తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

కిచెన్​, బాత్​రూమ్​లోని ట్యాప్స్​ జిడ్డుగా మారాయా ? ఇలా క్లీన్​ చేస్తే అప్పుడే కొన్న వాటిలా మెరుస్తాయి! - How to Clean Stainless Steel Taps

Tap Cleaning Hacks : ప్రస్తుత కాలంలో చాలా మంది తమ ఇంట్లోని సింక్​, బాత్​రూమ్​లలో స్టెయిల్‌లెస్‌ స్టీల్‌ ట్యాప్స్‌ ఫిక్స్​ చేయించుకుంటున్నారు. అయితే, కొన్ని రోజులకు వీటిపైన సబ్బు, నీటి మరకలు పడి జిడ్డుగా మారుతుంటాయి. అలానే వదిలేస్తే ఆ మరకలు మరింత జిడ్డుగా మారి అందవిహీనంగా కనిపిస్తాయి. అయితే కొన్ని టిప్స్​ పాటించి వీటిని కొత్త వాటిలా తళతళా ఎలా మెరిపించవచ్చు.

Cleaning Hacks
How to Clean Stainless Steel Taps (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Sep 22, 2024, 12:13 PM IST

How to Clean Stainless Steel Taps Easily:ఇంటిని అందంగా మార్చడానికి మహిళలు నిత్యం ప్రయత్నిస్తూనే ఉంటారు. ఇందులో భాగంగానే సింక్​, బాత్​రూమ్​లను తరచుగా క్లీన్​ చేస్తుంటారు. అయితే, చాలా మంది మహిళలు బాత్​రూమ్​, కిచెన్​ మొత్తం క్లీన్​ చేస్తారు. కానీ.. స్టెయిల్‌లెస్‌ స్టీల్‌ ట్యాప్స్‌పై పేరుకుపోయిన మరకలను అంతగా పట్టించుకోరు. దీంతో వాటిపై మరకలు పేరుకపోయి జిడ్డుగా తయారవుతుంటాయి. కొంతమంది ఈ మరకలను మాయం చేయడానికి మార్కెట్లో దొరికే ఏవేవో కెమికల్స్​ను​ ఉపయోగిస్తారు. అయితే, ఇవేవి లేకుండా ఇంట్లో ఉండే పదార్థాలతోనే ట్యాప్స్​ను కొత్త వాటిలా మెరిపించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో మీరు చూసేయండి..

నిమ్మరసం :చిన్న గిన్నెలో కొద్దిగా సర్ఫ్‌ తీసుకుని అందులో నిమ్మరసం పిండండి. దీనిని బాగా కలపండి. తర్వాత జిడ్డు మరకలున్న ట్యాప్‌పైన ఈ మిశ్రమాన్ని కొద్దిగా పూయండి. ఇప్పుడు స్క్రబర్‌తో రుద్దండి. ఐదు నిమిషాల తర్వాత క్లీన్​ చేయండి. అంతే ఇలా సులభంగా ట్యాప్‌పైన ఉన్న మొండి మరకలను తొలగించుకోవచ్చు.

టూత్ పేస్ట్ :మనం బ్రష్‌ చేయడానికి డైలీ యూజ్​ చేసే.. టూత్‌పేస్ట్‌తోనూ ట్యాప్‌లను క్లీన్‌ చేయొచ్చు. అదేలాగో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్​ పాత బ్రష్‌పై కొద్దిగా పేస్ట్‌ అప్లై చేసి మురికిగా ఉన్న ట్యాప్‌లను బాగా రుద్దాలి. ఒక పది నిమిషాల తర్వాత వాటర్​తో క్లీన్​ చేస్తే సరిపోతుంది. ఇలా చేస్తే ట్యాప్​లపైన ఉన్న ఎలాంటి మొండి మరకలైనా తొలగిపోతాయి.

వెనిగర్ :ఒక గిన్నెలో కొద్దిగా వైట్‌ వెనిగర్‌ తీసుకుని.. అందులో కొద్దిగా వాటర్​ కలపండి. తర్వాత ఇందులో స్పాంజ్‌ లేదా స్క్రబర్‌ వేసి.. 5 నిమిషాలు అలా వదిలేయండి. ఇప్పుడు స్క్రబర్‌తో మురికిగా ఉన్న స్టీల్‌ ట్యాప్‌లను బాగా రుద్దండి. ఐదు నిమిషాల తర్వాత వాటర్​తో కడిగేయండి. ఇలా వారానికి ఒకసారి క్లీన్​ చేయడం వల్ల ట్యాప్‌లు ఎప్పుడూ కొత్తవాటిలా మెరుస్తాయి.

బేకింగ్ సోడా, నిమ్మరసం :ముందుగా ఒక గిన్నెలో రెండు టేబుల్​స్పూన్ల బేకింగ్​ సోడా తీసుకుని.. అందులో ఒక నిమ్మకాయ పిండుకోవాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలపాలి. తర్వాత జిడ్డుగా ఉన్న ట్యాప్స్​పై ఈ మిశ్రమాన్ని కొద్దిగా వేసి నిమ్మచెక్కతో రుద్దాలి. ఇలా చేస్తే ఈజీగా ట్యాప్స్​ క్లీన్​ చేసుకోవచ్చు. ఈ చిన్న టిప్స్​ పాటించడం వల్ల స్టెయిన్​లెస్​ స్టీల్​ ట్యాప్స్​ ఈజీగా క్లీన్​ చేసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి :

సూపర్ ఐడియా : కిచెన్​లో సింక్‌ నీళ్లతో నిండిపోయి బ్యాడ్‌ స్మెల్‌ వస్తోందా? - ఈ సింపుల్‌ చిట్కాలతో పూర్తిగా క్లీన్ చేసేయండి!

ఎంత తోమినా గిన్నెల మీద జిడ్డు పోవడం లేదా? - ఇలా చేస్తే చాలు చిటికెలో మాయం!

ABOUT THE AUTHOR

...view details