోండి.
  • పచ్చడి తాలింపు కోసం.. పాన్​లో 2 టేబుల్​స్పూన్ల ఆయిల్​ వేయండి.
  • నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, పచ్చిశనగపప్పు, కరివేపాకు వేసి ఫ్రై చేయండి.
  • తర్వాత తాలింపులో గ్రైండ్​ చేసుకున్న చెన్నంగి ఆకు పచ్చడి వేసుకుని బాగా కలపండి.
  • అంతే ఇలా సింపుల్​గా చేసుకుంటే ఎంతో రుచికరమైన చెన్నంగి పచ్చడి రెడీ.

ఇవి కూడా చదవండి :

కీరదోసను నేరుగా తినడమే కాదు - ఇలా "పచ్చడిని" ప్రిపేర్ చేసుకోండి! - అమోఘమైన రుచిని ఆస్వాదిస్తారు!

టేస్టీ అండ్​ స్పైసీ "పెరుగు ఊర కారం పచ్చడి"- వేడివేడి అన్నంలో నెయ్యితో తింటే అమృతమే!

ABOUT THE AUTHOR

...view details