Coconut Kala jamun Recipe : అందరికీ ఇష్టమైన స్వీట్లలో గులాబ్ జామూన్ ఒకటి. అయితే, అందులో కొంచెం మార్పులతో చేసే స్వీట్ "కాలా జామూన్". అయితే కాలా జామూన్ చేయాలంటే కోవా, పాల పౌడర్ వంటి రకరకాల పదార్థాలు ఉండాలని చాలా మంది ఈ స్వీట్నిఇంట్లోట్రై చేయరు. కానీ, ఈ స్టోరీలో చెప్పిన విధంగా చేస్తే ఇవేవీ లేకుండా కేవలం కొబ్బరితోనే రుచికరమైన కాలా జామూన్ తయారైపోతుంది. మరి ఇక ఆలస్యం చేయకుండా సింపుల్‌గా ఇంట్లో ఉండే పదార్థాలతో కాలా జామూన్ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.
కావాల్సిన పదార్థాలు :
- కొబ్బరి ముక్కలు - కప్పు
- నెయ్యి - 2 టేబుల్‌స్పూన్లు
- బొంబాయి రవ్వ - కప్పు
- గోధుమ పిండి - అరకప్పు
- చక్కెర - కప్పు
- యాలకుల పొడి - అరటీస్పూన్
- నీళ్లు - సరిపడా
- ఉప్పు - చిటికెడు
తయారీ విధానం:
- ముందుగా ఒక మిక్సీ గిన్నెలో కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. ఇందులో గ్లాసు నీళ్లను పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
- తర్వాత ఒక క్లాత్‌లో కొబ్బరి మిశ్రమం వేసి పాలను గిన్నెలోకి తీసుకోవాలి.
- ఇప్పుడు స్టౌపై పాన్ పెట్టి నెయ్యి వేసి కరిగించండి. తర్వాత బొంబాయి రవ్వ వేసి 5 నిమిషాలు వేయించుకోండి.
- ఇప్పుడు ఇందులోనే గోధుమ పిండి వేసి మరో 5 నిమిషాలు ఫ్రై చేసుకోండి. తర్వాత కప్పు కొబ్బరి పాలు పోసి బాగా మిక్స్ చేయండి.
- పిండి కాస్త గట్టిగా మారిన తర్వాత చిటికెడు ఉప్పు వేసి కలిపి.. స్టౌ ఆఫ్ చేయండి.
- పిండి కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడు చేతితో రెండు నిమిషాలు మెదపండి.
- తర్వాత కాలా జామూన్ మీకు నచ్చిన ఆకారంలో చేసుకుని ప్లేట్లో పెట్టుకోండి.
- ఇప్పుడు పాకం కోసం స్టౌపై గిన్నె పెట్టండి. ఇందులో పంచదార, నీళ్లు వేసి కలపండి.
- షుగర్ కరిగి పాకం కాస్త చిక్కగా మారగానే యాలకుల పొడి వేసి కలపండి. తర్వాత స్టౌ ఆఫ్ చేయండి.
- కాలా జామూన్ వేయించడం కోసం స్టౌపై పాన్ పెట్టి సరిపడా నూనె వేయండి.
- నూనె వేడిగా ఉన్నప్పుడు స్టౌ మీడియం ఫ్లేమ్‌లో ఉంచి రెడీ చేసిన జామూన్ వేయండి.
- జామూన్ వేసిన వెంటనే గరిటెతో కదిలించకండి. ఒక 4 నిమిషాల తర్వాత మెల్లిగా ఫ్రై చేసుకోండి.
- జామూన్ బాగా వేగిన తర్వాత కాస్త వేడిగా ఉన్న షుగర్ సిరప్‌లో వేయండి.
- కాలా జామూన్‌ని ఒక రెండు గంటల పాటు అలా వదిలేయండి.
- తర్వాత తింటే సూపర్ టేస్టీగా ఉంటాయి.
- అంతే ఇలా చేసుకుంటే ఎంతో రుచికరమైన కాలా జామూన్ రెడీ.
- నచ్చితే ఈ స్వీట్ మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి.
నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోయే "కొబ్బరి జున్ను" - సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోండిలా! - టేస్ట్ వేరే లెవల్ అంతే!
దీపావళి వేళ ఈ వెరైటీ బూరెలు ఎప్పుడైనా ట్రై చేశారా? - చాలా సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు! - టేస్ట్ అద్భుతం!