How to Book IRCTC Tent City Prayagraj: జనవరి 13, 2025 నుంచి ఫిబ్రవరి 26, 2025 వరకు ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా ఉత్సవం జరగనుంది. ప్రపంచంలోనే మతపరంగా అతి పెద్ద పండుగల్లో ఇది ఒకటి. ఈ కుంభమేళా ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. ఎంతో విశిష్టత ఉన్న ఈ కుంభమేళాకు మీరు కూడా వెళ్లి పవిత్ర త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేయాలనుకుంటున్నారా?అయితే మీరు ముందుగా ఫ్లైట్, ట్రైన్ టికెట్‌తో పాటు టెంట్ బుకింగ్ కూడా చేసుకోవాలి. టెంట్ ఎందుకు బుక్ చేసుకోవాలి? ధర ఎంత? ఎలా బుక్ చేసుకోవాలి? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
టెంట్ బుకింగ్ ఎందుకు:ప్రయాగ్‌రాజ్ కుంభమేళాలో విపరీతమైన రద్దీ ఉంటుంది. ఎందుకంటే, ప్రపంచం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు ఇక్కడికి తరలివస్తారు. కాబట్టి ముందుగానే మీరు టెంట్ బుక్ చేసుకుంటే ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యవంతమైన బస చేయడంతో పాటు పవిత్ర త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేసి హ్యాపీగా రిటర్న్ జర్నీ చేసుకోవచ్చు. ఇందుకోసం ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం(IRCTC) మహా కుంభ్ గ్రామ్ - IRCTC Tent Cityని ఏర్పాటు చేస్తోంది.
ప్యాకేజీలు ఇవే:IRCTC టెంట్ సిటీలో మొత్తం రెండు రకాల ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి. అవి సూపర్ డీలక్స్, విల్లా.
- సూపర్ డీలక్స్:ఈ ప్యాకేజీ కావాలనుకునే వారు సింగిల్ ఆక్యూపెన్సీకి రూ.18 వేలకు వరకు చెల్లించాలి. టిఫెన్, లంచ్, డిన్నర్ ఈ ప్యాకేజీలో అందుబాటులో ఉంటాయి. డబుల్ ఆక్యూపెన్సీ అయినా రూ.18,000 చెల్లించాలి. అదనపు బెడ్ కావాలంటే రూ.5 వేలు పే చేయాలి.
- విల్లా:ఈ ప్యాకేజీ కావాలనుకుంటే ఒకరికి రూ.20 వేల వరకు చెల్లించాలి. ఇద్దరు వ్యక్తులకైనా రూ.20 వేల వరకు చెల్లించాలి. అదనపు బెడ్ కావాలంటే రూ.7 వేల వరకు చెల్లించాలి. అయితే మూడు రోజులు బస చేసే వారికి పది శాతం డిస్కౌంట్ కూడా లభించనుంది. ఒక టెంట్‌లో గరిష్టంగా ఇద్దరు పెద్దలు, ఆరేళ్లలోపు పిల్లలు ఒకరు, 11ఏళ్లకు పైబడిన పిల్లలు ఒకరిని మాత్రమే అనుమతిస్తారు.