తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

జామ Vs ఆరెంజ్ : ఇందులో విటమిన్ కింగ్ ఎవరో తెలుసా? - తెలుసుకుంటే మతిపోతుంది! - Guava Vs Orange Fruit - GUAVA VS ORANGE FRUIT

Guava Vs Orange Nutrition : జామపండు మంచిదా? ఆరెంజ్​ మంచిదా? ఆరోగ్యానికి ఏది బెస్ట్? ఎందులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి? మీకు తెలుసా? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

Guava Vs Orange
Guava Vs Orange Nutrition (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Aug 17, 2024, 12:11 PM IST

Guava Vs Orange Fruit :సాధరణంగా మన ఇళ్లలో జామకాయలు విరివిగా లభ్యమవుతాయి. కానీ.. ఆరెంజ్ మార్కెట్లోనే ఎక్కువగా దొరుకుతుంది. జామపండ్లతో పోలిస్తే.. ఆరెంజ్​ పండ్ల ధర కూడా కాస్త ఎక్కువగానే ఉంటుంది. మరి.. ఆరెంజ్, జామకాయల్లో ఎందులో పోషకాలు ఎక్కువగా ఉంటాయో మీకు తెలుసా? ఆ వివరాలు చూద్దాం.

జామపండ్లలో విటమిన్ C శాతం ఆరెంజ్​ పండ్లకంటే ఎక్కువగా ఉంటుంది. అలాగే ఫైబర్​, పొటాషియం స్థాయులూ జామపండ్లలోనే కాస్త అధికంగా ఉంటాయి. ఫైబర్, పొటాషియం కూడా జామలోనే ఎక్కువగా ఉంటాయి. అంతేకాదు.. ఆరెంజ్​తో పోలిస్తే జామలో తక్కువ కేలరీలు ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వారికి జామపండు సూపర్ ఛాయిస్ అని నిపుణులు చెబుతున్నారు.

​మధుమేహం అదుపులో :
జామకాయలో ఎన్నో రకాల పోషకాలున్నాయి. ఇవి మనల్ని ఆరోగ్యంగా ఉంచడంలో ఎంతో సహాయం చేస్తాయి. షుగర్​ వ్యాధితో (national library of medicine report) బాధపడేవారు తరచూ జామ పండు తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయులు అదుపులో ఉండేలా చూసుకోవచ్చు. జామకాయలో ఉండే కాపర్, ఇతర మినరల్స్​ థైరాయిడ్​ జీవక్రియలు క్రమబద్ధం చేయడానికి హార్మోన్ల ఉత్పత్తికి ఎంతగానో సహాయపడతాయి. జామకాయలో ఉండే ఫైబర్​ మలబద్ధకం సమస్యను తగ్గిస్తుందని హైదరాబాద్​కు చెందిన డాక్టర్​ అంజలీదేవి చెబుతున్నారు.

ముడతలు రావడం తగ్గుతుంది!
ఇందులోని ఎ, బి, సి విటమిన్లు, శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు వయసు పైబడుతున్న కొద్దీ వచ్చే ముడతల ప్రభావాన్ని కొంతవరకు తగ్గిస్తాయి. జామపండును రోజూ తినడం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరిగి అనారోగ్య సమస్యలు దూరమవుతాయి.

"జామకాయలో ఉండే విటమిన్​ A కంటిచూపును మెరుగుపరచడానికి, చర్మం ఆరోగ్యం ఉండడానికి ఎంతో ఉపయోగపడుతుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. జామకాయలో ఉండే పీచు పదార్థం మధుమేహులకు ఎంతో మేలు చేస్తుంది. మెదడు పనితీరుని మెరుపరుస్తుంది. రక్తపోటుతో బాధపడేవారు జామకాయ తినడం వల్ల దాన్ని అదుపులో ఉండేలా చూసుకోవచ్చు. జామ ఆకులను ఎండబెట్టి పొడి చేసుకుని తీసుకోవడం వల్ల కూడా మంచి ఫలితాలు కలుగుతాయి." - డాక్టర్​ అంజలీదేవి

  • జామపండ్లలో విటమిన్​ సి, లైకోపిన్స్, యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా లభిస్తాయి. ఇమ్యూనిటీ తక్కువగా ఉండేవారు రోజూ జామపండ్లు తినడం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చు.
  • జామకాయలో ఉండే మెగ్నీషియం మనం తినే ఆహార పదార్థాలలోని పోషకాలను సరిగ్గా స్వీకరించేలా చేస్తుంది.
  • జామకాయలో ఉండే యాంటీఆక్సిడెంట్లుల ఫ్రీ రాడికల్స్​ని బయటకు పంపడంలో కీలక పాత్ర పోషిస్తాయి. క్యాన్సర్​ కణాల వృద్ధిని అడ్డుకుంటాయి.
  • జామకాయలోని పోషకాలు, ట్రైగ్లిజరైడ్లు చెడు కొవ్వుని తగ్గించడంలో కీలకంగా పనిచేస్తాయి. ఫలితంగా గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
  • ఇందులో నీటిలో కరిగే విటమిన్​ బి, సి కొవ్వులో కరిగే విటమిన్​ ఎ అధికంగా ఉన్నాయి. జామపండు తినడం వల్ల కంటిచూపు సమస్యలు రాకుండా జాగ్రత్తపడవచ్చు.
  • దీనిలో లభించే ఫోలిక్​ యాసిడ్​ గర్భిణులకు ఎంతో మేలు చేస్తుంది. ఇందులోని బి కాంప్లెక్స్​ విటమిన్స్​ ఎర్రరక్తకణాల ఉత్పత్తికి సహాయం చేస్తాయి.

ముఖ్య గమనిక : ఈ వెబ్ సైట్ లో మీకు అందించిన ఆరోగ్య సమాచారం, వైద్య చిట్కాలు, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

ఇవి కూడా చదవండి :

జామకాయ తింటే బరువు తగ్గుతారా, షుగర్ ఉన్నవాళ్లు తినొచ్చా

జుట్టు రాలుతోందా? అయితే జామకాయ మిల్క్​షేక్​ ట్రై చేయండి!

ABOUT THE AUTHOR

...view details