Tulasi Benefits for Hair and Skin : అందంగా కనిపించాలని ప్రతిఒక్కరికీ ఉంటుంది. ఈ క్రమంలోనే చాలా మంది జుట్టు, చర్మ సౌందర్యాన్ని పెంపొందించుకోవడం కోసం మార్కెట్లో లభించే వివిధ రకాల సౌందర్య ఉత్పత్తులు వాడుతుంటారు. అయితే, అవి మాత్రమే కాదు.. ప్రతి ఇంట్లో సులువుగా పెరిగే తులసి చెట్టు కూడా అందుకు చాలా బాగా ఉపయోగపడుతుందంటున్నారు సౌందర్య నిపుణులు. ప్రత్యేకించి జుట్టు, దంత సంరక్షణకు తులసి ఆకులు బాగా దోహదపడుతాయని చెబుతున్నారు. అందుకోసం వీటిని ఎలా వాడాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
జుట్టు ఆరోగ్యానికి..
తులసిలోని ఔషధ గుణాలు కేశ సౌందర్యాన్ని, ఆరోగ్యాన్ని మెరుపరచడానికి చాలా బాగా ఉపయోగపడతాయంటున్నారు నిపుణులు. కొంతమంది తలలో చుండ్రు, దురద, చిన్న చిన్న కురుపులు రావడం వంటి సమస్యలతో బాధపడుతుంటారు. అలాంటి సమస్యలకు చెక్ పెట్టడంలో తులసి నూనె చాలా చక్కగా పనిచేస్తుందంటున్నారు.
ఇందుకోసం తులసి ఆకులను పొడి చేసి (సుమారు పది స్పూన్ల పొడి), ఆ పొడిని ఒక డబ్బా కొబ్బరి నూనెలో కలిపి వేడి చేయాలి. ఆయిల్ వేడెక్కడం స్టార్ట్ అయ్యాక అందులో కొన్ని మెంతులు వేసుకోవాలి. అవి నూనెలో ఉడికిన తరువాత స్టౌ ఆఫ్ చేసి ఆయిల్‌ను చల్లారనివ్వాలి. ఆ తర్వాత పొడిగా ఉన్న సీసాలో ఆ మిశ్రమాన్ని స్టోర్ చేసుకొని వారానికి రెండుసార్లు దాంతో మసాజ్ చేసుకొని గంట తరువాత తలస్నానం చేస్తే సమస్య ఈజీగా పరిష్కారమవుతుందంటున్నారు. అదేవిధంగా ఆ నూనెలో మెంతులు, తులసి కలిసి ఉండడం వల్ల వెంట్రుకలు ఆరోగ్యవంతంగా కూడా తయారవుతాయని చెబుతున్నారు.
దంత సంరక్షణకు..