ఆ కుటుంబంలో అందరూ స్టార్లే. అయినప్పటికీ ఆ నీడ తనపై పడనీయలేదు. సొంతంగానే తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. విలక్షణమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అయితే నటుడు కాకముందు జీవనోపాధి కోసం గోవాలో టీ షర్ట్లు అమ్మారు. ఇప్పుడు బాలీవుడ్లో సక్సెస్ఫుల్ యాక్టర్‌గా రాణిస్తున్నారు. ఇంతకీ అయన ఎవరంటే?
19 ఏళ్ల క్రితం ఎంట్రీ
Star Kid Sold T Shirts : 2005లో వచ్చిన 'సోచా నా థా' అనే సినిమాతో తెరంగేట్రం చేశారు బాలీవుడ్ నటుడు అభయ్ దేఓల్. ఇంతియాజ్ అలీ తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ తెచ్చుకుంది. అయితే ఈయన నటుడు కాకముందు జీవనోపాధి కోసం గోవాలోని ఫ్లీ మార్కెట్లో టీ షర్టులను అమ్మారట. చదువులోనూ అంతంతమాత్రమే ఉండటం వల్ల కాలేజీ విద్యను మధ్యలోనే ఆపేశారట.
నటుడిగా ప్రత్యేక గుర్తింపు
'ది సిటీ కాలేజ్ ఆఫ్ న్యూయార్క్'లో మూడేళ్ల యాక్టింగ్, థియేటర్ కోర్సులో శిక్షణ పొందారు అభయ్. ఆ తర్వాత బాలీవుడ్లో 2005లో రీఎంట్రీ ఇచ్చి ఆకట్టుకున్నారు. భిన్నమైన సినిమాలనే ఎంచుకంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. రీసెంట్గా 'డీజే' అంటూ ప్రేక్షకుల ముందు వచ్చి ఆకట్టుకున్నారు.
ధర్మేంద్ర సోదరుడి కొడుకే
బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్ర సోదరుడి కుమారుడే ఈ అభయ్ దేఓల్. ఇక అభయ్ తండ్రి అజిత్ నటుడు, డైరెక్టర్ కూడా. సన్నీ దేఓల్, బాబీ దేఓల్ అభయ్కు కజిన్స్ అవుతారు. అయితే తానెప్పుడూ ఫేమ్ కోసం పాకులాడలేదని అభయ్ ఓ సందర్భంలో చెప్పారు." నేను సినీ ఇండస్ట్రీకి చెందిన ఫ్యామిలీ నుంచి వచ్చాను. నేను చిన్నతనంలో ఫేమ్‌ను దగ్గరగా చూశాను. దాని కోసం ప్రయత్నిస్తే ప్రైవసీ పోతుంది. అందుకే అది నాకు నచ్చదు." అని అభయ్ తెలిపారు.
'ఓయ్ లక్కీ! లక్కీ ఓయ్', 'దేవ్ డీ', 'జిందగీ నా మిలేగీ దొబారా' లాంటి చిత్రాలతో అభయ్ గుర్తింపు తెచ్చుకున్నారు. 'మనోరమ సిక్స్ ఫీట్ అండర్' చిత్రంలో నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్నారు. అలాగే ఆయన నటించిన 'డీజే' ఇటీవలే ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ వేదికగా విడుదలై ప్రశంసలు అందుకుంది. అందులో అభయ్ నటనకు మంచి మార్కులు పడ్డాయి.
రూ.74 రెమ్యూనరేషన్ కోసం సినిమాల్లోకి వచ్చిన స్టార్ కిడ్ - కట్ చేస్తే ఇండస్ట్రీలో టాప్ హీరో ఈయనే!
అవకాశాల కోసం తండ్రిని అడగలేదు! - నిర్మాత తనయుడైనా రూ.500 కోసం పనిలోకి- ఇప్పుడు ఓ సూపర్ స్టార్‌గా!