Couple Relationship Tips :నేటి ఆధునిక కాలంలో చాలా మంది దంపతులు ఉద్యోగ, వ్యాపార కార్యక్రమాలను సమానంగా చూసుకుంటున్నారు. ఈ క్రమంలో కొన్నిసార్లు భాగస్వామి ఇతర ప్రాంతాల్లో ఉండాల్సి వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో.. దంపతులుకొన్ని టిప్స్ పాటించడం వల్ల వారు భౌతికంగా దూరంగా ఉన్నా.. పక్కనే ఉన్నట్లుగా భరోసా కలిగించవచ్చని నిపుణులు చెబుతున్నారు. భార్యభర్తల మధ్య మానసికబంధాన్ని మరింత పటిష్ఠంగా మార్చే ఆ చిట్కాలు ఏంటో మీరూ చూసేయండి.
ప్రపంచంలో ఎక్కడున్నా..
ఒకప్పుడు మొబైల్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు ఇవేవీ లేనప్పుడు.. "దూరంగా ఉన్న భాగస్వామి ఎలా ఉన్నాడో.." అని దిగులుగా ఉండేది. కానీ ఇప్పుడు వాట్సాప్, వీడియో కాల్స్ వచ్చిన తర్వాత ఆ బాధ లేదు! ఈ ప్రపంచంలో ఎక్కడ ఉన్నా.. నిమిషాల్లోనే వారితో మాటలు కలపచ్చు. అందుకే సాధ్యమైనంత వరకు సాంకేతికతతో దూరాన్ని దగ్గర చేసుకునే ప్రయత్నం చేయాలి. దూరంగా ఉన్న భాగస్వామికి వీలు దొరికినప్పుడు వీడియో కాల్ చేయమని కోరాలి. తీరిక సమయం నిర్ణయించుకొని.. రోజూ ఆడియో కాల్స్ లో మాట్లాడాలి. ఈ సమయంలో తీయని పలకరింపులు దంపతులిద్దరినీ ఉత్సాహంగా ఉంచుతాయి. దీనివల్ల ఇద్దరి మధ్య బంధం మరింత మెరుగుపడుతుంది.
మనసు విప్పి మాట్లాడండి..!
ఫోన్ కాల్స్‌లో ఆరోజు ఇరువురి షెడ్యూల్, ఫుడ్, ఆరోగ్యం వంటివన్నీ ఒకరికొకరు చెప్పుకోవాలి. ఇలా ప్రశాంతంగా మాట్లాడుకుంటే.. ఇద్దరు దూరంగా ఉన్నా.. మనసులు దగ్గరవుతాయి. దీంతో భాగస్వామి దూరంగా ఉన్నాడనే ఫీలింగ్ కాస్త తగ్గిపోతుంది. అవతలివ్యక్తి పట్ల మీరు చూపించే శ్రద్ధ, వాళ్ల గురించి మీ ఆలోచన.. ఇవన్నీ వారికి మీ ప్రేమ, అప్యాయతను చెబుతాయి. కాబట్టి, వారితో మాట్లాడేటప్పుడు మనసు విప్పి మాట్లాడండి.
మీభాగస్వామి ఫోన్లో మాట్లాడేటప్పుడు ఏకాగ్రతతో వినాలి. మాట్లాడే సమయాన్ని మీ భాగస్వామి కోసమే కేటాయించాలి. తనను మీరెలా మిస్ అవుతున్నారో మాటల్లో అర్థమయ్యేలా చెప్పాలి. ఇలా తన కోసం మీరున్నారని తరచూ కాల్స్ మాట్లాడటం ద్వారా మీ భాగస్వామి ఒంటరితనంలోకి వెళ్లకుండా ఉంటారు. అయితే, ఇక్కడ ఓ విషయం ఆసక్తికరమైన విషయం ఉంది. అదేంటంటే.. ఒక చోట కలిసి ఉన్న భార్యాభర్తల కంటే దూరంగా ఉన్న దంపతులే ఎక్కువ టైమ్ మాట్లాడుకుంటున్నట్లు ఓ అధ్యయనం తేల్చిందట!
- ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఒకరినొకరు నిందించుకోకుండా ఉండాలి. తప్పునకు కారణం తెలుసుకుని మళ్లీ జరగకుండా జాగ్రత్తపడాలి. అంతేగానీ, దూరంగా ఉన్నవారిపై కోపం, సందేహం వ్యక్తపరచకూడదు.
- దంపతులిద్దరూ చిన్నచిన్న సందర్భాలను సెలబ్రేట్ చేసుకోవాలి. వర్చువల్‌గా ఇరువురూ కలిసి టైమ్ ఉన్నప్పుడు ఆన్‌లైన్‌లో గేమ్స్ ఆడొచ్చు. వీడియోకాల్స్‌లో సలహాలిచ్చుకుంటూ ఒకేరకమైన వంట రెడీ చేసుకోవచ్చు.
- ఇలా ఇరువురికీ మాట్లాడుకోవడానికి తక్కువ సమయమే ఉంటుందని నిరుత్సాహపడకుండా కొంచెం సమయం దొరికినా.. దాన్ని నాణ్యంగా మలుచుకోవాలి.
- ఫ్యూచర్ ప్లాన్స్ షేర్ చేసుకుంటూ.. జీవితాన్ని ఇద్దరూ కలిసి కలలు కనాలి. కష్టసమయాల్లో ఇద్దరూ కలిసి ముందడుగు వేయాలి.
- ఈ టిప్స్ పాటిస్తూ వైవాహికబంధాన్ని పరస్పరం గౌరవించుకుంటూ ఉండటం ద్వారా.. సప్త సముద్రాల అవతల ఉన్నా దంపతులు ఆనందంగా ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి :
పెళ్లికి ముందే కాబోయే భాగస్వామితో వీటి గురించి చర్చించండి- అప్పుడే 'హ్యాపీ మ్యారీడ్ లైఫ్'!
కొత్తగా పెళ్లి చేసుకున్నవాళ్లు - మొదటి ఏడాదిలో ఇలా చేయాలి - బంధం ఫుల్ స్ట్రాంగ్ అయిపోతుందట!