తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

స్కూల్ పిల్లలు, ఆఫీస్​కి వెళ్లే వారి కోసం లంచ్ బాక్స్ స్పెషల్ - చిటికెలో చేసే కమ్మని "క్యారెట్ రైస్"! - CARROT RICE RECIPE

తక్కువ టైమ్​లో లంచ్ బాక్స్​లోకి అద్దిరిపోయే రెసిపీ - రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం!

Carrot Rice Recipe in Telugu
Carrot Rice Recipe (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Dec 3, 2024, 7:13 PM IST

Carrot Rice Recipe in Telugu :పిల్లలు స్కూళ్లకు, పెద్దవాళ్లు ఆఫీసులకు వెళ్లేటప్పుడు పొద్దుటి పూట ఇంట్లో అమ్మలు చేసే హడావుడి అంతాఇంతా కాదు. ఎందుకంటే.. వారికి మార్నింగ్ బ్రేక్​ఫాస్ట్ ప్రిపేర్ చేసి పెట్టాలి. ఆపై మధ్యాహ్నం కోసం లంచ్ బాక్స్ సిద్ధం చేసి ఇవ్వాలి. అందుకోసం అన్నం, కర్రీ ప్రిపేర్ చేయాలి. ఇదంతా కాస్త టైమ్​తో కూడుకున్న పని. అయితే, డైలీ అన్నం, పప్పు, కూర.. వంటివన్నీ చేయాలని చూడకుండా ఓసారి ఇలా "క్యారెట్ రైస్"​ని లంచ్ బాక్స్​లోకి ప్రిపేర్ చేసి ఇవ్వండి. రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం. పైగా దీన్ని చాలా తక్కువ సమయంలో తయారు చేసుకోవచ్చు. ముఖ్యంగా పిల్లలైతే చాలా చాలా ఇష్టంగా తింటారు! ఇంతకీ, ఈ సూపర్ టేస్టీ అండ్ హెల్దీ రెసిపీకి కావాల్సిన పదార్థాలేంటి? తయారీ విధానం ఏంటో ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు :

  • సన్నని క్యారెట్ తురుము - 1 కప్పు
  • అన్నం - 1 కప్పు
  • నూనె - పావు కప్పు
  • బిర్యానీ ఆకులు - రెండు
  • జీడిపప్పు పలుకులు - 15
  • దాల్చిన చెక్క - అంగుళం ముక్క
  • లవంగాలు - 5
  • యాలకులు - 5
  • ఉల్లిపాయ - 1
  • పచ్చిమిర్చి - 2
  • కరివేపాకు - 2 రెమ్మలు
  • ఉప్పు - రుచికి సరిపడా
  • సాంబార్ పౌడర్ - 1 టీస్పూన్
  • పచ్చికొబ్బరి తురుము - 2 టేబుల్​స్పూన్లు
  • నిమ్మరసం - కొద్దిగా
  • కొత్తిమీర తరుగు - 2 టేబుల్​స్పూన్లు

సూపర్ లంచ్ బాక్స్ రెసిపీ : తమిళనాడు స్టైల్ "వెజ్ కుష్కా" - దీని టేస్ట్ ముందు బిర్యానీ కూడా బలాదూర్!

తయారీ విధానం :

  • ఇందుకోసం ముందుగా ఉల్లిపాయనుసన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. అలాగే క్యారెట్ తురుముని ప్రిపేర్ చేసుకొని సిద్దంగా ఉంచుకోవాలి.
  • ఇప్పుడు స్టౌపై పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నూనె కాస్త వేడయ్యాక దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, బిర్యానీ ఆకులు, జీడిపప్పు పలుకులు వేసి ఎర్రగా మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి.
  • అవి వేగాక అందులో ముందుగా తరిగి పెట్టుకున్న సన్నని ఉల్లిపాయ తరుగు, పచ్చిమిర్చి చీలికలు, కరివేపాకు వేసుకొని ఆనియన్స్ మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలి.
  • ఆ తర్వాత సన్నని క్యారెట్తురుము వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అందుకోసం 4 నుంచి 5 నిమిషాల సమయం పట్టొచ్చు.
  • ఆవిధంగా వేయించుకున్నాక ఆ మిశ్రమంలో ఉప్పు, సాంబార్ పౌడర్ వేసి మొత్తం కలిసేలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి.
  • అనంతరం మంటను లో ఫ్లేమ్​లో ఉంచి ఉడికించుకున్నటువంటి అన్నం వేసుకొని మిశ్రమం మొత్తగా చక్కగా కలిసేలా బాగా కలుపుకోవాలి. ఆపై పచ్చికొబ్బరి తురుము వేసుకొని మరోసారి మిక్స్ చేసుకోవాలి.
  • ఆ తర్వాత నిమ్మరసం పిండుకొని, కొత్తిమీర తరుగు వేసుకొని కలిపి దింపేసుకుంటే చాలు. అంతే.. ఎంతో రుచికరంగా ఉండే "క్యారెట్ రైస్" రెడీ!
  • మరి, ఈ రెసిపీ నచ్చిందా అయితే మీరూ ఓసారి ట్రై చేయండి!!

లంచ్ బాక్స్​లోకి అద్దిరిపోయే రెసిపీ - కర్ణాటక స్పెషల్ "వైట్ చిత్రాన్నం" - చిటికెలో ప్రిపేర్ చేసుకోండిలా!

ABOUT THE AUTHOR

...view details