Hotel Style Dosa Recipe in Telugu :నేటి ఉరుకుల పరుగుల జీవితంలో చాలా మందికి పొద్దున్నే టిఫెన్ ఏమిటనేది చిన్నపాటి సవాలే. త్వరగా అయిపోతుందని ఉప్మా చేసుకుందామంటే అది పెద్దగా నచ్చదు. ఇడ్లీ, దోశలకు ఒక్కోసారి పిండి రెడీగా ఉండదు. పూరీలకు చాలా సమయం పడుతుంది. మరేం చేయాలో తోచదు. అలాంటి టైమ్‌లో ఈ ఇన్‌స్టంట్ దోశ చేసి చూడండి. హోటల్ స్టైల్లో క్రిస్పీగా, టేస్టీగా ఉండే ఈ దోశ ఇంటిల్లిపాదికీ చాలా బాగా నచ్చేస్తుంది! పైగా దీన్ని చాలా తక్కువ సమయంలో ఎవరైనా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి, ఈ హోటల్ స్టైల్ క్రిస్పీ దోశకు కావాల్సిన పదార్థాలేంటి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.
కావాల్సిన పదార్థాలు :
- బొంబాయి రవ్వ - 1 కప్పు
- శనగపిండి - ముప్పావు కప్పు
- పెరుగు - అరకప్పు
- ఉప్పు - రుచికి సరిపడా
- పంచదార - అరచెంచా
- వంటసోడా - పావుచెంచా
- నూనె - తగినంత
అదుర్స్ అనిపించే "రాయలసీమ స్పెషల్ ఎగ్ కారం దోశ" - సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోండిలా!
తయారీ విధానం :
- ఇందుకోసం ముందుగా మిక్సీ జార్లో బొంబాయి రవ్వనుతీసుకొని మెత్తని, సన్నని రవ్వ మాదిరిగా గ్రైండ్ చేసుకోవాలి.
- అనంతరం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో మిక్సీ పట్టుకున్న సన్నని బొంబాయి రవ్వ, పెరుగు, ఉప్పు, పంచదార వేసుకొని అన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలి.
- అయితే, ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయమేమిటంటే.. 1 కప్పు బొంబాయి రవ్వకు రెండింతలు అంటే 2 కప్పుల మజ్జిగ అవసరం అవుతుంది. అందుకోసం మనం ఇక్కడ అరకప్పు ముందుగా పెరుగు తీసుకుంటున్నాం. మిగిలిన ఒకటిన్నర కప్పు వాటర్ మిగతా ప్రాసెస్‌లో యాడ్ చేసుకుంటాం.
- ఇప్పుడు చక్కగా మిక్స్ చేసుకున్న పిండి మిశ్రమంలో ముందుగా ఒక కప్పు వాటర్ పోసుకొని ఎక్కడా ఉండలు లేకుండా బాగా విస్క్ చేసుకోవాలి. పిండిని బాగా తేలిక పడేంత వరకు బీట్ చేసుకున్న తర్వాత దానిపై మూత ఉంచి ఒక 30 నిమిషాల పాటు అలా వదిలేయాలి.
- అరగంట తర్వాత ఆ మిశ్రమంలో మరో అరకప్పు వాటర్ యాడ్ చేసుకొని మళ్లీ పిండిని బాగా బీట్ చేసుకోవాలి.
- ఆవిధంగా పిండిని బాగా బీట్ చేసుకున్నాక అందులో వంటసోడా, కొద్దిగా నీరు వేసి మరోసారి మంచిగా కలుపుకొని పక్కన ఉంచుకోవాలి.
- ఇప్పుడు స్టౌపై దోశ పెనం పెట్టుకొని వేడి చేసుకోవాలి. పాన్ వేడయ్యాక కాస్త ఆయిల్ అప్లై చేసుకొని మీరు ప్రిపేర్ చేసుకున్న పిండిని కొద్దిగా వేసుకొని అట్టు మాదిరిగా స్ప్రెడ్ చేసుకోవాలి.
- ఆపై అట్టు కాలుతున్నప్పుడు మధ్యలో, అంచుల వెంబడి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాలి. కాసేపయ్యాక అట్టు పొంగడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు దాన్ని గరిటెతో అణచివేస్తూ కాల్చుకోవాలి. అలా చేయడం ద్వారా అట్టు పేపర్ దోశ మాదిరిగా పల్చగా వస్తుంది.
- ఇక అట్టు చక్కగా కాలి మధ్యలో ఎర్రబడుతున్నప్పుడు మరో వైపునకు టర్న్ చేసుకొని 30 సెకన్ల పాటు కాల్చుకుని మడతేసి సర్వ్ చేసుకుంటే చాలు. అంతే.. ఎంతో టేస్టీగా, క్రిస్పీగా ఉండే "హోటల్ స్టైల్ దోశ" రెడీ!
- ఈ దోశను మీకు నచ్చిన పచ్చడితో ఎంజాయ్ చేయవచ్చు. మరి, ఇంకెందుకు ఆలస్యం నచ్చితే మీరూ ఓసారి ట్రై చేసి చూడండి! ఇంటిల్లిపాదీ ఎంతో ఇష్టంగా తింటారు.
బియ్యం పిండి దోశలతో షుగర్ సమస్యా? - ఇలా "రాగి దోశలు" చేసుకోండి! - సూపర్ టేస్టీ, ఇంకా ఆరోగ్యం