Health Benefits of Apple Juice:ఆరోగ్యాన్నిచ్చే పండ్లు అనగానే చాలా మందికి మొదటగా గుర్తొచ్చేవి.. యాపిల్స్. అంతేకాదు.. అనారోగ్యంతో బాధపడుతున్నవారికి పండ్లు తీసుకెళ్లేవారు ఎవరైనా సరే మొదటగా ఈ పండ్లకే ప్రాధాన్యత ఇస్తుంటారు. నిజానికి యాపిల్స్‌లో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోషకాలు, ఔషధ గుణాలు సమృద్ధిగా ఉంటాయి. అయితే, యాపిల్‌ను(Apple) డైరెక్ట్‌గా తినడం మాత్రమే కాదు.. రోజూ జ్యూస్ రూపంలో తీసుకున్నా బోలెడు హెల్త్ బెనిఫిట్స్ పొందవచ్చంటున్నారు నిపుణులు. ఇంతకీ, డైలీ యాపిల్ జ్యూస్ తాగడం వల్ల ఎలాంటి పోషకాలు లభిస్తాయి? ఏ విధమైన ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
పోషకాల పవర్ హౌస్ : అన్ని సీజన్లలోనూ అందుబాటులో ఉండే యాపిల్‌ను సూపర్ ఫుడ్‌గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే.. ఈ పండులో సి, బి, కె -విటమిన్లు, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, పొటాషియం, కాపర్‌తో పాటు మరికొన్ని పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి, యాపిల్ పండు డైరెక్ట్‌గా తిన్నా, జ్యూస్ చేసుకొని డైలీ తాగినా అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయంటున్నారు నిపుణులు. వాటిల్లో కొన్నింటిని పరిశీలిస్తే..
జీర్ణ సమస్యలకు చెక్ :డైలీ యాపిల్ జ్యూస్ తాగడం ద్వారా జీర్ణక్రియను మెరుగుపరచుకోవచ్చంటున్నారు నిపుణులు. ముఖ్యంగా యాపిల్‌లో ఫైబర్ అధిక మొత్తంలో ఉంటుంది. కాబట్టి రోజూ యాపిల్ జ్యూస్ తాగడం వల్ల మలబద్ధకం, ఇతర జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చంటున్నారు.
మంచి ఇమ్యూనిటీ బూస్టర్ :యాపిల్‌లో విటమిన్ సితో(National Library of Medicine రిపోర్టు)పాటు యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి, డైలీ యాపిల్ జ్యూస్ తీసుకోవడం ద్వారా ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవచ్చంటున్నారు నిపుణులు. ఫలితంగా ఇన్ఫెక్షన్లు, అంటువ్యాధులు, అనారోగ్య సమస్యల బారినపడకుండా కాపాడుకోవచ్చని చెబుతున్నారు.
మీరు యాపిల్ పండ్లని పొట్టు తీసి తింటున్నారా? - అలా చేస్తే ఏం జరుగుతుందో తెలుసా?
గుండె ఆరోగ్యానికి మేలు : డైలీ యాపిల్ జ్యూస్ తీసుకోవడం వల్ల గుండె సమస్యల బారిన పడకుండా కాపాడుకోవచ్చంటున్నారు నిపుణులు. ముఖ్యంగా యాపిల్‌లో ఫ్లేవనాయిడ్స్, పాలీఫెనాల్స్, పీచు, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ గుండె ఆరోగ్యానికి ఎంతగానో దోహదపడతాయని చెబుతున్నారు. అలాగే యాపిల్ జ్యూస్‌లో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించే గుణాలు ఉంటాయంటున్నారు. అదేవిధంగా రక్తపోటును(Blood Pressure)కంట్రోల్లో ఉంచుకోవడానికి ఇందులోని పోషకాలు సహాయపడతాయంటున్నారు.
2019లో "బ్రిటీష్ మెడికల్ జర్నల్"లో ప్రచురితమైన అధ్యయం ప్రకారం యాపిల్ జ్యూస్‌ను క్రమం తప్పకుండా తాగడం వల్ల కార్డియోవాస్క్యులర్ ప్రమాదాలను తగ్గిస్తుందని కనుగొన్నారు. ఈ పరిశోధనలో అట్లాంటలోని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ లో ఎపిడెమియాలజిస్ట్ డాక్టర్ Quan Yang పాల్గొన్నారు. యాపిల్ జ్యూస్ తాగడం వల్ల అందులో ఉండే పోషకాలు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయని ఆయన పేర్కొన్నారు.
బరువు తగ్గడానికి సహాయపడుతుంది :వెయిట్ లాస్ అవ్వాలనుకునేవారికి యాపిల్ జ్యూస్ మంచి ఎంపికగా చెప్పుకోవచ్చంటున్నారు నిపుణులు. ఎందుకంటే.. దీనిలో ఉండే ఆధిక ఫైబర్‌తో పాటు మరికొన్ని పోషకాలు బరువు తగ్గడానికి చాలా బాగా తోడ్పడుతాయని చెబుతున్నారు.
బాడీని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది : డైలీ శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడం చాలా అవసరం. అందుకు డైలీ యాపిల్ జ్యూస్ తాగడం చాలా బాగా సహాయపడుతుందంటున్నారు. ఎందుకంటే.. యాపిల్‌లో వాటర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. అలాగే.. శరీరంలోని మలినాలను బయటకు పంపించడంలో ఇందులోని పోషకాలు చాలా బాగా సహాయపడుతాయని చెబుతున్నారు నిపుణులు. అయితే యాపిల్ జ్యూస్ మంచిది కదా అని బయట మార్కెట్లో లభించే వాటిని తాగడం కన్నా ఇంట్లో చేసుకుని తాగడమే మంచిదంటున్నారు.
NOTE :ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
రెడ్ యాపిల్ Vs గ్రీన్ యాపిల్ - డయాబెటిస్ పేషెంట్స్‌కు ఈ రెండింటిలో ఏది మంచిది!