తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

వినాయక చవితి స్పెషల్ : సూపర్ టేస్టీ "మలై మోదకాలు" - నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోండిలా! - Ganesh Chaturthi Special Recipe - GANESH CHATURTHI SPECIAL RECIPE

Ganesh Chaturthi Special Recipe : వినాయక చవితి ఉత్సవాల్లో రకరకాల గణపతి విగ్రహాల తర్వాత.. అత్యంత ముఖ్యమైనవి ప్రసాదాలే. లంబోదరుడు భోజనప్రియుడు అన్నసంగతి తెలిసిందే. అందుకే.. ఈ పండుగ వేళ.. బొజ్జగణపయ్యకు ఇష్టమైన మోదక్​లను ఈసారి వైరేటీగా పాలతో ఇలా ప్రిపేర్ చేసి పెట్టండి.

Ganesh Chaturthi Special Recipe
Malai Modak (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Sep 4, 2024, 4:10 PM IST

How to Make Malai Modak in Telugu : వినాయక చవితి రోజు విఘ్నేశ్వరుడి ఉదరాన్ని తృప్తిపరచాలంటే భారీ వంటకాలు చేయనక్కర్లేదు. గణేశుడు ఎంతో ఇష్టపడే.. మోదక్, ఉండ్రాళ్లు, పులిహోర, ఇతర తీపి వంటకాలు నైవేద్యంగా సమర్పిస్తే చాలు ఆయన మనసు నిండిపోతుంది. కానీ, ఏటా ఒకటే స్టైల్​లో మోదకాలు చేస్తే లంబోదరుడికి బోరు కదా..! అందుకే కాస్త ట్రెండు మార్చి.. ఇలా పాలతో వెరైటీగా మోదక్​లు(Modak)ప్రిపేర్ చేసి నైవేద్యంగా సమర్పించండి. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. పైగా ప్రిపరేషన్ కూడా చాలా ఈజీ! మరి, ఈ సూపర్ టేస్టీ మిల్క్ మోదకాలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు :

  • పాలు - 2 లీటర్లు
  • కుంకుమ పువ్వు - కొద్దిగా
  • పంచదార - 150 గ్రాములు
  • యాలకుల పొడి - అరటీస్పూన్
  • నెయ్యి - తగినంత
  • సన్నగా తరిగిన బాదంపప్పు పలుకులు - కొన్ని

వినాయక చవితి ప్రసాదాలు.. గణపయ్యకు అత్యంత ఇష్టమైనవి ఇవే!

తయారీ విధానం :

