తెలంగాణ

telangana

ETV Bharat / offbeat

అసలు సిసలైన ఆంధ్రా స్టైల్​ "నాటుకోడి వేపుడు" - ఈ పద్ధతిలో చేశారంటే తినేకొద్దీ తినాలనిపిస్తుంది!

-ఎంతగానో నోరూరించే చికెన్ రెసిపీ - సీక్రెట్ అంతా ప్రిపేరేషన్​లోనే!

By ETV Bharat Telugu Team

Published : 4 hours ago

Andhra Style Country Chicken Fry
Andhra Style Country Chicken Fry in Telugu (Etv Bharat)

Andhra Style Country Chicken Fry in Telugu:నాటు కోడి.. ఈ పేరుకు ఉన్న క్రేజ్​ వేరే లెవల్​. దీనితో కూర వండుకుని తింటే ఆ రుచే వేరు. వేడి వేడి గారెలను నాటుకోడి పులుసులో అద్దుకుని తింటే స్వర్గం దిగిరావాల్సిందే! అలా ఉంటుంది దీని టేస్ట్​. అయితే నాటుకోడితో కేవలం పులుసు మాత్రమే కాదు.. అద్దిరిపోయే ఫ్రై కూడా చేసుకోవచ్చు. పైకి ముక్క క్రిస్పీగా, లోపల జ్యూసీగా చాలా బాగుంటుంది. మరి, అలాంటి నాటుకోడి ఫ్రైని ఆంధ్రా స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో.. ఈ స్టోరీలో చూద్దాం.

ఆంధ్రా​ నాటుకోడి ఫ్రైకి కావాల్సిన పదార్థాలు:

  • నాటు కోడి ముక్కలు - అరకేజీ
  • ఉప్పు - రుచికి సరిపడా
  • కారం - రుచికి సరిపడా
  • పసుపు- అర టీ స్పూన్​
  • అల్లం వెల్లుల్లి పేస్ట్​ - 1 టీ స్పూన్​
  • నూనె - 5 టేబుల్​ స్పూన్లు
  • ధనియాలు - 1 టేబుల్​ స్పూన్​
  • దాల్చిన చెక్క - 2 ఇంచ్​లు
  • లవంగాలు - 5
  • యాలకులు -3
  • జీలకర్ర- అర టీ స్పూన్​
  • ఎండు కొబ్బరి ముక్కలు - కొద్దిగా
  • అల్లం - 2 ఇంచ్​లు
  • వెల్లుల్లి రెబ్బలు -12
  • పచ్చిమిర్చి - 3
  • ఉల్లిపాయ - 1 పెద్దది
  • కరివేపాకు రెమ్మలు -2
  • కొత్తిమీర తరుగు - కొద్దిగా

తయారీ విధానం:

  • ముందుగా స్టవ్​ ఆన్​ చేసి పాన్​ పెట్టి నాటుకోడి ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు, పసుపు, 1 టీ స్పూన్​ కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి.
  • అప్పుడు చికెన్​లో వాటర్ వస్తుంది. ఆ వాటర్​ మొత్తం ఇంకిపోయేంత వరకు ముక్కలను మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోవాలి. నీరు ఇంకిపోయిన తర్వాత స్టవ్​ ఆఫ్​ చేసి పక్కకు పెట్టుకోవాలి.
  • ఇప్పుడు స్టవ్​ ఆన్​ చేసి ఐరన్​ కడాయి పెట్టి నూనె వేసుకోవాలి. ఆయిల్​ హీటెక్కిన తర్వాత ఉడికించిన చికెన్​ ముక్కలు వేసి వేయించుకోవాలి.
  • చికెన్​ ముక్కలు మంచి కలర్​లోకి వచ్చే వరకు మంటను మీడియం ఫ్లేమ్​లో పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ముక్క రంగు మారే వరకు వేయించుకోవాలి.
  • ఈ లోపు మరో స్టవ్​ మీద పాన్​ పెట్టి ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, జీలకర్ర, ఎండు కొబ్బరి ముక్కలు వేసి మంచి వాసన వచ్చేవరకు దోరగా వేయించుకోవాలి.
  • ఇవి చల్లారిన తర్వాత మిక్సీజార్​లోకి వేసి గ్రైండ్​ చేసుకుని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీజార్​లో అల్లం, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్​ చేసుకోవాలి.
  • ముక్కలు ఎరుపు రంగులోకి మారిన తర్వాత మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి మిశ్రమం వేసుకుని మంటను లో-ఫ్లేమ్​లో పెట్టి పచ్చివాసన పోయేవరకు మగ్గించుకోవాలి.
  • ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి అవి ఫ్రై అయ్యేంతవరకు వేయించుకోవాలి. అయితే మామూలు చికెన్​ కన్నా నాటు కోడి ఉడకటానికి ఎక్కువ టైమ్​ పడుతుంది కాబట్టి ఉల్లిపాయ ముక్కలను మధ్యలో వేసుకోవాలి. ముందే వేసుకుంటే నాటు కోడి మగ్గేలోపు ఉల్లిపాయ ముక్కలు మాడిపోతాయి. ఇంకో విషయం ఏంటంటే నాటుకోడి కుకింగ్​కి ఎక్కువ టైమ్​ పట్టిద్ది కాబట్టి కొంచెం ఓపికతో మధ్యమధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి.
  • ఆ తర్వాత కరివేపాకు రెమ్మలు, రుచికి సరిపడా కారం వేసుకుని ముక్కలకు కారం పట్టేలా కలుపుకోవాలి.
  • అనంతరం ముందే గ్రైండ్​ చేసుకున్న మసాలా వేసి ముక్కలకు బాగా పట్టేలా కలిపి స్టవ్​ ఆఫ్​ చేసుకోవాలి. ఎక్కువ సేపు ఉంచితే మసాలాలు మాడి టేస్ట్​ మారిపోతుంది.
  • ఆ తర్వాత కొత్తిమీర వేసుకుని సర్వ్​ చేసుకుంటే అద్దిరిపోయే రుచితే ఆంధ్రా స్టైల్​ నాటుకోడి వేపుడు రెడీ! మరి మీరు ఓ సారి ట్రై చేస్తారా?

ABOUT THE AUTHOR

...view details