Egg Ponganalu Recipe :గుంత పొంగనాలకు ప్రత్యేకంగా పిండి సిద్ధం చేయాలి. కానీ.. సేమియాతో అద్దిరిపోయే పొంగనాలు తయారు చేసుకోవచ్చని మీకు తెలుసా? సేమియాతో ఉప్మా, కేసరి, పాయసంఇలా రకరకాల రెసిపీలు ట్రై చేస్తుంటారు. కానీ.. సేమియాతో ఇన్స్టంట్పొంగనాలు ప్రిపేర్ చేయొచ్చని చాలా మందికి తెలియదు.
ఇంట్లో స్నాక్స్చేయడానికి ఎక్కువ టైమ్ లేనప్పుడు చాలా త్వరగా, ఇంకా ఈజీగా "సేమియా ఎగ్ పొంగనాలు" తయారు చేసుకోవచ్చు. రుచి కూడా ఎంతో బాగుంటాయి. మరి, ఈ ఎగ్ పొంగనాల తయారీకి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు..
- సేమియా -కప్పు
- ఉల్లిపాయ తరుగు-అరకప్పు
- ఉప్పు-రుచికి సరిపడా
- కొత్తిమీర తరుగు
- చిల్లీ ఫ్లేక్స్-అరటీస్పూన్
- అరేగానో-అరటీస్పూన్
- గుడ్లు-3
- పసుపు -చిటికెడు
- కారం-అర టేబుల్‌స్పూన్
తయారీ విధానం..
- ముందుగా స్టౌపై గిన్నె పెట్టి ఇందులో ఒక గ్లాసు నీళ్లు పోసి వేడి చేయండి.
- నీళ్లు మరుగుతున్నప్పుడు కొద్దిగా ఉప్పు, సేమియా వేసి ఉడికించుకోండి.
- సేమియా మెత్తబడిన తర్వాత స్టౌ ఆఫ్ చేయండి. ఇది పూర్తిగా చల్లారనివ్వాలి.
- ఇప్పుడు ఒక గిన్నెలో ఉల్లిపాయ, కొత్తిమీర తరుగు, చిల్లీ ఫ్లేక్స్, అరేగానో, కారం, రుచికి సరిపడా ఉప్పు, పసుపు వేసుకుని కలుపుకోవాలి.
- మసాలా మిశ్రమం ఉల్లిపాయలకు పట్టిన తర్వాత ఇందులో కోడిగుడ్లు పగలగొట్టి బాగా కలుపుకోవాలి. (ఈ ఇన్స్టంట్ స్నాక్.. పొంగనాలలోకి ఎగ్స్ వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా వస్తాయి.)
- ఇప్పుడు ఈ మిశ్రమంలోకి ఉడికించుకున్న సేమియా వేసుకుని మిక్స్ చేయాలి.
- ఈ విధంగా మిశ్రమాన్ని ప్రిపేర్ చేసుకున్నాక.. పొంగనాలు ప్రిపేర్ చేసుకోవాలి.
- ఇందుకోసం స్టౌ పై గుంత పొంగనాల పాత్ర పెట్టుకొని ప్రతి గుంతలో కొద్దిగా నూనె వేసుకొని వేడి చేసుకోవాలి.
- వాటిల్లో వేసుకున్న ఆయిల్ కాస్త వేడి అయ్యాక.. ముందుగా ప్రిపేర్ చేసుకున్న మిశ్రమాన్ని తీసుకుని ఒక్కో దాంట్లో నింపుకుంటూ రావాలి.
- తర్వాత స్టౌ మీడియం ఫ్లేమ్ మీద పెట్టి.. రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకొని దించుకుంటే సరిపోతుంది.
- అంతే.. ఎంతో రుచికరమైన ఇన్స్టంట్ " సేమియా ఎగ్ పొంగనాలు" రెడీ!
- వీటి తయారీకి ఏ పిండి యూజ్ చేయలేదు కాబట్టి, ఈ ఎగ్ పొంగనాలు ఆయిల్ కూడా తక్కువగానే పీల్చుకుంటాయి.
- ఎంతో టేస్టీగా ఉండే ఈ పొంగనాలను పిల్లలు, పెద్దలు ఇష్టంగా తింటారు. పొంగనాలను సరికొత్తగా ఫీలవుతారు.
- నచ్చితే మీరు కూడా ఇలా పొంగనాలు ఒకసారి ట్రై చేయండి. ఎంజాయ్ చేయండి.
బ్రేక్‌ఫాస్ట్‌లోకి అద్దిరిపోయే రెసిపీ - తమిళనాడు స్పెషల్ "గుంట పొంగనాలు" - నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోండిలా!
కరకరలాడే సగ్గుబియ్యం పొంగనాలు తిన్నారా?