  • ఇందుకోసం ముందుగా స్టౌపై ఒక బౌల్ పెట్టుకొని పాలు పోసుకోవాలి. మంటను హై ఫ్లేమ్​లో ఉంచి పాలను బాగా వేడి చేసుకోవాలి. అయితే, పాలు అడుగు మాడిపోకుండా, పొంగిపోకుండా మధ్యమధ్యలో కలుపుకుంటూ మరిగించుకోవాలి.
  • పాలు బాగా వేడి అయ్యాక.. అందులో నుంచి పావు కప్పు నుంచి అర కప్పు మిల్క్​ను ఒక చిన్న బౌల్​లోకి తీసుకోవాలి. ఆపై వాటిలో కొంచం కుంకుమ పువ్వు వేసి కలుపుకొని కాసేపు పక్కన పెట్టుకోవాలి. అలా ఉంచడం వల్ల కుంకుమ పువ్వు ఆ వేడి పాలలో బాగా నాని పాలు కాస్త పసుపు కలర్​లోకి వస్తాయి. బయటైతే ఫుడ్ కలర్​ని వాడతారు.
  • ఇలా కుంకుమ పువ్వు యాడ్ చేయడం వల్ల మోదకాలు అనేవి బయట దొరికే వాటిలా పసుపు కలర్​లో కనిపిస్తాయి. అయితే, మీకు అందుబాటులో కుంకుమ పువ్వు లేకపోతే ఫుడ్​ కలర్​ కూడా కలుపుకోవచ్చు.
  • ఇప్పుడు స్టౌపై మరిగించుకుంటున్న పాలను మధ్య మధ్యలో గరిటెతో కలుపుకుంటూ మీగడ పాత్ర అంచులకు అంటుకోకుండా లోపలకి అనుకుంటూ బాగా వేడి చేసుకోవాలి. అంటే.. పాత్రలో పాలు సగం కంటే తక్కువగా వచ్చే వరకు కలుపుతూ మరిగించుకోవాలి.
  • పాలు సగం వరకు మరిగి చిక్కబడి, మీగడ మీగడలా వచ్చాక అందులో కుంకుమ పువ్వు కలిపి పెట్టుకున్న పాలను యాడ్ చేసుకొని కలుపుకోవాలి. అనంతరం ఆ మిశ్రమాన్ని మరో ఐదారు నిమిషాలు మధ్యమధ్యలో కలుపుతూ వేడిచేసుకోవాలి.
  • ఇప్పుడు అందులోకి రుచికి సరిపడా పంచదార వేసుకొని కలుపుకోవాలి. ఆపై మిశ్రమాన్ని మధ్యమధ్యలో కలుపుకుంటూ కాస్త దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి.
  • మిశ్రమం కాస్త దగ్గర పడ్డాక.. అందులో యాలకుల పొడి వేసి కలిపి.. కోవా పాన్ నుంచి సెపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి.
  • అయితే, ఇక్కడ మీరు ఫుల్ ఫ్యాట్పాలు(Milk) తీసుకోకుండా నార్మల్ పాలు తీసుకుంటే ఈ టైమ్​లో రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని కలుపుతూ మిశ్రమం మొత్తం దగ్గరకు అయ్యేంత వరకు ఉడికించుకోవాలి.
  • ఇకపోతే మీకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చిందో.. రాలేదో.. తెలియాలంటే గరిటెతో కొద్దిగా మిశ్రమం ప్లేట్​లోకి తీసుకొని చేతికి కొంచం నెయ్యి రాసుకొని ఆ మిశ్రమాన్ని రౌండ్ బాల్​లా చేయాలి. అప్పుడు అది పర్ఫెక్ట్​గా, చక్కగా వస్తే మీకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చిందని భావించాలి. అలాకాకుండా.. పల్చగా వస్తే మరికాసేపు ఉడికించుకోవాలి.
  • ఆవిధంగా.. మీకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చాక స్టౌ ఆఫ్ చేసుకొని గిన్నెను దించుకొని కలుపుతూ మిశ్రమాన్ని పూర్తిగా చల్లార్చుకోవాలి.
  • ఆ తర్వాత మిశ్రమాన్ని ఒక ప్లేట్​లోకి తీసుకొని మోదకాలు ప్రిపేర్ చేసుకోవాలి. అయితే ఇందుకోసం మోదకాలు చేసుకునేవి యూజ్ చేయవచ్చు. లేదంటే.. చేతితో ప్రిపేర్ చేసుకోవచ్చు.
  • ఒకవేళ చేతితో చేసుకుంటే.. చేతికి నెయ్యి రాసుకుని కొద్దిగా పాలకోవ మిశ్రమాన్ని తీసుకుని చిన్న చపాతీలా చేసుకోవాలి.
  • ఆపై అందులో కొద్దిగా బాదం పలుకులు ఉంచి మోదక్‌లా వచ్చేలా చేసుకోవాలి. ఇలా మిగిలిన పిండినీ చేసుకోవాలి. లేదంటే.. బాదం పలుకులను పాలకోవ మిశ్రమంలో కలుపుకొని కొద్ది కొద్దిగా పిండి తీసుకొని మోదక్​లా ప్రిపేర్ చేసుకోవచ్చు.
  • అంతే.. ఎంతో టేస్టీగా ఉండే మిల్క్ మోదక్​లు రెడీ! ఆపై వీటిని బొజ్జ గణపయ్యకు ప్రసాదంగా సమర్పిస్తే సరిపోతుంది.

వినాయక చవితి రోజు ఏ రాశివారు ఏ ప్రసాదం పెట్టాలి? - ఏ రంగు గణపతిని పూజిస్తే అదృష్టం?

ఒక్కో ఆకుతో ఒక్కో అనారోగ్య సమస్య దూరం! అందుకే గణపయ్యకు 21 పత్రాలతో పూజ!!

ABOUT THE AUTHOR

...view details