Kitchen Cleaning Tips :ఇంటిల్లిపాదీ ఆరోగ్యంగా ఉండడంలో కిచెన్ కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి వంటగదిని ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవడం చాలా అవసరం. కానీ, నేటి ఉరుకుల పరుగుల జీవితంలో చాలా మంది కిచెన్ శుభ్రత విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహారిస్తుంటారు. దాంతో వివిధ ఆరోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటుంటారు. అందుకు ప్రధాన కారణం ఎక్కువ మంది కిచెన్ క్లీనింగ్ని పెద్ద టాస్క్‌లా ఫీల్ అవుతుంటారు.
ఈ క్రమంలోనే కొందరు వీకెండ్లోకిచెన్ క్లీనింగ్ పని పెట్టుకుంటుంటారు. కానీ, అప్పుడు ఒకేసారి వంటగది మొత్తం శుభ్రం చేసుకోవాలంటే కాస్త అధికంగా శ్రమించాల్సి వస్తుంది. కాబట్టి, అలాకాకుండా రోజువారీ కొన్ని చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యారంటే ఎప్పటికప్పుడు కిచెన్‌ని నీట్‌గా, శుభ్రంగా ఉంచుకోవచ్చంటున్నారు నిపుణులు. పైగా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చంటున్నారు. ఇంతకీ, ఆ టిప్స్ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
సింక్‌ని శుభ్రంగా ఉంచుకోవడం : కిచెన్‌లో సింక్‌ని శుభ్రంగా ఉంచుకోవడం చాలా అవసరం. లేదంటే అక్కడ బ్యాక్టీరియా పేరుకుపోయి ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. అలాగే దుర్వాసనను వస్తూ ఉంటుంది. దాంతో ఇంట్లో ఉండాలంటే ఇబ్బందికరంగా అనిపిస్తుంది. కాబట్టి సింక్‌ని ఎప్పటికప్పుడు ఉప్పు నీరు, సర్ఫ్ వంటి వాటితో శుభ్రం చేయాలి. అలాగే, దుర్వాసన రాకుండా ఉండడానికి అప్పుడప్పుడు నిమ్మరసం, బేకింగ్ సోడా వంటివి ఉపయోగించి సింక్‌ని క్లీన్ చేసుకోవాలి.
స్టీల్ సింక్ వాడుతున్నారా? - ఇలా క్లీన్ చేస్తేనే జిడ్డు, దుర్వాసన పోయి కొత్తదానిలా!